మోఢీ సర్కారుకు రెండేళ్ళు...అంబరానంటనున్న సంబరాలు
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భాజపా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రేపు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. భాజపా జాతీయ కార్యదర్శి అనిల్ జైన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు. మే 27 నుంచి జూన్ 15 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మోదీ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను నిర్వహించేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. గతేడాది నిర్వహించిన మొదటి విజయోత్సవ సభ మథురలో జరిగింది. 198 నగరాల్లో 33 బృందాలు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈనెల 27న వివిధ ప్రాంతాల్లో భాజపా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
మరోవైపు రెండేళ్ళ పాలనలో మోడీ సాధించిన ఘనతపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వ్యక్తిగత ిఇమేజ్ ను పెంచుకోవటం, పర్యటనల పేరుతో విదేశాల్లో గడిపి రావటం మినహా పెద్దగా దేశానికి మోడీ వల్ల ఓనగూరింది ఏమిలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అత్యధికంగా గల కార్మికులు, కర్షకుల కోసం మోడీ కొత్తగా అనుసరించిన విధానాలు ఏమీలేవన్నది కూడా జగమెరిగిన సత్యమేనంటున్నారు. కార్పోరేట్ లకు పెద్ద పీఠ వేస్తూ సువిశాల భారత ప్రజలకుమాత్రం రెండేళ్ళ కాలంలో తీరని ద్రోహం చేశారన్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందంటున్నారు మేధావులు, రాజకీయ విశ్లేషకులు.
No comments:
Post a Comment