Saturday, November 12, 2016

14వరకు టోల్ రద్దు

టోల్ పన్ను వసూళ్ళ నిలిపివేత


పెద్ద నోట్లు రద్దుతో అనేక సమస్యలు దేశవ్యాప్తంగా ఉత్పన్నతున్నాయి. ఇందో ఒకటి టోల్ పన్ను చెల్లింపు...సరిపడినంత చిల్లర లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతో తాత్కాలికంగా ఉపసమనం కలిగిస్తూ దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ల వద్ద పన్నుల వసూళ్ల నిలుపుదల గడువును కేంద్రం పొడిగించింది. ఈనెల 14 అర్థరాత్రి వరకూ టోల్‌ గేట్ల వద్ద పన్నుల వసూళ్లను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 11వ తేదీ అర్థరాత్రి వరకూ గడువు విధించినప్పటికీ చిన్న నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

No comments:

Post a Comment