Friday, May 13, 2016

పోలీసుల అత్యుత్సాహం- గాల్లో కలసిన నాలుగు ప్రాణాలు

పోలీసుల అత్యుత్సాహం- గాల్లో కలసిన నాలుగు ప్రాణాలు



గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాదెండ్ల మండలం గణపవరం వద్ద జాతీయరహదారిపై పోలీసులు  ఏర్పాటు చేసిన బారికేట్లను తప్పించబోయి అదుపుతప్పి ఓకారు , కంటైనర్ లారీని ఢీకొట్టింది.  దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అన్నవరం నుండి కర్నాటక వెళుతుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం వలనే ఈప్రమాదం చోటుచేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయరహదారిపై ఎలాంటి స్పీడు బ్రేకర్లు కూడా ఉండకూడదని ఒకవైపు చెప్తుండగా, పోలీసులు మాత్రం ఏకంగా బారికేట్లను అడ్డంపెట్టి చిన్నపాటి దారిని మాత్రమే వదిలారు... వేగంగా వస్తున్న కారు డ్రైవర్ బారీకేట్ల వద్దకు చేరుకునే సరికి  ఒక్కసారిగా కారును కంట్రోల్ చేయటం సాధ్యం కాకపోవటంతో పక్కనే ఉన్న కంటైనర్ ను ఢీకొట్టాడు. ఘటనలో నలుగురు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
రిపోర్టర్;NVSV.ప్రసాద్, చిలకలూరిపేట, అమరావతి బ్రేకింగ్ న్యూస్

No comments:

Post a Comment