రాజకీయంగా హత్యచేసేందుకు కుట్ర; నితీష్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మీడియా పై మండిపడ్డారు. ‘మీడియా నన్ను రాజకీయంగా హత్య చేయాలని చూస్తోందా అంటూ ప్రశ్నించారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైనట్లు, భాజపాకు దగ్గర అవుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తిప్పికొట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల రద్దు చేయడాన్ని మాత్రమే సమర్థిస్తున్నాను తప్ప.. భాజపాకు తగ్గరయ్యేది లేదని నితీశ్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నితీష్ సమర్థించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ధైర్యంగా పులిపై స్వారీ చేస్తున్నారని, దీనికి తాను మద్దతు తెలుపుతున్నట్లుగా ఆయన కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. నితీశ్ మద్దతును స్వాగతిస్తున్నామని, ప్రతిపక్షాల్లో పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి నితీశ్ అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆక్రోశ్ దివాస్‌ను నిర్వహిస్తే బిహార్‌లో నిర్వహించేదిలేదని నితీశ్ ప్రకటించారు.
No comments:
Post a Comment