Thursday, May 12, 2016

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఆంధ్రుల రాజధాని అమరావతి

ధాన్యకటకం (అమరావతి) క్రీస్తుపూర్వమూ, క్రీస్తుశకంలోనూ చాలా శతాబ్దాలు ఆంధ్రదేశంలో ప్రముఖ వ్యాపార, విద్యా వాణిజ్య కేంద్రంగా పరిఢవిల్లి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కొత్తగా నిర్మించబోయే రాజధానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమరావతి పేరు పెట్టటం హర్షదాయకం. నవ్యాంధ్ర కొత్త రాజధాని భారతదేశంలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రం, కళలకు కాణాచి, విద్యానిలయం, ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే నగరం కావాలి. 

       గుంటూరు పట్టణానికి ఉత్తరంగా కృష్ణానది కుడి ఒడ్డున వున్న అమరావతి, బౌద్ధమత చరిత్రలో, బౌద్ధవాజ్ఞయంలో విశిష్ట స్థానం పొందిన ఆనాటి ‘ఆంధ్రపురి’యే ధాన్యకటకం. ప్రస్తుతం అమరావతి - ధరణికోట గ్రామాలే ఒకప్పటి ధాన్యకటకం లేక శ్రీ ధాన్యకటకం. కీస్ర్తుకు పూర్వమే వున్న ధాన్య కటకం 16 కి.మీ.ల చుట్టుకొలతగా వున్న మహానగరం. శాసనాలలో ఈ నగరాన్ని దజ్ఠకడ (ధమ్మకడ), దమనకథ, దనకద, ధనకడ, ధనకట, ధ్యాన్యకటక, ధాన్యవాటిపురి, ధాన్యఘట, ధాన్యాంకపురి, ధాన్యవాటికగా పేర్కొన్నారు. ఈ పేర్లకు ధాన్యంతో సంబంధం ఉంది. కనుక ధనకడ, కటకము అనగా ధాన్యములు వుండుచోటు అని అర్థం.
               పురావస్తు శాఖ 1973-74లో జరిపిన తవ్వకాలలో లభించిన శిలా శాసనాన్ని బట్టి ఈ ప్రాంతం మౌర్య చక్రవర్తుల రాజ్యంలో భాగంగా వున్నట్లుగా తెలుస్తున్నది. మౌర్యుల కాలం కంటే ముందు ఈ ప్రాంతం ఆంధ్రపదం అనే మహాజనపదం (షోడశ మహాజన పదాలలో ఒకటి)గా వుండి వుంటుందని చరిత్రకారుల అభిప్రాయం. గ్రీకు రాయబారి మొగస్తనీసు తన గ్రంథం ‘ఇండికా’లో క్రీ.పూ. ఆంధ్ర దేశంలో పేర్కొన్న 30 దుర్గాలలో ధాన్యకటకంలో వున్న మట్టికోట కూడా ఒకటి అయి వుండవచ్చునని చ రిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలు స్థూపంలో లభించిన ధాతు పేటిక (రెలిక్‌ కేస్కెట్‌) పైన వున్న ప్రాకృతంలో వున్న శాసనంలో పేర్కొన్న పేర్లను బట్టి ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. నాగ, యక్షజాతి పాలకులు పరిపాలించినట్లుగా తెలుస్తున్నది. క్రీ.పూ. ఒకటవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని సదవంశీయులు పరిపాలించినట్లుగా వారి నాణేల మూలంగా తెలుస్తున్నది. శాతవాహన రాజులలో ఒకరైన వాసిష్టీపుత్ర పులుమావి క్రీ.శ. 2వ శతాబ్దంలో తూర్పు కోస్తా దేశాన్ని జయించి ధాన్య కటకాన్ని తన తూర్పు తీర రాజధానిగా చేసుకున్నాడు.
                     శాతవాహనుల సామంతులైన ఇక్ష్వాకులు క్రీ.శ. 3వ శతాబ్దంలో శాతవాహన సామ్రాజ్యం క్షీణించిన తర్వాత సర్వ స్వతంత్రులైౖ విజయపురిని రాజధానిగా చేసుకుని తూర్పు కోస్తా ప్రాంతాన్ని దాదాపు 85 సంవత్సరాలు పరిపాలించినట్లుగా వారి శాసనాల ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి 1947 వరకు ఈ ప్రాంతాన్ని పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆనందగోత్రజులు, బృహతపలాయనులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, కోట వంశీకులు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు విజయనగర చక్రవర్తులు, కుతుబ్‌షాహీలు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు (1796-1890), బ్రిటీషు వారు పరిపాలించినట్లుగా వారి శాసనాల ద్వారా, నాణేల ద్వారా వారు నిర్మించిన అనేక కట్టడాల ద్వారా, అనేక గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. వెంకటాద్రి నాయుడు తన రాజధానిని కృష్ణానది ఆవల వైపున ఉన్న చింతపల్లి నుంచి ధాన్యకటకానికి 1796లో మార్చి, కొత్త పట్టణాన్ని నిర్మించాడు. అప్పటికే అచ్చట వున్న అమరేశ్వరాలయాన్ని బట్టి ఆ పట్టణానికి అమరావతి అనే పేరు స్థిరీకరించినట్లుగా తెలుస్తున్నది. ఈ పేరునే ఆంధ్ర ప్రభుత్వం వారు తమ కొత్త రాజధానికి పెట్టుకోవడం శుభసూచకం.
                 కృష్ణానదీ పరివాహక ప్రాంతమైన ధాన్య కటకం చుట్టుపక్కల వున్న సారవంతభూమిలో పసుపు, పత్తి, వరి, అనేక పండ్లు, నవధాన్యాలు పండుతాయి. ఆ వ్యవసాయోత్పత్తుల వాణిజ్య కేంద్రంగానూ, పారిశ్రామిక, విద్యా వాణిజ్య రంగాలకు, కళలకు నెలవుగాను వుండేది. ధాన్య కటకం క్రీ.పూ. 5వ శతాబ్ది నాటికే ఆంధ్ర దేశంలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా వున్నట్లుగా తెలుస్తున్నది. మహా స్థూపపు కింది వరుసలో పూర్ణఘట ఫలకాలు, పద్మాలు, పూల దండల ఫలకాలను శిల్పీకరించారు. భారత పురావస్తు శాఖవారు 1962-65లో నిర్వహించిన తవ్వకాలలో ధరణికోటలో మట్టితో నిర్మించిన కోట బయటపడింది. ఆ కోటకు దగ్గర్లోనే రేవు సౌకర్యం వున్న కాలువ కృష్ణానదిని కలుపుతూ వున్నట్లుగా కనుగొనబడింది. కార్బన్‌ డేటింగ్‌ ఆధారంతో ఈ కాలువ క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందినట్లుగా పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఈ కాలువ ద్వారా నావలు సరుకులను నదీ ముఖద్వారానికి తీసుకుపోయి సముద్రం (బంగాళాఖాతం)లో లంగరు వేసి వున్న ఓడలలో నింపేవని తెలుస్తున్నది. అమరావతిలో వున్న కేంద్ర పురావస్తు సంగ్రహాలయంలో ప్రదర్శించిన శిలాఫలకాలలో పడవల ద్వారా నదులలో ప్రయాణిస్తున్న సాధారణ ప్రజలను, వర్తకులను, ఆనాటి వాణిజ్య రవాణా పద్ధతులను గ్రహింపవచ్చును.
                శాతవాహనుల కాలంలో కవురూర (బహుశా కర్ణాటక తీరంలో వున్న కార్వార్ణా కావచ్చునేమో), విజయపురి, కుదూర (బందరు), ధాన్యకటకం భాగ్యవంతులైన వణి ప్రముఖులున్న నగరాలని శాసనాల ద్వారా తెలుస్తున్నది అని ఆంజనేయ శర్మ అభిప్రాయపడ్డారు.  విహారాలు బౌద్ధ విజ్ఞానానికి పీఠాలై ప్రపంచ ప్రఖ్యాతి గడించాయి. దేశ, విదేశాల నుంచి, శ్రమణులు, పండితులు, యాత్రికులు, భిక్షువులు, వీటిని దర్శించినట్లుగా మనకు తెలుస్తున్నది. ధాన్య కటక విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్రము, ధమ్మమము, జ్యోతిష్యము, వ్యాకరణము, తర్కము, న్యాయము మొదలైన శాఖలలో బోధన జరిగేది. ఈ విధంగా ధాన్య కటకం వచ్చిపోతున్న వారి ద్వారా ఇక్కడ కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతూ ఉండేవి. ఆంధ్ర దేశం నుంచి సిల్కు వసా్త్రలు, పప్పు దినుసులు, సుగంధద్రవ్యాలు, ప్రతి, చేనేత వసా్త్రలు శ్రీలంక, బర్మా ఇండోనేషియా, ఇండోచైనా, టిబెట్టు, తూర్పు ఇండియా దీవులు, మధ్య ఆసియా, మలేసియా దేశాలకు ఎగుమతులు అవుతుండేవి. క్రీస్తుశకం మొదటి శతాబ్దాలలో ఆంధ్ర దేశం రోమన్‌ సామ్రాజ్యానికకి మధ్య ఓడల ద్వారా వర్తక వాణిజ్యాలు జోరుగా సాగినట్లు భట్టిప్రోలు, ఘంటశాల, ధాన్యకటకం, విజయపురి మొదలైన ప్రదేశాలలో జరిపిన తవ్వకాలలో లభించిన వస్తువులు, రోము దేశపు, వెండి బంగారు నాణేల ద్వారా మనకు తెలుస్తున్నది. 
             చైనా యాత్రికుడైన హుయన్‌ సాంగ్‌ (640) ధాన్యకటక మహా విహారం దర్శించాడని, ధాన్య కటకం దగ్గరలో వున్న కొండ గుహలలో వజ్రపాణి ధారణలు తయారవుతుంటాయని రాశారు. కృష్ణానదిలో ఇప్పటి పోతార్లంక (ప్రాచీన పోతవరలంక) ఒక ముఖ్య రేవు పట్టణం. పెద్ద నౌకలు సముద్రం నుంచి అక్కడి వరకు వచ్చేవి. కృష్ణానది ఒడ్డున నావల ద్వారా సరుకులు దేశ విదేశాలకు ఎగుమతి-దిగుమతి జరపడానికి రేవులను కట్టిన ఆధారాలు వున్నాయి. ఒడ్డు జారకుండా అటూ-ఇటూ రాళ్ళు. ఇటుకలతో పెద్ద గోడల పునాదులు. ఆనవాళ్ళు ధరణికోట వద్ద జరిపిన తవ్వకాలలో వెలుగు చూసాయి. ధరణికోట, అమరావతిలో నిర్వహించిన పురావస్తు తవ్వకాలలో రోమను బంగారు నాణేలు, నల్లగా పాలిష్‌ చేయబడిన మట్టిపాత్రలపై వున్న చుక్కలు, గుండ్రటి గీతలు (రౌలెటెడ్‌ వేర్‌) కలిగిన మట్టిపాత్రలు, మందుపాత్రలు (రోమన్‌ ఎంఫోరా), మధ్యధరా ప్రాంతపు చెవికమ్మలు, ఇతర ఆభరణాలు లభించాయి. క్రీ.శ. 1,2 శతాబ్దాలలో రోమనులు ఈ ప్రాంతం దర్శించిన ఆధారాలు లభించాయి.
              ఇచ్చట లభించిన క్రీ.శ. 2వ శతాబ్ది నాటి శాసనం ప్రకారం, ‘భగవతి, పుష్పతార కంచు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింపబడింది. భగవతి పుష్పతార భవ సాగరాన్ని (సముద్రాన్ని) దాటడానికి సహాయపడుతుందని తారాధరణి అనే టిబెట్టు గ్రంథం పేర్కొన్నది. ఇక్కడ జరిపిన తవ్వకాలలో క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన నొక్కుడు వెండి నాణేలు (పంచ్‌ మార్క్‌డ్‌ కాయిన్స్‌), నున్నటి నల్లటి పాలి్‌షతో వున్న ఉత్తర భారత దేశానికి చెందిన మట్టిపాత్రలు, కుండ పెంకులు, (నార్తరన్‌ బ్లాక్‌ పాలిష్డ్‌ వేర్‌), శాతవాహనకాలపు సీసపు నాణేలు, పూసలు కూడా లభించాయి. తవ్వకాలలో లభించిన వస్తు సామగ్రిని బట్టి ధాన్య కటకం నుంచి విదేశాలకే కాక, దేశంలోని వివిధ ప్రాంతాలతో వర్త వాణిజ్యాలు నెరపినట్లుగా తెలుస్తున్నది. ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు ధాన్యకటకం వ్యాపార కేంద్రంగా వున్నట్లు అర్థమౌతున్నది. ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్ర లోని పైఠాన్‌ (ప్రతిష్ఠానపురం), ధాన్యకటకం, మధ్య బేతవోలు (జగ్గయ్యపేట), నేల కొండపల్లి, ఫణిగిరి, ధూళికట్ట, కోటి లింగాల, పౌదనాపురం (బోధన్‌)ల ద్వారా పశ్చిమ వ్యాపార మార్గం, అదే విధంగా అల్లూరు, రామిరెడ్డిపల్లి, గుంటుపల్లి, శంకరం, బావికొండ, రామతీర్థ, శాలిహుండాం, కళింగపట్నం, దంతపురం ద్వారా కళింగ దేశానికి, చందవరం, మహాబలిపురం, కాచీపురం, వనవాసి (కర్నాటకలోని బనవాసి ప్రదేశాలకు వ్యాపార మ్గాలున్నట్లు, ఈ వ్యాపార ప్రదేశాలకు వుుఖ్య కేంద్రంగా వున్నట్లుగా కనిపించుచున్నది.
              అశోకునిచే బౌద్ధవుత ప్రచారం కోసం ిసంహల దేశానికి పంిపంచబడిన బౌద్ధ భిక్షువు వుహాదేఉడు సింహళ దేశం పోతూ దారిలో వున్న ధాన్య కటక ముహా చైత్యాన్ని దర్శించాడని, తన వెంట తెచ్చిన బుద్ధుని కొన్నింటిని, వుహా స్తూపంలో నిక్షిప్తం చేసి, వుహా స్థూపానికి జీర్ణోద్ధరణ చేశాడని చరిత్ర తెలియచేస్తున్నది. సిహళ దేశానికి కొని పోబడిన బుద్ధుని దంత గాథలో కృష్ణానది వుుఖద్వారంలో వున్న వజ్రాల లన్నె ( వుహా స్థూపాన్ని ‘దీపాల దిన్నె’ లేక వజ్రాల తిన్నె అని వవవహరించేవారు). ప్రస్తావన వున్నది. అమురావతి శైలిలోసున్నపురాతితో చెక్కబడిన ఆనాటి బౌద్ధ శిల్పాలు సి దేశ్చలో వున్న అనురాధపురంలోని జేతవనారావుంలోను, ఇతర విహారాలలోను చూడవచ్చును. చైనా దేశంలోని హ(నాను రాష్ట్రంలోని నజిన్‌ ిహిస్టంగ్‌ టాంగ్‌లో చెక్కిన బౌద్ధ శిల్పాలు, అమరావతి శిల్లాలను పోలి వున్నట్లుగా తెలుస్తున్నది. ఇండో చైనాల క్రీ.శ. 1వ శతాబ్దంలో యేుర్పడిన చంపా రాజ్యంలో అవురావతి అనే పేరుతో ఒక రాష్ట్రం వున్నదట. ఆ దేశంలో ఆంధ్ర దేశంలోవున్న అనేక పట్టణాల పేర్లు వున్నాయుట. అవురావతి రాష్ట్రంలో వున్న  డూయింగ్ వద్ద లభించిన బుద్ధ విగ్రహాలు నుంచి ఎగువుతి అరుునవేనని చరిత్రకారుల అభిప్రాయుం ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ నిహార్‌ రంజన్‌రాయ్‌ నిర్విహంచిన పరిశోదనలలో బర్మాలోని బౌద్ధ మతం అవురావతి,కనాగార్జునకొండ ప్రాంతాల నుంచి వెళ్ళినదని నిర్ధారించాగు.
             ప్రోం రాష్ట్రంలో కిచో గోన్‌ అనే ప్రదేశంలో క్రీ.శ. 6వ శాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం బయుటపడింది. ఆ స్థూపంలో వున్న బుద్ధుని విగ్రహాలకు అమర్చిన చేతి వుంగరాలు, చెవి కవ్ములు అవురావతి శిల్ప ప్రభావాన్ని చాటుతున్నారుు. క్రీ.శ. 3వ శతాబ్దంలో వుహా సాంిఫుక బౌద్ధ భిక్షువులు నుంచి సుదూర ప్రాంతాలకు తరలి వెళ్ళి ఆయూ ప్రాంతాలలో బౌద్ధ ముత ప్రచారం చేశారు. వారు తవు వుతాన్ని, శిల్ప సంప్రదాయాను తవు వెంట తీసుకుని తూర్పు దేశాలకు వుుఖ్యంగా బర్మా, థాయ్‌ులాండ్‌, ఇండోనేసియూ, జావా, సువూత్రా వెుుదలైట దేశాలకన తరలి వెళ్ళి అక్కడ వలసలు స్థాిపంచి తవు వుత్నా శిల్ప కళల్ని ప్రోత్సహించారు. క్రీస్తుపూర్వవుూ, క్రీస్తుశకంలోనూ చాలాశతాబ్దాలు ఆంధ్రదేశంలో ప్రముుఖ వ్యాపార, విద్యా వాణిజ్య కేంద్రంగాంపరిఢవిల్లి ప్రపంచ ప్రస్ధి పొందింది. వుుఖ్యవుంత్రి చంద్రబాబు నాయుుడు కొత్తగా నిర్మించబోయేు రాజధానికి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిన అమవురావతి పేరును స్థీ‌రీకరించటం హర్షదాయుకం. నవ్యాంధ్రకొత్తరాజధని భారతదేశంలోనే ప్రవుుఖ వాణిజ్య కేంద్రం, కళలకు కణాచి, విద్యానిలయ, ప్రాచీన సంస్కృతికి అద్దంపటేస నగరం కాగలదని ఆశిద్దాం.

No comments:

Post a Comment