Tuesday, November 8, 2016

ఇక నువ్వే మాకు లీడర్

రాహుల్ కు పార్టీ అధ్యక్షబాధ్యతలు; సిడబ్లుూసి తీర్మానం




సోనియా వారసునిగా రాహుల్‌గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఏకగీవ్రంగా కోరింది. సోమవారం న్యూదిల్లీలో రాహుల్‌ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. అనారోగ్యం కారణంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేక పోయారు. .త్వరలో పలు  రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో అక్కడ విజయంకోసం 
వ్యూహాల రూపకల్పన, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. పార్టీ అధ్యక్ష పీఠాన్ని రాహుల్‌గాంధీ చేపట్టాలని సమావేశంలో తొలుత ఏకే ఆంటోనీ ప్రతిపాదించారు. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా సభ్యులంతా మద్దతు తెలిపారు. మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్‌ అన్ని శక్తులు కూడగట్టుకోవాల్సిన అవసరం ఉందని సమావేశమనంతరం కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యానించారు. 1998 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతూ వచ్చారు. ఇక రాహుల్‌గాంధీ 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతకొంత కాలంగా సోనియా ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌గాంధీకి అప్పగించాలని అధినాయకత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగీవ్రంగా తీర్మానించారు.

No comments:

Post a Comment