అసెంబ్లీ లాబీల్లో ఓటుకునోటుపై అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ
అసెంబ్లీ లాబీల్లో ఓటుకునోటుపై అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ
అసెంబ్లీ తొలిరోజు
సమావేశాల సందర్భంగా లాబీల్లో ఏ ఇద్దరు నేతలు ఎదురుపడ్డా ఒకే విషయంపై
ముచ్చటించుకోవటం చర్చనీయాంశంగా మారింది..... అదే ఓటుకు నోటు కేసు..... హైకోర్టు
తీర్పును సవాల్ చేస్తూ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకునోటు కేసుపై
సుఫ్రీంకోర్టును ఆశ్రయించటంతో, కోర్టు, చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ
వ్యవహారంలో సుఫ్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని తెలుగుదేశం పార్టీ
ఎమ్మెల్యేలు అసెంబ్లీ తొలిరోజు సమావేశాల సందర్భంగా లాబీల్లో అతృతగా చర్చించుకుంటూ
కనిపించారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల సంగతేమో కాని ఓటుకు నోటు కేసులో సుఫ్రిం కోర్టు
నోటీసులు జారీ చేసిన వైనం అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం
సమావేశాలు ప్రారంభం సందర్భం మొదలు, గవర్నర్ ప్రసంగం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన
తరువాత కూడా లాబీల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇదే విషయంపై
ఆసక్తికరమైన మాట్లాడుతూ కనిపించారు. హైకోర్టు తీర్పుతో తమ నేత చంద్రబాబుకు కొంత
ఉపసమనం లభించిందనుకున్న తరుణంలో, పిడుగులాంటి న్యూస్ వినాల్సిరావటం పట్ల ఒకవిధంగా
టిడిపి ఎమ్మెల్యేలు షాక్ గురైన వాతావరణం లాబీల్లో కనిపించింది. సుఫ్రిం కోర్టులో ఎలాంటి
కౌంటర్ దాఖలు చేయనున్నారు, ముఖ్యమంత్రి సుఫ్రీంకోర్టులో హాజరుకావాల్సి
ఉంటుందా...అన్న విషయాలపై అసెంబ్లీ
లాబీల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవటం ఒకింత ఆసక్తికరంగా
మారింది. చంద్రబాబు మీడియా సమావేశానికి ముందు అటు మీడియా ప్రతినిధులు సైతం
చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారోనన్న ఆతృత కనిపించింది. అయితే దీనిపై స్పందించిన
చంద్రబాబు మాత్రం ఎవరు కోర్టులకు వెళ్ళినా ఏమౌతుందంటూ సమాధానమిచ్చారు...
No comments:
Post a Comment