Monday, November 28, 2016

పిల్లలు హైటు పెరగాలంటే ఏంచేయాలి

పిల్లలు ఎత్తుపెరగటానికి ఇలా చేస్తే చాలు




తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు...పిల్లలు ఎత్తుపెరగాలని కోరుకునే తల్లిదండ్రులు అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించటంలోకూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. అయితే ఇంతకంటే హైట్ పెరగాలనుకుంటుంటారు చాలామంది. 

అయితే ఎత్తు పెరగడం ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. అతి కృత్రిమంగా వచ్చేదీ కాదు. ఆపరేషన్ చేయించుకుంటే ఎత్తు పెరగడం అసాధ్యం. అందుకే ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మనం చేయాల్సిన పని మంచి ఆహారం తినడం.

సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది.

క్యారెట్ : క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

బీన్స్ : ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

బెండకాయ : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

బచ్చలికూర : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి.

బఠాని : బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండు : బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు.

సోయాబీన్ : ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

పాలు : రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.
వీటిని తూచాతప్పకుండా పాటిస్తే మీపిల్లలు  ఎత్తుపెరగటంతోపాటు మంచి ఆరోగ్యంగా కూడా ఉండటం ఖాయం.

No comments:

Post a Comment