రద్దు నిర్ణయం వెలువడింది; నోట్ల చెలామణి అగిపోయింది
మోడి నోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు సామాన్యునికి తిప్పలు తెచ్చిపెట్టింది. నిన్నరాత్రి 500, 1000 నోట్లు రద్దు నిర్ణయం వెలువడిన మరుక్షణం నుండే దుకాణదారులు ఆనోట్లు తీసుకుని సామాగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి ఖరాఖండిగా మేం తీసుకోమని చెప్పేస్తుండటంతో ఏంచేయాలో పాలుపోని పరిస్ధితుల్లో పడ్డారు. చిరువ్యాపారులు, తినుబండారాల దుకాణదారులు ఆనోట్లను స్వీకరించకపోవటంతో ప్రజలు దిక్కుతోచని పరిస్ధితుల్లో పడ్డారు. నల్ల ధనం నిర్మూలన సంగతి దేవుడెరుకగాని మోడి నిర్ణయంపై అటు సామాన్య ప్రజానికం మాత్రం తీవ్రస్ధాయి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 500, 1000 నోట్ల చలామణి నిలిపోయిన నేపధ్యంలో ప్రస్తుతం కొనుగోళ్లు అమ్మకాలు నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది. ఈ పరిస్ధితి తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడుతుందేమోనన్న భయాందోళనలు నెలకొంటున్నాయి.
No comments:
Post a Comment