Saturday, November 12, 2016

అమ్మా, నాన్న చచ్చిపొమ్మన్నారు.

మందలింపుకే ప్రాణాలు తీసుకుంది


పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి విద్యార్ధిని వామిశెట్టి భవాని(14) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గీత కార్మికుడైన ఆమె తండ్రి కైలాబ్‌ బయటకు వెళ్లగా తల్లి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లింది. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా తమ కుమార్తె పడి ఉండటంతో వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భవాని మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. భవాని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. సంఘటనా స్థలం వద్ద భవాని రాసిన ఓ లేఖ పోలీసులకు లభించింది. ఆ లేఖలో ‘‘నాన్నా నన్ను చచ్చిపోమన్నావుగా, అమ్మా నువ్వు కూడా నన్ను చచ్చిపోతే బాగుంటుంది అన్నావు... అందుకే చచ్చిపోతున్నాను’’ అని రాసి ఉంది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.

No comments:

Post a Comment