రిలయన్స్ కు కేంద్రసర్కారు షాక్; 1.55 బిలియన్ డాలర్ల జరిమానా విధింపు
రిలయన్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో రిలయన్స్ తమ సొంత బావుల నుంచే కాకుండా ప్రభుత్వ చమురు సంస్థలకు చెందిన బావుల నుంచి కూడా గ్యాస్ నిక్షేపాలను తోడుకున్నట్లు నిర్ధారణ కావడంతో భారీ జరిమానా విధించింది. రిలయన్స్ సంస్థతో పాటు దాని భాగస్వాములైన బీపీ(30 శాతం), నికో(10 శాతం)లకు కలిపి మొత్తంగా 1.55 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సిందిగా రిలయన్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. రిలయన్స్ ఇప్పటివరకు తీసుకున్న పెట్రోలియం వనరుల మొత్తానికి లెక్క కట్టామని, దానంతటిని త్వరలోనే సంస్థ చెల్లించాల్సి ఉంటుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
No comments:
Post a Comment