Saturday, November 5, 2016

అమెరికా అద్యక్షస్ధానం ఎవరిది....

అమెరికా అధ్యక్షస్ధానం కోసం హిల్లరీ, ట్రంప్ ల మధ్య తీవ్రపోటీ; ఈనెల 8న పోలింగ్


సుదీర్ఘంగా సాగుతున్న అమెరికా ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభం కాగా.. వివిధ దశలను దాటుకుని జులైలో అభ్యర్థులు ఖరారయ్యారు. అక్కడి నుంచి ప్రచారం మెల్లమెల్లగా సాగుతూ సెప్టెంబరు నుంచి వేడెక్కింది. ఎన్నడూలేనట్లుగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో అభ్యర్థులిద్దరూ ఎన్నికలపై ఆసక్తి పెంచారు. ఈ నెల 8న జరగనున్న పోలింగ్‌లో 12 కోట్ల మంది ఓటేస్తారని అంచనా.  మొత్తం 50 రాష్ట్రాల్లోనూ అదే రోజు పోలింగ్‌ ఉంటుంది. అనంతరం 24 గంటల్లో రాష్ట్రాల్లో ఎలక్టర్లు ఎవరన్నది తెలుస్తుంది. దాని ఆధారంగా అధ్యక్షులయ్యేదెవరో అంచనా వస్తుంది. పోలింగ్‌ మరునాడే ఎవరికి అవకాశముందో తెలిసినా ఆ తరువాత ఎలక్టర్లు సమావేశమై దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2017 జనవరి 6న మాత్రమే అధికారిక ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌ సమావేశమై ఫలితాలను ధ్రువీకరిస్తుంది. దాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. జనవరి 20తో ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం పూర్తయి కొత్త అధ్యక్షులు అదే రోజున బాధ్యతలు స్వీకరిస్తారు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య పోటీపోటీ నెలకొన్న నేపద్యంలో వీరిద్దరులో అమెరికా పీఠాన్ని ఎవరు అదిష్టారన్నదానిపై సర్వాత్రా ఆసక్తినెలకొంది.

No comments:

Post a Comment