ఉద్యోగుల పంచాయితీ తేలేది సియం వద్దే
రాజధానికి ఉద్యోగుల తరలిరపుపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొgదరు ప్రభుత్వం చెబుతున్నట్లుగా వెళ్లిపోవాలని భావిస్తుండగా, మెజార్టీ ఉద్యోగులు మాత్రం మార్చి వరకు ఆగి వెళ్తే బాగుంటుందంటున్నారు. తరలింపుపై గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల వేదిక సర్వ సభ్య సమావేశం నిర్వహించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ ప్రభుత్వంతో ఇంతవరకు జరిపిన చర్చల వివరాలను సభ్యులకు వివరించారు. జూన్ 27న తొలి విడతగా కనీసం 70 శాతం శాఖల ఉద్యోగులు వెళ్లాల్సి వస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం చెబుతున్న విధంగా జూన్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కొందరు సూచించగా, సచివాలయ అధికారుల సంఘం ప్రతినిధులు దీనికి గట్టిగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకుండా, ఏ దశలో ఎవరు వెళ్లాలో చెప్పకుండా రాజధానికి వెళ్లిపోవాలని చెబితే ఎలా అని వారు ప్రశ్నిరచారు. అందుకే పనులు పూర్తయ్యేంత వరకు తరలిరపు లేకుండా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. వచ్చే మార్చికి తరలివెళ్తే మంచిదన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోరది. సచివాలయంలో వివిధ అరశాలపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నానని మురళీకృష్ణ చెప్పగా, ఇది ఉద్యోగుల తరలింపు అంశమని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని మరికొందరు సభ్యులు స్పష్టం చేసినట్లు తెలిసిరది. తమ అభిప్రాయాలను నేరుగా ముఖ్యమంత్రికి కూడా వివరించాలని వారు సమావేశంలో డిమాండ్ చేశారు.సచివాలయం పనులు ఇంకా పూర్తి కాకుండా అక్కడికి వెళ్తే ఇబ్బందులు వస్తాయని, ఎవరు ఎప్పుడు, ఏ దశలో వెళ్లాలన్నది స్పష్టం చేయకపోవడంతో తమలో అయోమయం నెలకొందని వారు పేర్కొన్నారు. తమ పిల్లల విద్య, తమకు వసతి, రవాణా ఖర్చులు, స్థానికత వంటి అరశాలపై కూడా ఇరతవరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ఈ సమయంలో కొత్త రాజధానికి ఎలా వెళ్లాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా, ఇరతవరకు ఇంటి అద్దె అలవెన్సుపై కూడా ఉత్తర్వులు రాలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జూన్ మూడున పాఠశాలలు, జూన్ 12న కళాశాలలు ప్రారంభమవుతాయని, అందువల్ల ఇరకా తేల్చకపోతే ఎలా అంటూ ఉద్యోగ సంఘాల సభ్యులు ప్రశ్నించారు. సచివాలయం తరలిరపు తరువాత కొరత మందిని ఇక్కడే స్కెలిటిన్ స్టాఫ్‌గా ఉంచాల్సి ఉంటుందని, దానిపై కూడా స్పష్టత లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానంతరం మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో ఈనెల 16 లేదా 17వ తేదీల్లో నేరుగా ముఖ్యమంత్రే ఉద్యోగుల తరలిరపుపై చర్చించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఎవరు ఎప్పుడు వెళ్లాలన్నదానిపై స్పష్టత వస్తుందని, రెండు రోజుల్లో తరలింపుపై మార్గదర్శకాలు కూడా వస్తాయని వెల్లడిరచారు. 27వ తేదీనాటికి కనీసం 70 శాతం మంది వెళ్లాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత రెరడు నెలల్లో మిగిలిన ఉద్యోగులు కూడా వెళ్తారని వ్యాఖ్యానించారు. హెచ్‌ఆర్‌ఎ అదనంగా ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం కారణంగా విజయవాడలో ఇంటి అద్దెలు కూడా భారీగా పెరచేశారని, కేవలం హైదరాబాద్‌లో ఇస్తున్న ఇంటి అద్దెనే అక్కడా ఇస్తున్నారన్నది గుర్తించాలని చెప్పారు. అద్దెల విషయంలో అక్కడి వారు సహకరించాలని కోరారు. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతమే విజయవాడకు పూర్తిగా తరలివెళ్తారని, మిగిలిన వారంతా హైదరాబాద్‌లోనే కుటుంబాలను ఉరచి, తాము మాత్రమే విజయవాడకు వెళ్తారని వ్యాఖ్యానించారు. బదిలీ ఉత్తర్వులు ఇస్తేనే రవాణా అలవెన్సులు ఇస్తారని, ప్రస్తుతం తరలింపు ఉత్తర్వులు మాత్రమే ఉరడడం వల్ల 80 శాతం ట్రాన్స్‌పోర్టు ఖర్చును అడ్వాన్సుగా ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కూడా తరలింపు ఒకేసారైతే మేలని వ్యాఖ్యానించారు. ఎవరు ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుందన్న దానిపై అరదరికీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని సూచించారు. సచివాలయ నిర్మాణం మొత్తం పూర్తయ్యాక వెళ్లడం వల్ల సమస్యలు కూడా తగ్గుతాయన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment