తపాకిస్ధాన్ ఉద్రవాద తయారీ ఫ్యాక్టరీ; ప్రధాని మోడీ
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ మాపొరుగుదేశంపై నిషేధం విధించాలి. అంతర్జాతీయ సమాజంలో దానిని ఒంటరిని చేయాలి’’ అంటూ పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. లావోస్ రాజధాని వియంటియాన్‌లో గురువారం జరిగిన ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా ప్రధాని లీ కెకియాంగ్ సమక్షంలో పాక్ పేరు చెప్పకపోయినా నేరుగానే ఆయన విమర్శలు చేశారు. ప్రపంచానికంతటికీ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ దేశాన్ని నిలువరించే సమయం మనకు ఇప్పుడు వచ్చిందన్నారు. ఉగ్రవాదం ఎగుమతి రోజురోజుకూ పెరుగుతోందని, ఇది మనందరికీ ఉమ్మడి ముప్పుగా మారిందని హెచ్చరించారు. ఒకే ఒక్క దేశం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని జీ20 సదస్సులో విమర్శలు గుప్పించిన మోదీ.. మూడు రోజుల్లోనే ఏసియాన్ సదస్సులోనూ పాక్ లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సంపద సృష్టి అనే ఉమ్మడి లక్ష్యాలతో మనం కలిశామని, కానీ, శాంతికి ఇప్పుడు ప్రమాదం వాటిల్లిందని వివరించారు. కాగా, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం గురించి ప్రస్తావిస్తూ.. బల ప్రయో గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తే శాంతి సుస్థిరతలు ప్రమాదంలో పడతాయని పరోక్షంగా చైనాను తప్పుబట్టారు. కాగా, దక్షిణ చైనా సముద్రంపై తమకే హక్కులు ఉన్నాయంటున్న చైనా వాదనకు చట్టపరంగా ఆధారాల్లేవని అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పష్టం చేశారు.
No comments:
Post a Comment