జలుబు తగ్గిపోవాలంటే
జలుబు దగ్గుల వల్లే సమస్యల నుండి సులభంగా భయపడేందుకు కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి చిటికెలో ఔషదాన్ని తయారు చేసుకుని దానిని తీసుకోవటం ద్వారా త్వరితగతిన జలబు, దగ్గు బాధల నుండి ఉపశాంతి పొందవచ్చు..అవేంటో ఇప్పుడు చూద్దాం....
పసుపు
పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున, దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగండి.
అల్లం
రోగనిరోధక శక్తి పెంచుకోటానికి అల్లంను విరివిగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషదం మరియు జలుబు, దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ వీటి నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.
వేడి నీరు
ఇదొక సులభమైన మరియు విరివిగా వాడే పద్దతి. జలుబును తగ్గించుకోటానికి కేవలం నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇంఫ్లేషణ్ ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
నిమ్మ, తేనె సిరప్
నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.
No comments:
Post a Comment