వెనక్కు తగ్గిన కేంద్రం; ఎన్డీటీవి ప్రసారాలు యదాతధం
ఎన్డీటీవీ ఇండియా హిందీ ఛానల్‌పై ఒకరోజు విధించిన నిషేధాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తటంతో , ప్రసారాల నిలిపివేతపై ఎన్డీటీవీ పెట్టుకున్న అర్జీని మంగళవారం విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడంతో సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిషేధాన్ని నిలిపివేశారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేసిందని ప్రభుత్వం నవంబర్ 9న ఛానల్ ప్రసారాలపై నిషేధం విధించింది. అదే సమాచారాన్ని ఇతర ఛానళ్లూ ప్రసారం చేశాయని ఎన్డీటీవీ వాదిస్తోంది.
No comments:
Post a Comment