కొత్తనోట్లకోసం మావోసానుభూతిపరుల ప్రయత్నాలు
పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టులకు సైతం ఇబ్బందికరంగా మారింది. వారుసైతం తమ వద్ద నున్న నోట్లు మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాంచీలో మావోయిస్టులకు చెందిన డబ్బును తెచ్చి బ్యాంకులో మారుస్తూ ఓ సానుభూతిపరుడు పోలీసులకు పట్టుబడ్డాడు. రాంచీకి చెందిన పెట్రోల్ బంకు నిర్వాహకుడు నంద కిశోర్ రూ.25 లక్షలు నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. పెట్రోల్ బంకుకు సంబంధించిన డబ్బు అని చెప్పి డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు విచారించారు. దీంతో ఆ డబ్బు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధినేత దినేశ్ గోపేకి చెందినవని ఆయన తెలిపినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేయటంతో మావోయిస్టులు వారి వద్ద ఉన్న డబ్బును మొత్తాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వాటిపై నిఘా ఏర్పాటు చేశామని ఝార్ఖండ్ పోలీసు అధికారి ఎంఎస్ భాటియా తెలిపారు.
No comments:
Post a Comment