Sunday, November 27, 2016

బాలయ్య తడాఖా చంద్రబాబుకు తెలిసొచ్చిందా....

చిరుతోపాటు, బాబుకు షాకిచ్చిన బాలయ్య


విశాఖ తీరంలో తుపానును సృష్టించిన విశాఖ ఫిల్మ్ ఛాంబర్స్ క్లబ్ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లేననిపిస్తుంది. ఈ క్లబ్ కు భూ కేటాయింపులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే శంకుస్థాపన జరిగినా, ఆ శంకుస్థాపన చేసింది స్వయానా బాబు గారే అయినా.. ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడం ఆసక్తిదాయకంగా ఉంది.  ఈ ఫిల్మ్ క్లబ్ వ్యవహారంలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు వినిపిస్తూ ఉండటం. శంకు స్థాపన జరిగిన ఈ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దుకావడం చిరంజీవికి ఒక విధంగా షాకే అనే మాట వినిపిస్తోంది. స్వయంగా బాలకృష్ణ రంగ ప్రవేశం చేసి భూ కేటాయింపు రద్దులో క్రియాశీల పాత్ర పోషించాడని సిని ఇండస్ట్రీతోపాటు, పొలికల్ ఇండస్ట్రీకూడా కోడై కూస్తుంది. ఫిల్మ్ క్లబ్ వ్యవహారంలో  గంటాకు , అయ్యన్నకు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఈ విషయంలో అయ్యన్నపాత్రుడి వర్గం కారాలుమిరియాలు నూరింది. ప్రజా సంఘాల పేరుతో ఉద్యమం మొదలైంది. అలాగే గంటాకు చెక్ చెప్పడానికి బాలయ్య రూట్లో వెళ్లాడు అయ్యన్న. చిరంజీవికి గంటా ఎంత సన్నిహితుడో చెప్పనక్కర్లేదు, ఈ పాయింట్ ను వాడుకొంటూ, ఫిల్మ్ క్లబ్ శంకుస్థాపనకు బాలయ్యకు ఆహ్వానం దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అయ్యన్న నందమూరి నటసింహాన్ని రెచ్చగొట్టినట్టు సమాచారం. ఫిల్మ్ ఛాంబర్స్ క్లబ్ కు కేటాయించిన భూమి విలువ పదిహేను వందల కోట్లు అని, దీంట్లో గంటా, చిరంజీవి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని అయ్యన్న బాలయ్యకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాలయ్య లోకేష్ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఫిల్మ్ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దు చేయించాడనే మాట వినిపిస్తోంది. ఒకవైపు గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉండగా.. ఫిల్మ్ క్లబ్ కు భూ కేటాయింపులు రద్దు అయిన విషయాన్ని ప్రకటించారు. ఇది కేవలం గంటాకు తగిలిన ఎదురుదెబ్బ కాదు.. బాలయ్య దగ్గర చిరంజీవిని బూచిగా చూపించి అయ్యన్న కొట్టించిన దెబ్బ అనేది స్పష్టం అవుతోంది.

No comments:

Post a Comment