Wednesday, November 9, 2016

పొట్ట చుట్టూ కొవ్వు పెరిగితే షుగర్ వ్యాధి వస్తుందా...

పొట్టచుట్టూ కొవ్వు కొంపముంచుతుందా,,


పొట్ట దగ్గర మాత్రం కొవ్వు పెరగటం యమడేంజరంటున్నారు వైద్యులు. దీనివల్ల దీర్షకాలికమైన షుగర్ లాంటి వ్యాధులు రావటం ఖాయమని చెబుతున్నారు. ఈ విషయంలో ముందునుండి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుదలను అంతతేలిగ్గా తీసుకోవటం తగదట. దీనివల్ల టైప్‌2 మధుమేహంతో పాటూ అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువట. పలు  అధ్యయనాల్లో కూడా ఈ విషయం బహిర్గతమైందట. తరచూ వ్యాకులతకు గురయ్యే మహిళల్లో కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా అందుకు కారణాలు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.

% ముందుగా మనం తీసుకునే కొవ్వుల్లో మార్పు చేసుకోవాలి. మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నెయ్యీ, పీనట్‌ బటర్‌లు మితంగా తీసుకోవాలి. 
% మెగ్నీషియం పోషకం మన శరీరంలో 300 రకాల చర్యల్ని నియంత్రిస్తుంది. మెగ్నీషియం తక్కువగా ఉండేవారిలో... ఇన్సులిన్‌ స్థాయులు పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఆ ప్రభావం అందంపైనే కాదు, ఆరోగ్యంపైనా పడుతుంది. గింజలూ, చేపలూ, బీన్స్‌, పెరుగు, అరటిపండ్లు, ఎండు ఫలాలూ, చాక్లెట్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దాన్ని శరీరానికి సరిపడా తీసుకోవాలి. 
%  పొట్టకు సంబంధించే కొన్ని వ్యాయామాలు  నిపుణుల సలహాతో చేసేందుకు ప్రయత్నించాలి.

No comments:

Post a Comment