Friday, December 2, 2016

ఇక ఎపిలో నగదుకొరత తీరినట్లేనా

రాష్ట్రానికి చేరుకున్న 2500కోట్లు


ఆంధ్రప్రదేశ్‌లో నగదు కొరత తీర్చేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ నుండి రూ.2500కోట్లు రాష్ట్రానికి చేరుకుంది. కార్గోవిమానాల ద్వారా నగదును రాష్ట్రానికి చేరవేశారు. విశాఖ, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు విమానాల్లోనూ, మిగిలిన ప్రాంతాలకు రోడ్డుమార్గాల ద్వారా నగదు చేరవేస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి వచ్చిన నగదు మధ్యాహ్నానికల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బ్యాంకర్లు తాత్సారం చేయకుండా ప్రజలకు నగదు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమయపాలన లేకుండా ప్రజల సౌకర్యార్థం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నగదు కొరతపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌ చేశారు. ఇన్ని రోజులైనా నగదు కొరత సమస్య తీరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా నగదు పంపాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్‌ ఏపీకి వెంటనే రూ.2500 కోట్లు సరఫరా చేయాలని ఆదేశించారు

No comments:

Post a Comment