Monday, March 6, 2017
అట్టహాసంగా ప్రారంభమైన ఎపి అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు
పల్లెల్లో నుండి ప్రజాప్రతినిధుల
కార్ల పరుగులు,,,మరోవైపు పోలీసులు హడాహుడి..,,,,అదో పండుగ వాతావరణం... ఎపి
రాష్ట్రంలో సొంతగడ్డపై తొట్టతొలి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు అమరావతిలో కనిపించిన
చిత్రాలివి...ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు మరోవైపు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ల
ప్రక్రియతో వెలగపూడిలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కలర్ ఫుల్ గా కనిపించాయి.
రాష్ట్ర విభజన తరువాత పదేళ్ళ వరకు హైద్రాబాద్ నుండి పాలన కొనసాగాల్సి ఉన్నా,
ముఖ్యమంత్రి చంద్రబునాయుడు పట్టుదలతో సొంతగడ్డ నుండే పాలనకు శ్రీకారం చుట్టారు.
రెండున్నరేళ్ళ కాలంలోనే సచివాలయం తోపాటు, అసెంబ్లీ భవనాలను రాజధాని అమరావతిలో
నిర్మించి పరిపాలనను ఇక్కడి నుండే చేపట్టారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలతోనే
అమరాతిలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు అంగరంగ వైభవంగా
మొదలయ్యాయి.. ఉదయం 9గగంటల ప్రాంతానికే అసెంబ్లీకి చేరుకున్న స్పీకర్ కోడెల
శివప్రసాద్, అసెంబ్లీ పరిసరాలన్నీ కలియతిరుగుతూ ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా
అధికారులు, పోలీసులకు అదేశాలు, సూచనలు
చేశారు. 9.30 గంటల నుండే అధికార
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులు ఒక్కొక్కరుగా తమ వాహనాల్లో
అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. సినీనటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అందరికంటే
ముందే అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉత్సాహంగా కలియతిరిగారు. మీడియాతోను కొంత
సేపు ముచ్చటించారు. మరోవైపు ప్రధాన
ప్రతిపక్షం వైసిపి విజయవాడలో తమ అధినేత జగన్ నేతృత్వంలో వైసిఎల్సీ సమావేశం
నిర్వహించుకుని అధినేతతో కలసి బస్సులో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ
గేటు బయట కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుయువత కార్యకర్తలు లోకేష్ కు
అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతలో అక్కడికి చేరుకున్న వైసిపి యువత
కార్యకర్తలు , తెలుగు యువత కార్యకర్తలకు ధీటుగా జగన్ కు అనుకూలంగా నినాదాల
హోరెత్తించారు. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నంత పరిస్ధితులు
ఎదురుకాగా పోలీసులు చాకచక్యంగా ఇరుపార్టీల యువత కార్యకర్తలను సముదాయించి అక్కడి
నుండి పంపివేశారు. సరిగ్గా 11గంటల 6 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభల
నుద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. విభజన తరువాత , ప్రభుత్వం అధికారం
చేపట్టిన అనతికాలంలోనే భూసేకరణ జరిపి తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టం దగ్గర
నుండి ఈప్రాంత అభివృద్ధికి ఏ విధంగా
పాటుపడుతుందో గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల
నిర్మాణంతోపాటు, ఉపాధి, పెట్టుబడుల రాక
కోసం ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం ఏంచేయబోతుందో నరసింహన్ వివరించారు.
అసెంబ్లీ లాబీల్లో ఓటుకునోటుపై అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ
అసెంబ్లీ లాబీల్లో ఓటుకునోటుపై అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ
అసెంబ్లీ తొలిరోజు సమావేశాల సందర్భంగా లాబీల్లో ఏ ఇద్దరు నేతలు ఎదురుపడ్డా ఒకే విషయంపై ముచ్చటించుకోవటం చర్చనీయాంశంగా మారింది..... అదే ఓటుకు నోటు కేసు..... హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకునోటు కేసుపై సుఫ్రీంకోర్టును ఆశ్రయించటంతో, కోర్టు, చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో సుఫ్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ తొలిరోజు సమావేశాల సందర్భంగా లాబీల్లో అతృతగా చర్చించుకుంటూ కనిపించారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల సంగతేమో కాని ఓటుకు నోటు కేసులో సుఫ్రిం కోర్టు నోటీసులు జారీ చేసిన వైనం అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం సమావేశాలు ప్రారంభం సందర్భం మొదలు, గవర్నర్ ప్రసంగం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తరువాత కూడా లాబీల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇదే విషయంపై ఆసక్తికరమైన మాట్లాడుతూ కనిపించారు. హైకోర్టు తీర్పుతో తమ నేత చంద్రబాబుకు కొంత ఉపసమనం లభించిందనుకున్న తరుణంలో, పిడుగులాంటి న్యూస్ వినాల్సిరావటం పట్ల ఒకవిధంగా టిడిపి ఎమ్మెల్యేలు షాక్ గురైన వాతావరణం లాబీల్లో కనిపించింది. సుఫ్రిం కోర్టులో ఎలాంటి కౌంటర్ దాఖలు చేయనున్నారు, ముఖ్యమంత్రి సుఫ్రీంకోర్టులో హాజరుకావాల్సి ఉంటుందా...అన్న విషయాలపై అసెంబ్లీ లాబీల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవటం ఒకింత ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మీడియా సమావేశానికి ముందు అటు మీడియా ప్రతినిధులు సైతం చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారోనన్న ఆతృత కనిపించింది. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు మాత్రం ఎవరు కోర్టులకు వెళ్ళినా ఏమౌతుందంటూ సమాధానమిచ్చారు...
Subscribe to:
Posts (Atom)