దావూద్ ను భారత్ కు రప్పిస్తాం; రాజ్ నాధ్ సింగ్
ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను అరెస్టుచేసి త్వరలోనే భారత్‌కు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ‘దావూద్‌ను త్వరలోనే పట్టుకుంటాం. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌కు తీసుకొస్తాం. అతడు ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. అతడిని పట్టుకొనేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాల్సి ఉంటుంద’న్నారు. దావూద్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పాకిస్థాన్‌కు అందజేసినట్లు చెప్పారు. దావూద్‌ను భారత్‌కు అప్పగించే అంశంలో పాకిస్థాన్‌ను ఒప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు.
ఇదిలా వుంటే రాజ్ నాధ్ వ్యాఖ్యలపై జనం పెదవి విరుస్తున్నారు. బ్యాంకులను ముంచిన విజయ మాల్యాను పట్టుకోలేని వారు, 1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి 250 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా క్షతగాత్రులు కావటానికి కారకుడైన దావూద్ ను భారత్ కు తీసుకొస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందంటున్నారు.
No comments:
Post a Comment