Tuesday, November 29, 2016

రాజధాని రైతులు నట్టేట మునిగిపోయారా...ఇందుకు కారణం ఎవరు....

చంద్రబాబు వల్లే రాజధాని రైతులు నట్టేట మునిగారు; వైసిపి ఎమ్మెల్యే ఆళ్ళ



ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాజధాని ప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైసిపి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఎపి రాజధాని రైతుల పరిస్ధితి దయనీయంగా మారిందన్నారు. చట్టబద్ధతలేని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తో రైతులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారన్నారు. పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియా సమావేశంలో ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశ పర్చాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో రియల్ వ్యాపారంతోపాటు, రైతులు కుదేలైపోగా, దీనివల్ల లబ్ధిపొందింది మాత్రం కారుచౌకగా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు, ఆయన గారి బినామీలేనని ఆరోపించారు. చంద్రబాబులాంటి బడాబాబులంతా సర్ధకున్నాక పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చి ప్రతి శాసనసబ్యునికి అరగంట సమయం తగ్గకుండా కేటాయించాలని డిమాండ్ చేశారు.


No comments:

Post a Comment