అమేజాన్ ను బురిడీ కొట్టించిన యువకులు
అమెజాన్ ఆన్‌లైన్ సంస్థలో ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేసి మోసం చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు ఆపిల్ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడకు చెందిన అంకుష్ బిరాజ్ దార్, పురానాహవేలికి చెందిన మిర్ ఫిరోజ్ అలీ గతంలో ఆబిడ్స్‌లోని ప్లేమాక్స్ గేమింగ్ సెంటర్‌లో పనిచేసి స్నేహితులుగా మారారు. బిరాజ్‌దార్ ప్రసుత్తం అమెజాన్ ట్రాన్‌జాక్షన్స్ విభాగంలో రిస్క్ ఇన్వ్‌స్టిగేటర్‌లో పనిచేస్తున్నాడు. ఖాతాదారులు తిరస్కరించే లొసుగులు అతడికి తెలుసు. స్నేహితుడు ఫిరోజ్ అలీ ద్వారా ఖరీదైన ఐ ఫోన్లను ఫేక్ కస్టమర్ ఐడీ ద్వారా అమెజాన్ సంస్థలో ఆన్‌లైన్‌లో బుక్ చేయించేవాడు. ఫిరోజ్ అలీ వాటిని తన కాంటాక్ట్ నంబరు ద్వారా డెలివరీ బాయ్ నుంచి కలెక్టు చేసుకుని పార్శిల్‌లోని ఖరీదైన ఐ ఫోన్ బదులు చైనా ఫోన్ పెట్టేవాడు. పార్శిల్ సరిగా లేదు.. ఫోన్‌లో లోపం.. రాంగ్ ఆర్డర్.. లేట్ డెలివరీ తదితర కారణాలతో పార్శిల్ వెనక్కి పంపేవాడు. చేతికి అందిన ఐ ఫోన్‌ను ఇతరులకు అమ్మి వచ్చిన లాభాన్ని ఇద్దరూ పంచుకునేవారు. నిందితుల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించారు.
No comments:
Post a Comment