Saturday, November 12, 2016

42 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

పంజాబ్ లో నాటకీయం; ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్సేలు రాజీనామా


పంజాబ్‌లో సట్లెజ్‌ యమునా లింక్‌(ఎస్‌వైఎల్‌) వివాదంతో రాజకీయంగా దుమారం చెలరేగుతోంది. ఎస్‌వైఎల్‌ కెనాల్‌ వినియోగంపై సుప్రీంకోర్టు హరియాణాకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పంజాబ్‌లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. దీనిపై తమ అసంతృప్తిని తెలుపుతూ ప్రతిపక్ష నేత చంద్రజీత్‌ సింగ్‌తో సహా 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌పై విమర్శలు చేశారు. ప్రజల ఆసక్తులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్‌ నేతలు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. స్పీకర్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా అంగీకరించలేదు. అమరీందర్‌ ఇప్పటికే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. పంజాబ్‌ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన ‘పంజాబ్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ అగ్రిమెంట్స్‌’ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, దిల్లీ, చండీగఢ్‌లకు నీటి పంపకం విషయంలో పంజాబ్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment