ఎపిలో ఉద్యోగ మేళా
ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు... త్వరలో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల విడుదలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)రెడీ అవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,250 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసు విభాగానికి చెందినవి 8 వేలుకాగా, మిగిలిన 12 వేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలోనే 1100 ఖాళీలతో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఎఎస్) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను బట్టి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఇండెంట్ అందిన 15 రోజుల్లోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తొలిగా దేవాదాయశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఇటీవలే ఏపీపీఎస్సీ నవీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. గతానికి భిన్నంగా తొలిసారి ‘వన్‌టైమ్ రిజిసే్ట్రషన్’ కు ఏర్పాటు చేశారు. ఇందులో డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లకు సంబంధించిన విభాగాన్ని ఓపెన్ చేశారు. జూన్‌లో నిర్వహించే పరీక్షలు రాయగోరు అభ్యర్థులు తమ వివరాలతో రిజిసే్ట్రషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన విభాగాన్ని తొలి నోటిఫికేషన్ విడుదల చేయగానే ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్-1, 2, 4లకు సంబంధించిన సిలబ్‌సలో మార్పులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిలబ్‌సపై వచ్చిన 1,234 అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులకు ఏపీపీఎస్సీ పంపించింది. మారిన సిలబ్‌సను త్వరలో ప్రకటించనున్నారు. మరో వైపు పోటీపరీక్షలకు తర్ఫీదు నిచ్చేందుకు ఇప్పటికే పలు కోచింగ్ అకాడమీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చి నిరుద్యోగులకు శిక్షణలు మొదలుపెట్టాయి.
No comments:
Post a Comment