మో ‘ఢీ‘ తో బాబు భేటీ
రాష్ట్రంలో కరవు పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం హస్తినకు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దిల్లీ చేరుకొని, మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీతో సమావేశం సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, ప్రత్యేక హోదా, రాయితీలు, పన్ను మినహాయింపు తదితర 13 అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం. ఈ సమస్యలన్నింటిపైనా ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధానితో భేటీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ పాల్గొననున్నారు. మరో వైపు బాబు పర్యటనపై పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బిజెపికి ఓరాజ్యసభ స్ధానం ఇవ్వటంతోపాటు, పనిలో పనిగా రెండు గవర్నగిరి పోస్టులు టిడిపికి కేటాయించలన్న ప్రతిపాదనను కూడా మోఢీ ముందు చంద్రబాబు ఉంచనున్నాడన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.
No comments:
Post a Comment