Monday, March 6, 2017

అట్టహాసంగా ప్రారంభమైన ఎపి అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు

అట్టహాసంగా ప్రారంభమైన ఎపి అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు 




పల్లెల్లో నుండి ప్రజాప్రతినిధుల కార్ల పరుగులు,,,మరోవైపు పోలీసులు హడాహుడి..,,,,అదో పండుగ వాతావరణం... ఎపి రాష్ట్రంలో సొంతగడ్డపై తొట్టతొలి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు అమరావతిలో కనిపించిన చిత్రాలివి...ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు మరోవైపు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియతో వెలగపూడిలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలన్నీ కలర్ ఫుల్ గా కనిపించాయి.  రాష్ట్ర విభజన తరువాత పదేళ్ళ వరకు హైద్రాబాద్ నుండి పాలన కొనసాగాల్సి ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబునాయుడు పట్టుదలతో సొంతగడ్డ నుండే పాలనకు శ్రీకారం చుట్టారు. రెండున్నరేళ్ళ కాలంలోనే సచివాలయం తోపాటు, అసెంబ్లీ భవనాలను రాజధాని అమరావతిలో నిర్మించి పరిపాలనను ఇక్కడి నుండే చేపట్టారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలతోనే అమరాతిలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.  తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.. ఉదయం 9గగంటల ప్రాంతానికే అసెంబ్లీకి చేరుకున్న స్పీకర్ కోడెల శివప్రసాద్, అసెంబ్లీ పరిసరాలన్నీ కలియతిరుగుతూ ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు, పోలీసులకు అదేశాలు,  సూచనలు చేశారు. 9.30 గంటల నుండే  అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులు ఒక్కొక్కరుగా తమ వాహనాల్లో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. సినీనటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అందరికంటే ముందే అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉత్సాహంగా కలియతిరిగారు. మీడియాతోను కొంత సేపు ముచ్చటించారు.  మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసిపి విజయవాడలో తమ అధినేత జగన్ నేతృత్వంలో వైసిఎల్సీ సమావేశం నిర్వహించుకుని అధినేతతో కలసి బస్సులో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ గేటు బయట కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుయువత కార్యకర్తలు లోకేష్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతలో అక్కడికి చేరుకున్న వైసిపి యువత కార్యకర్తలు , తెలుగు యువత కార్యకర్తలకు ధీటుగా జగన్ కు అనుకూలంగా నినాదాల హోరెత్తించారు. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నంత పరిస్ధితులు ఎదురుకాగా పోలీసులు చాకచక్యంగా ఇరుపార్టీల యువత కార్యకర్తలను సముదాయించి అక్కడి నుండి పంపివేశారు. సరిగ్గా 11గంటల 6 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభల నుద్దేశించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. విభజన తరువాత , ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతికాలంలోనే భూసేకరణ జరిపి తాత్కాలిక రాజధాని నిర్మాణం చేపట్టం దగ్గర నుండి  ఈప్రాంత అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు,  ఉపాధి, పెట్టుబడుల రాక కోసం ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం ఏంచేయబోతుందో నరసింహన్ వివరించారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం రేపటికి సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి గవర్నర్ ప్రసంగంపై స్పందించారు. ఓ విజన్ తో రాష్ట్ర అభివృద్ధిని చేస్తున్నామన్నారు. తుఫాన్లు, వర్షాభావ పరిస్ధితులు రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారినప్పటికీ వాటన్నింటిని అదిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగంలో స్పస్టత,నిబద్ధత ఉందని, ఈప్రసంగం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. అదే క్రమంలో వైసిపి నేతలు గవర్నర్ ప్రసంగంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం గవర్నర్ చేత అన్నీ అబద్దాలు చెప్పిదంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ కూడా అసెంబ్లీలోనే కొనసాగింది. చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తోపాటు, కరణం బలరామకృష్ణ మూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, బచ్చు అర్జునుడులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు వైసిపికి చెందిన ఇద్దరు నేతలు ఆళ్ళ నాని, గంగుల ప్రభాకర రెడ్డిలు ఎమ్మెల్యే కోటా క్రింద ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవైపు అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు, మరోవైపు ఎమ్మెల్సీల నామినేషన్ల ప్రక్రియతో అసెంబ్లీ ప్రాంగణమంతా సందడిగా కనిపించింది.
  మొత్తానికి తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగానే జరిగాయని చెప్పాలి...

అసెంబ్లీ లాబీల్లో ఓటుకునోటుపై అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ

అసెంబ్లీ లాబీల్లో ఓటుకునోటుపై అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆసక్తికర చర్చ


అసెంబ్లీ తొలిరోజు సమావేశాల సందర్భంగా లాబీల్లో ఏ ఇద్దరు నేతలు ఎదురుపడ్డా ఒకే విషయంపై ముచ్చటించుకోవటం చర్చనీయాంశంగా మారింది..... అదే ఓటుకు నోటు కేసు..... హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకునోటు కేసుపై సుఫ్రీంకోర్టును ఆశ్రయించటంతో, కోర్టు, చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో సుఫ్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ తొలిరోజు సమావేశాల సందర్భంగా లాబీల్లో అతృతగా చర్చించుకుంటూ కనిపించారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల సంగతేమో కాని ఓటుకు నోటు కేసులో సుఫ్రిం కోర్టు నోటీసులు జారీ చేసిన వైనం అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం సమావేశాలు ప్రారంభం సందర్భం మొదలు, గవర్నర్ ప్రసంగం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తరువాత కూడా లాబీల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇదే విషయంపై ఆసక్తికరమైన మాట్లాడుతూ కనిపించారు. హైకోర్టు తీర్పుతో తమ నేత చంద్రబాబుకు కొంత ఉపసమనం లభించిందనుకున్న తరుణంలో, పిడుగులాంటి న్యూస్ వినాల్సిరావటం పట్ల ఒకవిధంగా టిడిపి ఎమ్మెల్యేలు షాక్ గురైన వాతావరణం లాబీల్లో కనిపించింది. సుఫ్రిం కోర్టులో ఎలాంటి కౌంటర్ దాఖలు చేయనున్నారు, ముఖ్యమంత్రి సుఫ్రీంకోర్టులో హాజరుకావాల్సి ఉంటుందా...అన్న విషయాలపై  అసెంబ్లీ లాబీల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవటం ఒకింత ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మీడియా సమావేశానికి ముందు అటు మీడియా ప్రతినిధులు సైతం చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారోనన్న ఆతృత కనిపించింది. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు మాత్రం ఎవరు కోర్టులకు వెళ్ళినా ఏమౌతుందంటూ సమాధానమిచ్చారు...

Monday, December 5, 2016

scrapped notes found with actor Balakrishna's wife

scrapped notes found with actor Balakrishna's wife




Scrapped notes valued Rs.10 lakh were found in the possession of popular Telugu actor and TDP legislator N. Balakrishna's wife Vasundhara Devi at Renigunta Airport near here.The cash was found when she was checking out along with five family members after landing from Hyderabad on Saturday.
The airport security officials and later income tax officials questioned her about the huge cash, all in demonetised notes of Rs 1,000 and Rs 500, sources said.
Vasundhara showed IT documents to the officials and told them that she brought the money for offering it to Lord Venkateswara temple. She said they were going to drop the money in the temple 'hundi'.The officials allowed her and other family members to proceed to the temple.Balakrishna is a leader of ruling Telugu Desam Party (TDP). He is the member of Andhra Pradesh state legislative assembly from Hindupu. The actor is brother-in-law of Chief Minister and TDP president N. Chandrababu Naidu. Balakrishna's daughter is also married to Naidu's son Lokesh.

Sunday, December 4, 2016

ఆన్ లైన్ షాపింగ్ తస్మాత్ జాగ్రత్త...

 జాగ్రత్తలు పాటిస్తూ క్రెడిట్, డెబిట్ కార్డులను వాడండి 


మీరు క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఒక్క క్ష‌ణం. ఇక‌ముందు ఆన్‌లైన్‌లో వ‌స్తువులు కొనేముందు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించండి. లేదంటే ఆరంటే ఆరు సెక‌న్ల‌లో మీ కార్డులోని స‌మ‌స్త స‌మాచారాన్ని హ్యాక‌ర్లు త‌స్క‌రించే ప్ర‌మాదం ఉంది. ఈమాట‌న్న‌ది మ‌రెవ‌రో కాదు.. బ్రిట‌న్‌లోని న్యూకేజిల్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు. డెబిట్‌, క్రెడిట్ కార్డుల వాడ‌కంలోని లోపాలపై అధ్య‌య‌నం చేసిన వారు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసానికి గుర‌య్యే మార్గాల‌ను బ‌య‌టపెట్టారు.

త‌ప్పుడు సమాచారంతో హ్యాక‌ర్లు చేసే ప‌లు ప్ర‌య‌త్నాల‌ను వీసా వ్య‌వ‌స్థ కానీ, బ్యాంకులు కానీ ప‌సిగ‌ట్ట‌లేక‌పోతున్నాయ‌ని ప‌రిశోధ‌న‌కారులు పేర్కొన్నారు. దీంతో స్వ‌యంచాలిత స‌మాచారంతో కార్డుల్లోని స‌మాచారాన్ని హ్యాక‌ర్లు దొంగిలించే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు. వెబ్‌సైట్ల‌లో ప‌లుమార్లు ప్ర‌య‌త్నించ‌డం ద్వారా కావాల్సిన స‌మాచారాన్ని తెలుసుకోగ‌లుగుతున్నారని, కేవ‌లం ఆరు సెక‌న్ల‌లోనే కావాల్సిన సమాచారంపై ఓ అంచ‌నాకు వ‌చ్చేస్తున్నార‌ని వారు వివ‌రించారు. చిన్న ల్యాప్‌టాప్‌, దానికో నెట్ కనెక్ష‌న్ ఉంటే హ్యాక‌ర్ల‌కు దొరికిపోయే అవ‌కాశం మ‌రింత ఎక్కువ‌ని వారు పేర్కొన్నారు. ఒకే కార్డుతో త‌ప్పుడు స‌మాచారంతో ప‌లుమార్లు ఆన్‌లైన్ కొనుగోళ్లు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ దానిని బ్యాంకులు గుర్తించ‌లేక‌పోతున్నాయ‌ని తెలిపారు. పిన్‌ నంబ‌ర్‌, గ‌డువుతేదీ, కార్డు నంబ‌రు త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకునేందుకు హ్యాక‌ర్లు చేసే విఫల య‌త్నాల‌ను బ్యాంకింగ్ వ్య‌వస్థ గుర్తించ‌లేక‌పోతోందన్నారు. ఒక్కో వెబ్‌సైట్ ఒక్కో ర‌కంగా స‌మాచారాన్ని తెలుసుకుని నిర్ధారించ‌డం కూడా హ్యాక‌ర్ల‌కు అనుకూలంగా మారుతోంద‌న్నారు

నోట్ల రద్దుతో మీడియా విలవిలలాడుతుందా...

నోట్ల రద్దుతో మీడియాకు కష్టాలు


పెద్ద నోట్ల రద్దు వ్యాపారులు, సామాన్యులకే కాదు మీడియా సంస్థలకు కూడా గట్టి దెబ్బకొట్టింది. పత్రికలు, టీవీ ఛానళ్లకు ఆదాయం భారీగా పడిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో అన్ని వస్తువులకు డిమాండ్ పడిపోయింది. వస్తువుల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు వ్యాపారసంస్థలు ముందుకురావడం లేదు. వ్యాపారమే లేనప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అన్నది కంపెనీల భావన. నోట్ల రద్దు వల్ల మీడియా రంగం 2000 వేల కోట్ల మేర ప్రకటనలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నగదు అందుబాటులో లేకపోవడం, వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలో… కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీలు, వాణిజ్య సంస్థలు వ్యాపార ప్రకటనల ఖర్చును తగ్గించుకోక తప్పడం లేదు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన ప్రకటనలను కూడా కంపెనీలు వెనక్కు తీసుకుంటున్నాయి.

‘‘పెద్దనోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, అంతా సర్దుకుంటుందని తొలుత అనుకున్నాం. మా అంచనా తప్పుతోంది. చాలా కంపెనీలు డిసెంబరులోనూ ప్రకటనల వ్యయాన్ని కత్తిరిస్తున్నాయి. ఒక్కరోజే మా ప్రధాన క్లయింట్లు ఇద్దరు ప్రకటనల ఖర్చును తగ్గించేశారు. మొత్తంగా చూస్తే ఈ రంగానికి 1500 కోట్లకుపైనే నష్టం తప్పదనిపిస్తోంది’’ అని ఒక ప్రఖ్యాత యాడ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ వ్యాఖ్యానించినట్టు ఎకనామిక్ టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ‘ఈ సంవత్సరం ఆయా కంపెనీలు, సంస్థలు ప్రకటనలపై రూ.50వేల కోట్లు వెచ్చిస్తాయని అంచనా వేశాం. చివరి 3 నెలల్లో రూ.20వేల కోట్ల ప్రకటనలు వెలువడతాయని భావించాం. నవంబరు నాటికి ఇందులో 10వేల కోట్ల వరకు యాడ్స్‌ వచ్చినా… డిసెంబరుకు సంబంధించి 15 నుంచి 20 శాతం, అంటే 1500 కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు ప్రకటనలు తగ్గుతాయి’’ అని డెంట్సు ఏజిస్‌ నెట్‌వర్క్‌ – దక్షిణాసియా సీఈవో ఆశిష్‌ భాసిన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఆరు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

చంద్రబాబుకు ఎవరితో విభేదాలు లేవట...నమ్మాల్సిన నిజమేనా

నాకు కేసిఆర్ తో విభేదాలు లేవు ; చంద్రబాబు



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. శనివారం ఆయన దిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన నాయకత్వ సదస్సులో ‘ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు’ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించినట్లు చెప్పారు. వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేసే దిశగా కృషిచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తొలి అర్ధసంవత్సరంలో 25.6 శాతం వ్యవసాయం వృద్ధి సాధించినట్లు వివరించారు. మత్స్య పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో 30 నుంచి 300 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రతి పాఠశాలలో డిజిటల్‌ తరగతులు ఉండాలని అన్నారు. నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకున్నామని చెప్పారు. అమరావతికి భవిష్యత్తులో కొన్ని విశ్వవిద్యాలయాలు రానున్నాయనీ, విజయవాడ-గుంటూరు నగరాల మధ్యలో అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తమ హయాంలోనే హైదరాబాద్‌ విమానాశ్రయం, సైబర్‌ సిటీలను నిర్మించినట్లు చెప్పారు. వాటిని చూస్తే ఎప్పుడూ గర్వంగా ఉంటుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణ సీఎం తనకు సహచరుడని, బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. విభజన తర్వాత రాష్ట్రంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. 2022 సంవత్సరం నాటికి దేశంలోని మూడు అగ్ర నగరాల్లో అమరావతి ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2029 నాటికి దేశంలోనే అగ్ర, 2050 నాటికి ఉత్తమ మజిలీ నగరంగా అమరావతి నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నట్లు చెప్పారు. గతేడాది 10.99 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. రెండంకెల వృద్ధిరేటు సాధనే తమ విజయానికి నిదర్శనమన్నారు. సులభతర వాణిజ్యానికి ఏపీ అనుకూల రాష్ట్రంగా మారిందన్నారు. రూ.149లకే కేబుల్‌, అంతర్జాలం, ఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ అంతర్జాల సౌకర్యం ఏర్పాటుచేస్తున్నామనీ, భవిష్యత్తులో ప్రతి ఇంటికీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడవచ్చని సీఎం వివరించారు

మహిళా పార్లమెంటేరియన్ల తొలి మహాసభలు ఏక్కడ

అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల సభలు; ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్


నవ్యాంధ్రప్రదేశ రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్‌ నిర్వహించడానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 10,11,12 తేదీలలో అమరావతిలో నిర్వ‌హింప చేసే క్రమంలో స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వేగంగా పనిచేసుకు పోతున్నారు. పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య‌ ప‌ర‌చనుండగా, గ‌త కొన్ని నెలలుగా ఈ అంశంపై కసరత్తు చేస్తున్న డాక్ట‌ర్ కోడెల శనివారం పూణేలో పర్యటించారు. తొలుత సదస్సుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేస్తూ రానున్న 2నెలల కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసుకునే క్రమంలో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ వి. కరాడ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు.

అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా.కోడెల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య‌ ప‌రుస్తుందని, ఈ విద్యా సంస్థలు సహ భాగస్వామ్యం వహిస్తున్నాయన్నారు. దాదాపు పది వేల మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఎవరైనా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత ఆశయం తో ఈ సదస్సు నిర్వహిస్తుండగా జాతీయ, అంతర్ జాతీయ స్థాయి సంస్థలు భాగస్వామ్యం వహించటం విశేష మన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్ల‌మెంట్ , శాసన సభ్యులు పాల్గొంటారన్నారు. సమావేశాలకు చైర్మన్‌గా తాను, చీఫ్ ప్యాట్రన్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణ మూర్తి ఉంటారన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సిద్దం చేసిన తాత్కాలిక కార్యాచ‌ర‌ణ‌ను అనుస‌రించి ‘మహిళా ప్రోత్సాహం - ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై 3 రోజులు జరిగే మహాసభలో విభిన్న అంశాలు చ‌ర్చ‌కు వస్తాయన్నారు. తొలి రోజు‘మహిళా సాధికారిత- రాజకీయ సవాళ్లు’, వ్యక్తిత్వ నిర్మాణం - భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు అన్న అంశాలు, రెండవ రోజు మహిళల స్థితి - నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి అనే అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. మూడవ రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తామని, ప్ర‌తి రోజూ సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేలా ఏర్పాట్లు ఉంటాయని స‌భాప‌తి డా.కోడెల పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మహారాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ నింబాల్కర్, ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మి, ఓఎస్‌డి గురుమూర్తి ఉన్నారు.

మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్‌ 79 విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఎంఐటీస్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ పేరుతో ప్రజా పాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ దిశగా చొరవ తీసుకుని స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ చేపట్టగా, యునెస్కో సైతం ఈ సదస్సులో భాగస్వామ్యం కాబోతుంది. ఇటువంటి మహిళా పార్లమెంట్‌ నిర్వహించడం ఇదే ప్రథమం కాగా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పార్లమెంటేరియన్లు, ప్రజాప్రతినిధులతో స‌హా వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులను స‌భాప‌తి ఇప్పటికే ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పది వేల మంది చురుకైన విద్యార్థినులను ఈ స‌ద‌స్సుకు ఆహ్వ‌నించి వారిని ఉత్తేజితుల‌ను చేయ‌నున్నారు. ఈ సమావేశాలను కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్ర ప్ర‌భుత్వం సంయిక్తంగా నిర్వహించనున్నాయి.