Tuesday, November 29, 2016

బీహార్ సియంను రాజకీయంగా హత్యచేసేందుకు కుట్ర....ఎవరు...ఎందుకు

రాజకీయంగా హత్యచేసేందుకు కుట్ర; నితీష్ కుమార్

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మీడియా పై మండిపడ్డారు. ‘మీడియా నన్ను రాజకీయంగా హత్య చేయాలని చూస్తోందా అంటూ ప్రశ్నించారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సమావేశమైనట్లు, భాజపాకు దగ్గర అవుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తిప్పికొట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల రద్దు చేయడాన్ని మాత్రమే సమర్థిస్తున్నాను తప్ప.. భాజపాకు తగ్గరయ్యేది లేదని నితీశ్‌ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నితీష్‌ సమర్థించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ధైర్యంగా పులిపై స్వారీ చేస్తున్నారని, దీనికి తాను మద్దతు తెలుపుతున్నట్లుగా ఆయన కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. నితీశ్‌ మద్దతును స్వాగతిస్తున్నామని, ప్రతిపక్షాల్లో పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి నితీశ్‌ అంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆక్రోశ్‌ దివాస్‌ను నిర్వహిస్తే బిహార్‌లో నిర్వహించేదిలేదని నితీశ్‌ ప్రకటించారు.

డిసెంబర్ 30 వరకే గడువు...రద్దునోట్లు డిపాజిట్ కు త్వరపడండి...

 గడువు ముగిసిందా అంతే సంగతులు



రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవడానికి  డిసెంబర్‌ 30వ తేదీ గడువుపెట్టామని ఎట్టిపరిస్ధితుల్లో గడువు పొడిగించేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్‌బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో  తెలిపింది. ఆర్‌బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉంది. బ్యాంకులకు రూ.100 నోట్ల సరఫరాను పెంచాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వల్‌ రాజ్యసభకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్లకు విధించిన డిసెంబర్‌ 30వ తేదీ గడువును పొడగించేది లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను తీర్చేందుకు రూ.100, అంతకు తక్కువ విలువ చేసే నోట్లను అందించాలని బ్యాంకులను కోరినట్లు చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పెంచాలని ఆర్‌బీఐ ఆయా బ్యాంకులను కోరిందని మరో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్‌కుమార్‌ గాంగ్వర్‌ వెల్లడించారు.

రాజధాని రైతులు నట్టేట మునిగిపోయారా...ఇందుకు కారణం ఎవరు....

చంద్రబాబు వల్లే రాజధాని రైతులు నట్టేట మునిగారు; వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ



ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాజధాని ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసిపి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఎపి రాజధాని రైతుల పరిస్ధితి దయనీయంగా మారిందన్నారు. చట్టబద్ధతలేని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తో రైతులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారన్నారు. పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియా సమావేశంలో ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశ పర్చాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో రియల్ వ్యాపారంతోపాటు, రైతులు కుదేలైపోగా, దీనివల్ల లబ్ధిపొందింది మాత్రం కారుచౌకగా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు, ఆయన గారి బినామీలేనని ఆరోపించారు. చంద్రబాబులాంటి బడాబాబులంతా సర్ధకున్నాక పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చి ప్రతి శాసనసబ్యునికి అరగంట సమయం తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేశారు.


Monday, November 28, 2016

పిల్లలు హైటు పెరగాలంటే ఏంచేయాలి

పిల్లలు ఎత్తుపెరగటానికి ఇలా చేస్తే చాలు




తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు...పిల్లలు ఎత్తుపెరగాలని కోరుకునే తల్లిదండ్రులు అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించటంలోకూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. అయితే ఇంతకంటే హైట్ పెరగాలనుకుంటుంటారు చాలామంది. 

అయితే ఎత్తు పెరగడం ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. అతి కృత్రిమంగా వచ్చేదీ కాదు. ఆపరేషన్ చేయించుకుంటే ఎత్తు పెరగడం అసాధ్యం. అందుకే ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మనం చేయాల్సిన పని మంచి ఆహారం తినడం.

సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది.

క్యారెట్ : క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

బీన్స్ : ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

బెండకాయ : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

బచ్చలికూర : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి.

బఠాని : బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండు : బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు.

సోయాబీన్ : ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

పాలు : రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.
వీటిని తూచాతప్పకుండా పాటిస్తే మీపిల్లలు  ఎత్తుపెరగటంతోపాటు మంచి ఆరోగ్యంగా కూడా ఉండటం ఖాయం.

కుంకుమపువ్వు వాడటం గర్బవతులకు డేంజరా....

గర్భవతులకు కుంకమపువ్వు మేలు చేస్తుందా...




కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకు తాగితే మంచి రంగున్న బిడ్డపుడతాడని అందరు చెబుతుంటారు. పెద్దల మాటలు విని గర్భవతులకు కుంకుమపువ్వును పాలల్లో కలిపి తాగిస్తుంటారు. మితంగా కుంకుమ పువ్వు గర్భవతులకు మేలు కలిగిస్తుంది...అలాగని అమితంగా తీసుకుంటే మాత్రం ప్రమాదమేనట.... నిజంగా కుంకుమ పువ్వు తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారా..? అంటే.. కాదని అంటోంది వైద్యశాస్త్రం. 

కుంకుమ పువ్వును పరిమితంగా తీసుకుంటే గర్భిణి స్త్రీలకు మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. దీనిలో బీ-కాంప్లెక్స్ విటమిన్ కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి విలువైన పోషకాలు ఉంటాయి. గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భం దాల్చిన తరువాత మహిళల్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్తేజమై… మలబద్ధకాన్ని పెంచుతుంది. కుంకుమ పువ్వును చిటికెడు మించకుండా తీసుకోవడం వల్ల.. జీర్ణప్రక్రియ సాఫీగా జరిగి.. మలబద్ధకాన్ని దరిచేరనివ్వదు. పైగా గర్భవతులకు ఆకలిని కూడా పెంచుతుంది.

ఇక కుంకుమ పువ్వు తాగడం వల్ల పుట్టబోయే బిడ్డ మంచి ఎర్రటి రంగులో పుడుతుందనేది అపోహ మాత్రమేనట. వైద్యశాస్త్రంలో అందుకు శాస్త్రీయ నిర్ధారణ లేదట. పుట్టబోయే బిడ్డ రంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ధారిస్తాయి, కాని తినే ఆహార పదార్ధాలు కావు. పూర్వికులు ఏం చెప్పినా అందులో నిగూఢార్ధం దాగి ఉంటుందనేది కుంకుమ పువ్వు విషయంలోనూ స్పష్టమవుతుంది.

పాలు మానవులకు మంచి పౌష్టికాహారం. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల.. గర్భిణిలకు చాలా మేలు జరుగుతుంది. గర్భం దాల్చిన స్త్రీలు రెండో నెల నుండి ఐదో నెలవరకు వాంతులు, వేవిళ్లు కారణంగా ఆహారం తీసుకోవాడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పాలను చూసి.. ఆ సమయంలో వికారం కనబరుస్తారు. కుంకుమ పువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచిగా మార్చడంతో పాటు సుగంధ భరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే నమ్మకాన్ని కల్పించడం వల్ల కుంకుమ పువ్వును అయిష్టంగా నైనా గర్భిణీలు తీసుకుంటారు.

కుంకుమ పువ్వును అమితంగా తీసుకుంటే కలిగే నష్టాలు కూడా ఎక్కువే. గర్భవతులు దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే ప్రమాదం ఉంది. 

Bharat Bandh: Mixed response to Left-sponsored demonetisation protest

Bharat Bandh: Mixed response to Left-sponsored demonetisation protest


Amid call for Jan Aakrosh Diwas by the Congress and Bharat Bandh by the Left over Prime Minister Narendra Modi’s demonetisation drive on Monday, emerging ground reports at early hours suggest a mixed from public.

While the CPI(M) workers were seen on the streets of Kolkata forcing shutdown, Samajwadi Party workers were also out on roads in Allahabad.In the wake of the call for shutdown, the Bangalore University had already postponed the semester exams which were to take place on Monday. In Kerala, the schools and colleges remained closed and the college exams have been postponed. However, school buses in Delhi were out on roads in the early hours today. According TV reports, people were seen queuing up near banks to avail banking services in major cities across the city.

In Bihar, train services were affected on Darbhanga-Samastipur rail route as protesters came out on tracks to stop the trains, TV news channels reported. However, Bihar Chief Minister Nitish Kumar has stayed away from taking any critical view of the demonetisation and seems to have supported the move by the Centre. Nitish Kumar’s support to Prime Minister Narendra Modi on demonetisation is in sharp contrast with his ally RJD chief Lalu Prasad Yadav and deputy chief minister Tejashwi Yadav as both the RJD leaders are against the move.

HONEY BEE’S VENOM NATURAL ENEMY OF HIV

HONEY BEE’S VENOM NATURAL ENEMY OF HIV




Many diseases in the 20th Century have been controlled or overcome by the progression in scientific knowledge; the diseases that were incurable in the past centuries have been cured with the efforts of scientists who got indulged in the discoveries and started working on latest scientific findings. Despite the development of new drugs and vaccines artificially, nature has provided the cure for any kind of disease in natural organisms which can be found and put before the public by the help of scientists.

Worker honey bees have in their abdomen the venom sac composed of colorless, odorless and watery fluid that is injected into the body of the opponent via a sting. This venom produces irritation and a burning sensation for some time depending on the type and species of bee. Worth mentioning here is that the venom of the honey bee has the ability to cure many fatal diseases that were incurable up to the start of 20th Century.
In 1998, Michael Wachinger and coworkers studied the honey bee venom and an important protein sequence that is present in the venom called ‘Mellitin’. This protein in honey bee has the antimicrobial activity and has the ability to disrupt bacterial membranes thus rendering them harmless. Along with mellitin they also studied another protein sequence called ‘cecropin’ which is found in moths and in mammals, this also had the same function as of mellitin. Mellitin also had the antiviral activity as the studies showed that the mellitin acts against many retroviruses in mice and also against Tobacco Mosaic Virus. In addition to these viruses, Wachinger and coworkers studied the effect of mellitin against the HIV-I virus that is the cause of AIDS. In HIV-I the mellitin caused the disruption of the viral coat protein and interfered with the genetic product of the virus and thus suppressed the viral gene expression lowering the HIV-I infection in human T lymphocyte cells.
Scientists of Washington University, School of Medicine in St. Louis have recently developed a technique to apply this naturally occurring protein sequence to the targeted cells in the human body via nanoparticles fused with mellitin protein. Nanoparticles are the particles of size in nanometers and one nanometer is the 1 billionth part of 1-meter object. Imagine these nanoparticles as the small balls with attached threads of mellitin to its outer surface. These nanoparticles have the ability to enter those parts of the body that remain undetectable and thus mellitin could be applied to the cells that remain undetectable. Mellitin gets attached to the coat protein of HIV viruses by making holes in the protein coat and suppresses their gene expression. Apart from HIV, various other diseases are also known that can be cured using bee venom which includes Parkinson’s disease, Alzheimer’s, Multiple sclerosis and Arthritis. Bee venom also has another chemical called Apamin that has the ability to cause the pituitary gland to release corticotropin hormone which in turn causes the pituitary to release cortisol which helps activate body’s own immune response.
From all this information what do you think Pakistani scientists must do? In my view “due to limited resources and limited funding our research facilities need more upgrading for such kind of experiments” and it is the phrase that our teachers use again and again but not all laboratories are like that. In Pakistan, we have some research institutes where such experimental works can be carried out by young researchers. What we need is to spread the word about the importance of honey bees and to make fresh and young scientists aware of the marvels of nature that are currently becoming extinct due to the invasion of GM crops and excessive use of round-up ready herbicides and other chemicals that are killing many friendly insects and other organisms along with the harmful ones.
Monsanto being the only top exporter of BT-cotton seeds in Pakistan has urged uneducated farmers to grow more and get more, but I do not think that they have provided us enough information about the fall of cotton yield a few years later, they have not told us completely about the side effects of endotoxins produced by BT-cotton and BT-corn on the experimental mice in labs on which they tested the effect of GM seeds. In USA honey bees are becoming extinct due to the use of ‘Terminator Seeds’, these are the seeds from which the GM plants produced would produce the sterile seeds, which means the next generation of seeds will not be able to produce the further generation of seeds. By the consumption of nectar from the flowers of such GM plants, heavy metals accumulate in the gut of the bees and they die due to blockage. Now, what do you think why you do not get the raw honey from the honey bee hives in Pakistan? The answer is that this is due to the shortage of honey bees and they are very rarely seen and even in the jungles the population of bees has been decreased. Now it is up to you whether you like to use GM plants or depend on nature and Almighty Lord to fulfill your needs.
I hope that in future the work on mellitin if carried out in Pakistan will also lead us to find the cure for Hepatitis-C as this disease is also caused due to retrovirus (RNA virus) and it can also be cured with this natural chemical or other useful proteins in the bee venom. After all, we must not forget this verse of Quran:

TOURISM RISE IN PAKISTAN

TOURISM RISE IN PAKISTAN





Rnowned tourist spots in Pakistan wore a deserted look some time ago owing to a poor law and order situation in the country due to the menace of terrorism. In the past couple of years though, the scenic valleys, eerily quiet deserts and historical buildings seem to have ditched the ghosts of the past to welcome tourists to once again tread on the paths less travelled. According to statistics shared by Pakistan Tourism Development Corporation (PTDC), around 50 million tourists will travel around Pakistan on weekend trips this year.

Once again Pakistan’s tourism industry is taking a flight, only this time the country is looking to sustain a steady flow of local and foreign tourists. Industry experts share the opinion that the trend of local tourism in Pakistan is currently witnessing a boom which is likely to continue into the future as well. This trend has benefitted other sectors of the economy as well, including the real estate sector and small businesses.

In terms of the Pakistani real estate sector, improving law and order situation has bettered the value of pieces of land in the country. This trend has especially given confidence to people to rent out their spaces to tourists during peak tourism season in tourist spots. This way they can earn a respectable income while also improving the value of their property.

Coming back to the PTDC report, it is very clear that the number of local tourists will keep increasing as all areas of Pakistan are purged of violent anti-state elements. With these changes, local travelers and adventurers are breaking out of their shell to embrace a new age of tourism industry in the country that promises to give them the best value for their money.

Pakistan offers a unique variety of tourism that includes nature travel, adventure travel, cultural and heritage tourism and religious tourism from the many available options. The country is especially known worldwide for being the cradle of religious orders that include Buddhism and Sikhism.

Still, the trend of attracting foreign tourists to the country depends on the passion for travel among the local population. As more and more Pakistanis make it a point to travel to all corners of the country and promote their journeys online, there is a great chance that this trend will also encourage foreigners to visit Pakistan. So, in order to promotetourism in Pakistan, locals will have to take the initiative and become ambassadors for the tourism industry.

Moreover, to promote local tourism among the young generation of Pakistan, the PTDC has taken an initiative to help achieve its targets. The PTDC in collaboration with University of Management and Technology, Lahore has launched “Pakistan Tourism Friends Club”. Members of the club can avail almost 20 percent of discount on stay at all PTDC motels throughout the country.

Pakistan failed to attract a lot of tourists in the past decade because of the usual suspects – terrorism and the resultant economic strife. Other than this, the local tourism industry has also suffered a bit due to official apathy of the officials concerned. An example follows.

In Pakistan, all official tourism sites, national and provincial, are unorganized at best. The ordeal is especially testing for foreign tourists interested in traveling to the country on a sightseeing trip. The Pakistani government would do well by making amendments to the tourism websites and make them more interactive and easy-to-use for everyone.

With all its shortcomings, Pakistan still manages to welcome foreign tourists numbering in thousands each year. For now a vast majority of them belong to Asian countries and steps are needed to be taken to encourage people in the West. By tweaking the tourism system a bit here and there, Pakistan can realize the immense potential that its tourism sector holds.

She fled with my money, says Sibal; Joshi hits back

She fled with my money, says Sibal; Joshi hits back



day after she quit congress and joined BJP, Rita Bahuguna joshi asked senior Congress member and RS MP Kapil sibal to apologise for his remarks that she had failed to return his money "It is unbecoming of a senior leader like Sibal and his statement reflects the actual character of Congress leaders and the levels to which ey can stoop to," Joshi told TOI on Friday. Soon after Joshi, a former Congress UP unit chief, joined BJP on Thursday, Sibal in a TV interview termed her a "migratory bird" who had left with his money .Joshi clarified that as a congress mla she had sought Sibal's MPLAD (local area development) fund for her Lucknow Cantt constituency since Sibal was recently elected to the upper house from Uttar Pradesh and this was not anyone's personal money. Joshi said she wrote to Sibal and Lucknow collector on Thursday to withdraw the fund and freeze the account since she won't be with the Congress any more and is also quitting as MLA. "I wrote to them at 5.30 pm soon after joining BJP," she said. Joshi said Sibal's statement is highly objectionable and misleading as he insinuated that she had run off with his personal money .

Sunday, November 27, 2016

New 500 Notes With Faulty Printing Valid – RBI

New 500 Notes With Faulty Printing Valid – RBI



Comedy of errors of Continues. Demonetisation dramas continues still further. In a hurry to introduce new 500 rupee note to replace banned one RbI made grave mistake of issuing new notes with visible errors, which forced it to announce even faultly printed notes are valid. People are Confused between new 500 notes and fake notes.In a rush it seems RBI is not specific about the number of 500 rupes denomination with visible errors .some notes almost superimpose on the security thread in some notes , while in others there is a visible shadow of Mahatma Gandhi’s face. The position of the Ashoka Pillar lion in wrong place. some of the numbers on the note jut out. RBI has said these notes are valid . If any body find it difficult, they can exchange – RBI said

Fidel Castro Rare Pictures

Fidel Castro Rare Pictures










Goa Paves The Way To Cashless Without Smart Phone

Goa Paves The Way To Cashless Without Smart Phone




Goa is introducing cashless transaction without smart phone. Just by dialing *99# , one can start a cashless transaction. This system helps small vendors who cannot afford swiping machine. Goa government making arrangements to introduce cashless transactions by December 31st everywhere. In addition to swiping machines, Goa iOn an experimental basis to create awareness government is introducing cashless transactions from Monday onwards at Places like Panaji and Mopusa. There will not be limit on transfer of money. Chief Minister Laxmikant Parsekar assured that there will not be any additional charge for cashless transactions through mobile. Defense minister Manohar Parikkar who is ex chief minister of Goa held a meeting with officials of public sector and private banks. Modalities to implement the cashless scheme in the state were discussed during this meeting.s trying to implement cashless transactions on an ordinary cell phone.

Smriti Irani Face To Face With A Cobbler Wayside

Smriti Irani Face To Face With A Cobbler Wayside




Union Minister for Textiles mending her Foot wear on way side in Coimbatore hit Head lines of National Media. She is known for her down to earth image. On Saturday she attended Isha Foundation programme outside the Coimbatore. On her way she stopped opposite the Perur Patteeswarar Udanamar Pachainayagi Amman Temple, the way side cobbler to mend her foot wear. After getting down her car , she sat down comfortably beside the cobbler Ganesh for more than 10 minutes. She asked the cobbler how much to pay. He asked 10rupees as charge. After completion of the repair minister gave 100rupee note to the cobbler Ganesh. He told that he does not have change for hundred. Then she asked him to keep the note with him. But the cobbler is also an upright person like the minister. He volunteered to repair what she is wearing other foot in return. Bharatiya Janata Party’s (BJP) State vice president Vanathi Srinivasan, was along with her. After this minister proceeded to the Isha Foundation to address a gathering on ‘The DNA of Success’.


ముద్రగడను మోహన్ బాబు ఎందుకు కలిశాడు

ముద్రగడ ఇంటికి వెళ్ళిన మంచు మోహన్ బాబు



చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని శక్తులు ఏకమవుతున్నాయి. కాపు ఉద్యమాన్ని తీవ్రస్ధాయిలో నడుపుతున్న ముద్రగడకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది.  ఇప్పటికే వైసిపి ప్రత్యేక్షంగానే ముద్రగడ పోరాటానికి మద్దతు తెలుపుతుండగా అటు సినీఇండస్ట్రీ  దాదాగా పిలవబడుతున్న దాసరి  నారాయణరావు ఇప్పటికే కాపుపోరాటానికి తెరవెనుక వ్యూహకర్తగా మారారు. చిరంజీవితోపాటు ఇతర సినీప్రముఖులు కూడా ముద్రగడకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. తాజాగా సినీనటుడు మంచు మోహన్ బాబు ముద్రగడను కలవటం చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులను సినీనటుడు మోహన్‌బాబు దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాపు జాతి కోసం ముద్రగడ చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తనను ముద్రగడ ఆహ్వానించలేదని.. తానే ముద్రగడకు ఫోన్‌ చేసి మీ ఇంటికి వస్తున్నానని చెప్పానని మోహన్‌బాబు వెల్లడించారు. మోహన్ బాబు ముద్రగడను కలవటం చూస్తుంటే భవిష్యత్తులో ఎపిలో  ఎదో జరగబోతుందన్న సంకేతాలకు ఇది స్పష్టత ఇస్తున్నట్లవుతుంది. మోహన్ బాబు ముద్రగడ ఇంటికి వెళ్ళటంపై ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తుంది.

బాలయ్య తడాఖా చంద్రబాబుకు తెలిసొచ్చిందా....

చిరుతోపాటు, బాబుకు షాకిచ్చిన బాలయ్య


విశాఖ తీరంలో తుపానును సృష్టించిన విశాఖ ఫిల్మ్ ఛాంబర్స్ క్లబ్ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లేననిపిస్తుంది. ఈ క్లబ్ కు భూ కేటాయింపులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే శంకుస్థాపన జరిగినా, ఆ శంకుస్థాపన చేసింది స్వయానా బాబు గారే అయినా.. ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడం ఆసక్తిదాయకంగా ఉంది.  ఈ ఫిల్మ్ క్లబ్ వ్యవహారంలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు వినిపిస్తూ ఉండటం. శంకు స్థాపన జరిగిన ఈ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దుకావడం చిరంజీవికి ఒక విధంగా షాకే అనే మాట వినిపిస్తోంది. స్వయంగా బాలకృష్ణ రంగ ప్రవేశం చేసి భూ కేటాయింపు రద్దులో క్రియాశీల పాత్ర పోషించాడని సిని ఇండస్ట్రీతోపాటు, పొలికల్ ఇండస్ట్రీకూడా కోడై కూస్తుంది. ఫిల్మ్ క్లబ్ వ్యవహారంలో  గంటాకు , అయ్యన్నకు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఈ విషయంలో అయ్యన్నపాత్రుడి వర్గం కారాలుమిరియాలు నూరింది. ప్రజా సంఘాల పేరుతో ఉద్యమం మొదలైంది. అలాగే గంటాకు చెక్ చెప్పడానికి బాలయ్య రూట్లో వెళ్లాడు అయ్యన్న. చిరంజీవికి గంటా ఎంత సన్నిహితుడో చెప్పనక్కర్లేదు, ఈ పాయింట్ ను వాడుకొంటూ, ఫిల్మ్ క్లబ్ శంకుస్థాపనకు బాలయ్యకు ఆహ్వానం దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అయ్యన్న నందమూరి నటసింహాన్ని రెచ్చగొట్టినట్టు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్స్ క్లబ్ కు కేటాయించిన భూమి విలువ పదిహేను వందల కోట్లు అని, దీంట్లో గంటా, చిరంజీవి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అయ్యన్న బాలయ్యకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాలయ్య లోకేష్ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఫిల్మ్ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దు చేయించాడనే మాట వినిపిస్తోంది. ఒకవైపు గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉండగా.. ఫిల్మ్ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దు అయిన విషయాన్ని ప్రకటించారు. ఇది కేవలం గంటాకు తగిలిన ఎదురుదెబ్బ కాదు.. బాలయ్య దగ్గర చిరంజీవిని బూచిగా చూపించి అయ్యన్న కొట్టించిన దెబ్బ అనేది స్పష్టం అవుతోంది.

Saturday, November 26, 2016

యూనివర్శిటీల విసిలను నియమించేది ఎవరు

విసిలనియామకంపై విచారణ చేపట్టిన సుఫ్రింకోర్టు


రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియామకాలు చేపట్టేది ఎవరో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉపకులపతుల నియామకాలను సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ మనోహర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవుల భర్తీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ తరఫున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గి విజ్ఞప్తి చేశారు. దీనిపై పిటిషనర్‌ మనోహర్‌రావు, యూజీసీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వమే సెర్చ్‌ కమిటీ ఏర్పాటు చేసి వీసీల నియామకాలు చేపడుతోందని, అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు సుబోధ్‌ మార్కండేయ, సీవీ సింగ్‌, ఆదినారాయణరావులు న్యాయస్థానానికి తెలిపారు. విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర గవర్నర్‌ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన అనుమతితోనే నియామకాలు చేపడుతున్నామని అటార్నీ జనరల్‌ ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. దీంతో, వీసీల నియామకాలు చేపట్టడానికి అధికారం ఎవరికి ఉంది? సెర్చ్‌ కమిటీ ఏర్పాటు గవర్నర్‌ పరిధిలోనే ఉందా? ప్రభుత్వం చేపట్టవచ్చా అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. ధర్మాసనం విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది

రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఎవరబ్బాయ్...

ధనుష్ మా అబ్బాయే




తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, నటుడు ధనుష్‌ తమ కుమారుడేనంటూ మదురై జిల్లాకు చెందిన దంపతులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం జనవరి 12న స్వయంగా హాజరు కావాలని ధనుష్‌కు సమన్లు జారీ చేసింది. మదురై జిల్లా మేలూరు సమీపంలోని ఆ.మలంపట్టికి చెందిన కదిరేశన్‌, మీనాళ్‌ దంపతులు మేలూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ధనుష్‌ తమ కుమారుడని, అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు. అవసానదశలో ఉన్న తాము కుమారుడితో కలిసి జీవించాలని భావిస్తున్నామని, ధనుష్‌ తమ కుమారుడేనని చెప్పడానికి పలు ఆధారాలు ఉన్నాయని, అవి చాలవంటే డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధమేనని పేర్కొన్నారు. పిటిషన్‌ శుక్రవారం విచారణకు రాగా ధనుష్‌ను జనవరి 12న న్యాయస్థానానికి హాజరు కావాలని సమన్లు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. ధనుష్‌ వివాహ సమయంలోనూ ఓ వ్యక్తి ధనుష్‌ తమ కుమారుడని, అతడిని తమకు అప్పగించాలని వివాదాన్ని రేపడంతో ధనుష్‌ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగింది.

వెంకన్న సన్నిధిలో దత్తన్న

స్వామి సన్నిధిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కేంద్రమంత్రి , తెలంగాణా బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తెలంగాణాలో పెరిగిన పోలీసుల ఆత్మహత్యలు

రివాల్వర్ తోకాల్చుకుని ఎస్సై ఆత్మహత్య


ప్రధాని బందోబస్తు విధుల నిమిత్తం నగరానికి వచ్చిన ఓ ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఉమెందర్‌ కథనం ప్రకారం.. కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి పోలీసు స్టేషన్‌లో శ్రీధర్‌ ఎస్సైగా పనిచేస్తున్నాడు. 2012లో ఎస్సైగా రిక్రూట్‌ అయ్యాడు. ప్రధాని బందోబస్తు కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. బందోబస్తులో భాగంగా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో గల 20 అంతస్తుల భవనంలోని 19వ అంతస్తులో నిలబడి గస్తీ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 9:30గంటల సమయంలో విధుల్లో ఉండగానే తన రివాల్వర్‌తో చాతి భాగంలో కాల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రివాల్వర్‌ శబ్దం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చనిపోతానని ముందే చెప్పాడు.....

విప్లవ యోధుడు క్యాస్ట్రో కన్నుమూత



క్యూబా విప్లవ మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో(90) శనివారం కన్నుమూశారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో జన్మించిన ఆయన అసలు పేరు ఫిడెల్‌ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్‌. 1959 నుంచి 1976 వరకూ ప్రధానిగా పనిచేసిన ఆయన .. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 1959లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలటరీ ఆధిపత్యాన్ని కూలదోసిన క్యాస్ట్రో పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేశారు. క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు పాలించారు. 2006లో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పార్టీ అధ్యక్ష పదవితో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్యాస్ట్రో చివరిసారిగా ఏప్రిల్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ సభలో ముగింపు ప్రసంగం చేశారు. తనకు త్వరలో 90 ఏళ్లు వస్తున్నాయని.. మరికొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని ముందుగానే ఆయన ప్రకటించారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆయన కనిపించకపోవడంతో చాలా సార్లు మరణించారని వార్తలు కూడా వచ్చాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని బాధ్యతలను సోదరుడు రౌల్‌కు అప్పగించాక ఆయన ఆరు నెలల పాటు ఎవరికీ కనిపించలేదు. 19, జూన్‌ 2008లో ఆయన వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం ఎంతో కృషి చేసిన క్యాస్ట్రోకు 2014లో చైనా శాంతి బహుమతి లభించింది. నోబెల్‌ శాంతి పురస్కారానికి సమాంతరంగా 2010 నుంచి కన్ఫ్యూసియస్‌ శాంతి బహుమతి పేరుతో ఏటా దీన్ని చైనా అందిస్తోంది. నోబెల్‌ శాంతి పురస్కారాన్ని మలాలా, కైలాష్‌ సత్యార్థి స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆయన ఈ కన్ఫ్యూసియస్‌ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.

Saturday, November 12, 2016

నోట్ల రద్దుతో మావోల ఇక్కట్లు

కొత్తనోట్లకోసం మావోసానుభూతిపరుల ప్రయత్నాలు



పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టులకు సైతం ఇబ్బందికరంగా మారింది. వారుసైతం తమ వద్ద నున్న నోట్లు మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాంచీలో మావోయిస్టులకు చెందిన డబ్బును తెచ్చి బ్యాంకులో మారుస్తూ ఓ సానుభూతిపరుడు పోలీసులకు పట్టుబడ్డాడు.  రాంచీకి చెందిన పెట్రోల్‌ బంకు నిర్వాహకుడు నంద కిశోర్‌ రూ.25 లక్షలు నగదు డిపాజిట్‌ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. పెట్రోల్‌ బంకుకు సంబంధించిన డబ్బు అని చెప్పి డిపాజిట్‌ చేసేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు విచారించారు. దీంతో ఆ డబ్బు పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత దినేశ్‌ గోపేకి చెందినవని ఆయన తెలిపినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేయటంతో మావోయిస్టులు వారి వద్ద ఉన్న డబ్బును మొత్తాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వాటిపై నిఘా ఏర్పాటు చేశామని ఝార్ఖండ్‌ పోలీసు అధికారి ఎంఎస్‌ భాటియా తెలిపారు.

14వరకు టోల్ రద్దు

టోల్ పన్ను వసూళ్ళ నిలిపివేత


పెద్ద నోట్లు రద్దుతో అనేక సమస్యలు దేశవ్యాప్తంగా ఉత్పన్నతున్నాయి. ఇందో ఒకటి టోల్ పన్ను చెల్లింపు...సరిపడినంత చిల్లర లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతో తాత్కాలికంగా ఉపసమనం కలిగిస్తూ దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ల వద్ద పన్నుల వసూళ్ల నిలుపుదల గడువును కేంద్రం పొడిగించింది. ఈనెల 14 అర్థరాత్రి వరకూ టోల్‌ గేట్ల వద్ద పన్నుల వసూళ్లను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 11వ తేదీ అర్థరాత్రి వరకూ గడువు విధించినప్పటికీ చిన్న నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

42 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

పంజాబ్ లో నాటకీయం; ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్సేలు రాజీనామా


పంజాబ్‌లో సట్లెజ్‌ యమునా లింక్‌(ఎస్‌వైఎల్‌) వివాదంతో రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. ఎస్‌వైఎల్‌ కెనాల్‌ వినియోగంపై సుప్రీంకోర్టు హరియాణాకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పంజాబ్‌లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. దీనిపై తమ అసంతృప్తిని తెలుపుతూ ప్రతిపక్ష నేత చంద్రజీత్‌ సింగ్‌తో సహా 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌పై విమర్శలు చేశారు. ప్రజల ఆసక్తులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. స్పీకర్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా అంగీకరించలేదు. అమరీందర్‌ ఇప్పటికే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. పంజాబ్‌ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన ‘పంజాబ్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌’ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, దిల్లీ, చండీగఢ్‌లకు నీటి పంపకం విషయంలో పంజాబ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు ఆదేశించింది.

అమ్మా, నాన్న చచ్చిపొమ్మన్నారు.

మందలింపుకే ప్రాణాలు తీసుకుంది


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి విద్యార్ధిని వామిశెట్టి భవాని(14) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గీత కార్మికుడైన ఆమె తండ్రి కైలాబ్‌ బయటకు వెళ్లగా తల్లి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లింది. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా తమ కుమార్తె పడి ఉండటంతో వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భవాని మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. భవాని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సంఘటనా స్థలం వద్ద భవాని రాసిన ఓ లేఖ పోలీసులకు లభించింది. ఆ లేఖలో ‘‘నాన్నా నన్ను చచ్చిపోమన్నావుగా, అమ్మా నువ్వు కూడా నన్ను చచ్చిపోతే బాగుంటుంది అన్నావు... అందుకే చచ్చిపోతున్నాను’’ అని రాసి ఉంది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.

Wednesday, November 9, 2016

పొట్ట చుట్టూ కొవ్వు పెరిగితే షుగర్ వ్యాధి వస్తుందా...

పొట్టచుట్టూ కొవ్వు కొంపముంచుతుందా,,


పొట్ట దగ్గర మాత్రం కొవ్వు పెరగటం యమడేంజరంటున్నారు వైద్యులు. దీనివల్ల దీర్షకాలికమైన షుగర్ లాంటి వ్యాధులు రావటం ఖాయమని చెబుతున్నారు. ఈ విషయంలో ముందునుండి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుదలను అంతతేలిగ్గా తీసుకోవటం తగదట. దీనివల్ల టైప్‌2 మధుమేహంతో పాటూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువట. పలు  అధ్యయనాల్లో కూడా ఈ విషయం బహిర్గతమైందట. తరచూ వ్యాకులతకు గురయ్యే మహిళల్లో కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా అందుకు కారణాలు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.

% ముందుగా మనం తీసుకునే కొవ్వుల్లో మార్పు చేసుకోవాలి. మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నెయ్యీ, పీనట్‌ బటర్‌లు మితంగా తీసుకోవాలి. 
% మెగ్నీషియం పోషకం మన శరీరంలో 300 రకాల చర్యల్ని నియంత్రిస్తుంది. మెగ్నీషియం తక్కువగా ఉండేవారిలో... ఇన్సులిన్‌ స్థాయులు పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఆ ప్రభావం అందంపైనే కాదు, ఆరోగ్యంపైనా పడుతుంది. గింజలూ, చేపలూ, బీన్స్‌, పెరుగు, అరటిపండ్లు, ఎండు ఫలాలూ, చాక్లెట్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దాన్ని శరీరానికి సరిపడా తీసుకోవాలి. 
%  పొట్టకు సంబంధించే కొన్ని వ్యాయామాలు  నిపుణుల సలహాతో చేసేందుకు ప్రయత్నించాలి.

500, 1000 నోటా మాకొద్దు బాబోయ్


రద్దు నిర్ణయం వెలువడింది; నోట్ల చెలామణి అగిపోయింది



మోడి నోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు సామాన్యునికి తిప్పలు తెచ్చిపెట్టింది. నిన్నరాత్రి 500, 1000 నోట్లు  రద్దు నిర్ణయం వెలువడిన మరుక్షణం నుండే దుకాణదారులు ఆనోట్లు తీసుకుని సామాగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి ఖరాఖండిగా మేం తీసుకోమని చెప్పేస్తుండటంతో ఏంచేయాలో పాలుపోని పరిస్ధితుల్లో పడ్డారు. చిరువ్యాపారులు, తినుబండారాల దుకాణదారులు ఆనోట్లను స్వీకరించకపోవటంతో ప్రజలు దిక్కుతోచని పరిస్ధితుల్లో పడ్డారు. నల్ల ధనం నిర్మూలన సంగతి దేవుడెరుకగాని మోడి నిర్ణయంపై అటు సామాన్య ప్రజానికం మాత్రం తీవ్రస్ధాయి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 500, 1000 నోట్ల చలామణి నిలిపోయిన నేపధ్యంలో ప్రస్తుతం కొనుగోళ్లు అమ్మకాలు నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది. ఈ పరిస్ధితి తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడుతుందేమోనన్న భయాందోళనలు నెలకొంటున్నాయి.

నోట్ల రద్దు ఎంత అమానుషం

ఇది అమానుష చర్య; క్రేజీ వాల్




రూ.500, 1000ను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై ఆప్ రధసారధి తీవ్రంగా స్పందించారు. ప్రధాని నిర్ణయం అమానుష చర్యగా ఆయన అభివర్ణించారు.. మోడి నిర్ణయంపై పశ్చిమబంగా సీఎం మమతా బెనర్జీ చేసిన ట్వీట్‌ను కేజ్రీవాల్‌ రీట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుష మన్నారు.‘కేంద్రం అవివేకంతో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని మమతా ట్వీట్‌ చేయగా దాన్ని కేజ్రీవాల్‌ రీట్వీట్‌ చేశారు.

నల్లకుభేరుల ఆటకట్టు

500,1000 నోట్ల రద్దు



నల్లకుభేరుల ఆటకట్టించేందుకు  కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. దిల్లీ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. డిసెంబరు 30లోపు డిపాజిట్‌ చేయనివారు.. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్‌ చేయవచ్చని తెలిపారు. రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు.  నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయిన నేపధ్యంలోనే  ఈనిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మోడిచెప్పారు. ఉగ్రవాద సంస్థలు రూ.500, రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చాం. సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌’’ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

Tuesday, November 8, 2016

దటీజ్ మీడియా పవర్

వెనక్కు తగ్గిన కేంద్రం; ఎన్డీటీవి ప్రసారాలు యదాతధం





ఎన్డీటీవీ ఇండియా హిందీ ఛానల్‌పై ఒకరోజు విధించిన నిషేధాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తటంతో , ప్రసారాల నిలిపివేతపై ఎన్డీటీవీ పెట్టుకున్న అర్జీని మంగళవారం విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడంతో సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిషేధాన్ని నిలిపివేశారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేసిందని ప్రభుత్వం నవంబర్‌ 9న ఛానల్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. అదే సమాచారాన్ని ఇతర ఛానళ్లూ ప్రసారం చేశాయని ఎన్డీటీవీ వాదిస్తోంది.

డూప్ తో చేయాల్సిన పనిని....ఓరిజినల్ గా చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు

కన్నడ చిత్రషూటింగ్ లో విషాదం; ఇద్దరు నటుల మృతి



ఓ కన్నడ సినిమా చిత్రీకరణ సందర్భంగా  కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ నటుడు దునియా విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న మాస్తిగుడి సినిమా షూటింగ్‌లో భాగంగా బెంగళూరు సమీపంలోని తిప్పగొండనహళ్లి రిజర్వయార్ లో  హెలికాప్టర్‌ పైనుంచి దూకే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట ఇద్దరు వర్ధమాన నటులు ఉదయ్‌, అనిల్‌ హెలికాప్టర్‌ నుంచి దూకారు. అనంతరం చిత్ర కథానాయకుడు విజయ్‌ నీటిలోకి దూకాడు. అయితే ప్రమాద వశాత్తు నీటిలో మునిగి ఉదయ్‌, అనిల్‌ మృతి చెందారు. వెంటనే స్పందించిన చిత్ర బృందం కథానాయకుడు విజయ్‌ను రక్షించింది. ఈఘటన సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కన్నీటి పర్యంతం చేసింది.

ఇక నువ్వే మాకు లీడర్

రాహుల్ కు పార్టీ అధ్యక్షబాధ్యతలు; సిడబ్లుూసి తీర్మానం




సోనియా వారసునిగా రాహుల్‌గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఏకగీవ్రంగా కోరింది. సోమవారం న్యూదిల్లీలో రాహుల్‌ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. అనారోగ్యం కారణంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేక పోయారు. .త్వరలో పలు  రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో అక్కడ విజయంకోసం 
వ్యూహాల రూపకల్పన, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. పార్టీ అధ్యక్ష పీఠాన్ని రాహుల్‌గాంధీ చేపట్టాలని సమావేశంలో తొలుత ఏకే ఆంటోనీ ప్రతిపాదించారు. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా సభ్యులంతా మద్దతు తెలిపారు. మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్‌ అన్ని శక్తులు కూడగట్టుకోవాల్సిన అవసరం ఉందని సమావేశమనంతరం కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. 1998 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతూ వచ్చారు. ఇక రాహుల్‌గాంధీ 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతకొంత కాలంగా సోనియా ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌గాంధీకి అప్పగించాలని అధినాయకత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగీవ్రంగా తీర్మానించారు.

అన్న ఎన్టీఆర్ తరువాత చంద్రబాబే



    ప్రజాపాలన టిడిపితోనేసాధ్యం; మంత్రి పత్తిపాటి

    ప్రజాపాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండల పరిధిలోని కనపర్రు, అమీన్‌సాహెబ్‌పాలెం, ఇర్లపాడు గ్రామాల్లో జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజంతో పాటు నిరుపేదల జీవనంలో మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షనేత జగన్ తాను అవినీతి బురదలో చిక్కిందికాక అందరికి ఆబురదను అంటించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మల్లాయపాలెం గ్రామస్థులు పలువురు వైకాపాకు రాజీనామ చేసి తెదేపాలో చేరారు. చిలకలూరిపేట మార్కెటింగ్‌ యార్డు ఛైర్మెన్‌ నెల్లూరి సదాశివరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌.సుభానీ, యార్డు మాజీ ఛైర్మెన్‌ తేళ్ల సుబ్బారావు, సర్పంచులు కుంభా సాంబయ్య, రంగనాథుల నాగేశ్వరరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు పూదోట అంతయ్య, యార్డు, సొసైటీ డైరెక్టర్లు పూర్నె హనుమంతరావు, కందిమళ్ల హరిబాబు, డీసీ ఛైర్మెన్‌ రంగనాథుల బ్రహ్మయ్య, సాగునీటి సంఘం అధ్యక్షుడు పూదోట మరియదాసు, ఎంపీటీసీ నాగోతు సుందరరాజు, చింతలపూడి వెంకయ్య చౌదరి, తదితరులున్నారు.

    ఇంటి యజమాని మందలింపు...ఇల్లాలి ఆత్మహత్య

    కూకట్ పల్లిలో వివాహిత ఆత్మహత్య; ఇంటి యజమాని దూషించటమే కారణం


    సున్నిత మనస్తత్వంతో ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నిన్నటికి నిన్న ప్రొఫెసర్ మందలించిందిందన్న కారణంగా వైద్య విద్యార్ధిని గుంటూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసిన కొద్దిరోజులుకే కూకట్ పల్లిలో ఇంటి ఓనర్ దూషించాడన్న కారణంతో ఓ ఇల్లాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరని కలవర పరిచింది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్టేషన్‌ పరిధిలో  జరిగింది. కూకట్‌పల్లి మెడికల్‌ సొసైటీలోని ప్రసన్నకుమార్‌, స్నేహ‌ల‌త‌ దంపతులకు చెందిన ఇంటి మొదటి అంతస్తులో రామకృష్ణ, సుజాత దంపతులు అద్దెకు నివాసముంటున్నారు. గ్రౌండ్‌ ప్లోర్‌లో యజమానులు వుంటున్నారు. ఆదివారం సాయంత్రం పిల్లలు ఆడుకునే సమయంలో ఇంట్లో నుంచి శబ్ధాలు ఇంటి యజమానికి వినిపించాయి. దీంతో ఆగ్రహించిన యజమాని దంపతులు సుజాతను పరుష పదజాలంతో దూషించారు. ఆ సమయంలో సుజాత భర్త రామకృష్ణ ఇంట్లో లేరు. రామకృష్ణ ఇంటికి తిరిగి వచ్చేసరికి సుజాత ఉరేసుకుని ఉండటంతో కన్నీరుమున్నీరయ్యాడు.

    తన చావుకు కారణం ఇంటి యజమాని దంపతులేనని..తన భర్త లేని సమయంలో వారు తనను అవమానపరిచారని.. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుజాత గోడలు, తలుపులపై రాసింది. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమానులు పరారీలో వున్నారు.

    Monday, November 7, 2016

    చుండ్రు సమస్య బాధిస్తుందా...

    చుండ్రు సమస్య తగ్గిపోవాలంటే

    రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా సమాజంలో అనేక మందిని చుండ్రు అనేది ఓ సమస్యగా బాధిస్తుంది. ఆడ,మగ అని తేడా లెకుండా ప్రతి ఒక్కరు చుడ్రు సమస్యతో భాదపడుతున్నారు. దీని భారి నుండి కాపాడుకోవాలంటే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం....

    % పావుకప్పు వేపాకును రసముకు రెండు స్పూన్ల కొబ్బరిపాలు రెండు స్పూన్ల బీట్రూట్ రసము, ఒక చెంచా కొబ్బరినునెను కలిపి పేస్తులా చేసి తలకు ఒక ఇరవ్యి నిమిషాలు ఉంచి ఆ తరువాత తల స్నానం చేయలి.


    % మెంతులను రాత్రంతా నీళ్ళలో నానపెట్టి ఆతరువాత మెత్తగా పేస్తులా చేసి దానిలో వెనిగర్,ఒక చెంచా నిమ్మరసంకలిపి దానిని తలకు రాసి ఆరినతరువాత షికాయ లేద కుకుందుతో స్నానం చేయలి.


    % షీకాయ పొడిని రాత్రంతా నిళ్ళలొ నానపెట్టి మరునాడు ఉదయం దానిలో ఉసిరికాయ పొడిని కలిపి తలకు రాసి ఒకగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

    % అలొవెరా రసాన్ని తలకు రాసి కొంతసమయం తరువాత తలస్నానం చేయాలి ఆతరువాత కండీషనర్ రాసుకొంతేజుట్టు ఎంతొ మెత్తగా ఉండటమే కాక జుట్టు ఎంతో ఆరొగ్యముగా ఉంటుంది.

    ఫ్యాట్ కరిగిపోవాలంటే ఏంచేయాలి....

    కొవ్వు కరిగించేయ్

    శరీరములో అధికముగా ఉన్న కొవ్వు తగ్గించుకొవటనికి ఎంతగానో శ్రమిస్తుంటారు చాలామంది..మన శరీరంలోని ఫ్యాట్ ను కరిగించే అస్త్రాలు మన చేతిలో ఉన్నాయని మాత్రం గుర్తించరు. కొవ్వును కరిగించే ఆహరపదార్ధాలు రోజూ తినే ఆహరములొ భాగంచేసుకొంటే శరీరములో ఉన్న అధికబరువును తగ్గించుకొవచ్చు.

    % ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన రక్తములో ఉన్న క్రొవ్వును అదుపులో ఉంచడమే కాక పెరగకుండాచూస్తుంది.

    % టమటా,పచ్చిమిర్చి ఈ రెండింటిలో క్రొవ్వును తగ్గించే లక్షణాలు ఉన్నాయి,వీటిని సలాడ్స్ గా తీసుకొవడం వలనకూడా ఉపయోగం ఉంటుంది.

    % చిరుధాన్యాలలో తక్కువ కేలరిలు ఉంటాయి,కనుక వాటిని నేరుగా కాని పొడిచేసి గాని తిసుకొంటే వంటికి కావలసినశక్తి లభించడమే కాక క్రొవ్వు పెరగకుండ చేస్తాయి.

    % చెపలలో ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి అంతే కాక క్రొవ్వును దగ్గరికి రానియ కూడా చేస్తుంది.కనుక దీనిని మధ్యాహ్న భొజనములో లేదా రాత్రి భొజనములో ఒక భాగం చెసుకొంటే మంచిది.

    % ఉదయం తినే ఆహరములో నిమ్మ,నారింజ,యాపిల్ వంటి సి విటమిన్ ఉన్న పండ్లను తినాలి,వాటితొ పాటుఉదయమే ఒక గ్లాసు వేడి నీటిలొ ఒక స్పూన్ తేనె కలిపి తీసుకొవాలి.విటితొ పాటు నట్స్ ని కూడా చెర్చుకుంటే వంటికికావలసిన శక్తిని ఇవ్వటమే కాక క్రొవ్వును పెరగకుండా చేస్తుంది

    జట్టు రాలటం తగ్గిపోవాలంటే

    జాగ్రత్తలు పాటిస్తే కేశాలు సురక్షితం

    ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్యం, జన్యుపర లోపాల వలన జుట్టు రాలటం సాధారణం అని చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల ఆహర పదార్థాల సేకరణ వలన జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలటాన్ని నివారించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం... 

    విటమిన్ ‘సి‘

    పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా విటమిన్ ‘C’ ని ఎక్కువగా కలిగి ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ 'C' అవసరం. నిపుణులు అందరు విటమిన్ ‘C’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినమని సలహా ఇస్తారు. మీరు ఎక్కువగా– కివి ఫ్రూట్, స్ట్రాబెర్రీ, చేర్రీస్, టమాట మరియు సిట్రస్ పండ్లని ఎక్కువ తినటం మంచిది.

    ఎరుపు & పసుపు రంగు పండ్లు

    ఈ రకమైన పండ్లలో ఎక్కువగా ఫైటో రసాయనాలు మరియు కేరోటిన్స్ ఉంటాయి. ఈ రకమైన యాంటీ-ఆక్సిడెంట్స్ జుట్టుకు శక్తిని ఇస్తాయి. క్యారేట్స్, మాంగోస్, పంప్కిన్ వంటి ఎరుపు మరియు పసుపుపచ్చ పండ్లు కూరగాయలను ఎక్కువగా తినండి.

    సోయాబీన్

    ఇది మీకు ఇష్టమైన ఆహరం కాకపోవచ్చు. కానీ, ఇది యాంటీ- ఏజింగ్'లా పని చేస్తుంది. ఇందులో ఉండే 'ఐసోఫ్లవోన్'లు 'ఫైటో ఇస్ట్రోజెన్' వంటి ఏజింగ్ కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి. అంతేకాకుండా, ఇందులో ఉండేయాంటీ -ఆక్సిడెంజుట్టుకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.

    ఓట్ మీల్ & టమాటో ప్యాక్


    ఓట్ మీల్ 'ఎక్సోఫోలిఎంట్'గా పనిచేస్తుంది మరియు టమాట జుట్టుకు తేమని అందించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటి కలయిక వలన ఆరోగ్యకరమైన జుట్టును పొందుతారు.


    బాదం & తేనె కలిపిన మిశ్రమం


    ఈ రెండింటి కలయికతో తయారుచేసిన మిశ్రమం వలన జుట్టుపై ఉండే మురికిని తొలగిపోతుంది. పాలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మ రసం, మరియు ఒక చెంచా బాదం నునె కలిపి తయారు చేస్తారు మిశ్రమాన్ని జుట్టుకు పూసుకొని ఒక 15 నిమిషాల పాటూ ఉంచి తరివాత కడిగేయాలి.

    నిమ్మ రసం


    ఆరోగ్యవంతమైన జుట్టు కోసం చాలా ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటాము. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం నిమ్మ రసం ప్రయత్నించండి. నిమ్మ రసం, జుట్టు కణాలలోకి చేరి హానికర కారకాలను తొలగించి, యాంటీ-ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. నిమ్మకాయ సహజసిద్ధమైన బ్లీచ్'లా పని చేస్తాయి, ఇందులో విటమిన్ ‘C’ మరియు అసిడిటీ కారకాలు ఉంటాయి. ఈ కారకా

    గ్రీన్ టీ


    ఇంట్లో నానమ్మ చెబుతూ ఉంటుంది టీ తాగటం వల్ల జుట్టు రాలుతుందని చెప్పుతుంటారు. కానీ 'US' పరిశోధనలలో ప్రకారం, మరియు టీలో 'పాలిఫీనోల్' వంటి బలమైన యాంటీ-ఆక్సీడెంట్'లని కలిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలే ప్రక్రియను తగ్గించి వేస్తాయి

    జలబు వెంటనే తగ్గాలంటే ఇలా చేసి చూడండి....

    జలుబు తగ్గిపోవాలంటే

    జలుబు దగ్గుల వల్లే సమస్యల నుండి సులభంగా భయపడేందుకు కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి చిటికెలో ఔషదాన్ని తయారు చేసుకుని దానిని తీసుకోవటం ద్వారా త్వరితగతిన జలబు, దగ్గు బాధల నుండి ఉపశాంతి పొందవచ్చు..అవేంటో ఇప్పుడు చూద్దాం....



    పసుపు


    పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున, దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగండి.


    అల్లం

    రోగనిరోధక శక్తి పెంచుకోటానికి అల్లంను విరివిగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషదం మరియు జలుబు, దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ వీటి నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

    వేడి నీరు

    ఇదొక సులభమైన మరియు విరివిగా వాడే పద్దతి. జలుబును తగ్గించుకోటానికి కేవలం నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇంఫ్లేషణ్ ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.


    నిమ్మ, తేనె సిరప్

    నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.

    Saturday, November 5, 2016

    అమెరికా అద్యక్షస్ధానం ఎవరిది....

    అమెరికా అధ్యక్షస్ధానం కోసం హిల్లరీ, ట్రంప్ ల మధ్య తీవ్రపోటీ; ఈనెల 8న పోలింగ్


    సుదీర్ఘంగా సాగుతున్న అమెరికా ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభం కాగా.. వివిధ దశలను దాటుకుని జులైలో అభ్యర్థులు ఖరారయ్యారు. అక్కడి నుంచి ప్రచారం మెల్లమెల్లగా సాగుతూ సెప్టెంబరు నుంచి వేడెక్కింది. ఎన్నడూలేనట్లుగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో అభ్యర్థులిద్దరూ ఎన్నికలపై ఆసక్తి పెంచారు. ఈ నెల 8న జరగనున్న పోలింగ్‌లో 12 కోట్ల మంది ఓటేస్తారని అంచనా.  మొత్తం 50 రాష్ట్రాల్లోనూ అదే రోజు పోలింగ్‌ ఉంటుంది. అనంతరం 24 గంటల్లో రాష్ట్రాల్లో ఎలక్టర్లు ఎవరన్నది తెలుస్తుంది. దాని ఆధారంగా అధ్యక్షులయ్యేదెవరో అంచనా వస్తుంది. పోలింగ్‌ మరునాడే ఎవరికి అవకాశముందో తెలిసినా ఆ తరువాత ఎలక్టర్లు సమావేశమై దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2017 జనవరి 6న మాత్రమే అధికారిక ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌ సమావేశమై ఫలితాలను ధ్రువీకరిస్తుంది. దాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. జనవరి 20తో ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం పూర్తయి కొత్త అధ్యక్షులు అదే రోజున బాధ్యతలు స్వీకరిస్తారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య పోటీపోటీ నెలకొన్న నేపద్యంలో వీరిద్దరులో అమెరికా పీఠాన్ని ఎవరు అదిష్టారన్నదానిపై సర్వాత్రా ఆసక్తినెలకొంది.