పవన్ విమర్శలకు భయపడును; వెంకయ్యనాయుడు
జనసేన నేత పవన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా పేరుతో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందన్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రానికి చేయనటువంటి సాయం ఆంధ్రప్రదేశ్‌కు చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. పవన్ విమర్శలకు భయపడి వెనక్కిపోనని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించకపోయినా ... రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ తీర్మానం చేశామని గుర్తు చేశారు. రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేస్తుంది, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రమే మంజూరు చేస్తుందని తెలిపారు. కేంద్ర విద్యాసంస్థలు పదేళ్లలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ రెండేళ్లలోనే విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం. ‘నాకు ఎవరి కితాబులు అవసరం లేదన్నారు.
No comments:
Post a Comment