గడువు ముగిసిందా అంతే సంగతులు
రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 30వ తేదీ గడువుపెట్టామని ఎట్టిపరిస్ధితుల్లో గడువు పొడిగించేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్‌బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ఆర్‌బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉంది. బ్యాంకులకు రూ.100 నోట్ల సరఫరాను పెంచాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్ రాజ్యసభకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్లకు విధించిన డిసెంబర్ 30వ తేదీ గడువును పొడగించేది లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలను తీర్చేందుకు రూ.100, అంతకు తక్కువ విలువ చేసే నోట్లను అందించాలని బ్యాంకులను కోరినట్లు చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పెంచాలని ఆర్‌బీఐ ఆయా బ్యాంకులను కోరిందని మరో ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్‌కుమార్ గాంగ్వర్ వెల్లడించారు.
No comments:
Post a Comment