విసిలనియామకంపై విచారణ చేపట్టిన సుఫ్రింకోర్టు
రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియామకాలు చేపట్టేది ఎవరో స్పష్టం చేయాలని అటార్నీ జనరల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉపకులపతుల నియామకాలను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ మనోహర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవుల భర్తీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి విజ్ఞప్తి చేశారు. దీనిపై పిటిషనర్ మనోహర్‌రావు, యూజీసీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వమే సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి వీసీల నియామకాలు చేపడుతోందని, అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు సుబోధ్ మార్కండేయ, సీవీ సింగ్, ఆదినారాయణరావులు న్యాయస్థానానికి తెలిపారు. విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన అనుమతితోనే నియామకాలు చేపడుతున్నామని అటార్నీ జనరల్ ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. దీంతో, వీసీల నియామకాలు చేపట్టడానికి అధికారం ఎవరికి ఉంది? సెర్చ్ కమిటీ ఏర్పాటు గవర్నర్ పరిధిలోనే ఉందా? ప్రభుత్వం చేపట్టవచ్చా అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ప్రశ్నించారు. ధర్మాసనం విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది
No comments:
Post a Comment