Sunday, October 30, 2016

మాంసం తింటే ఆయుష్షు తగ్గుతుందా....

మాంసాహారులు తస్మాత్ జాగ్రత్త


మాంసాహారులలో.. ముఖ్యంగా మేక, గొర్రె తదితర జంతువుల మాంసాన్ని రోజూ తినేవారిలో మరణాల రేటు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. శాకాహారులతో పోలిస్తే.. నిత్యం మాంసం తినేవారి ఆయుర్దాయం తక్కువని ఈ పరిశోధనలో వెల్లడైందని మాయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా ఆవిష్కరణతో మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందనే విషయం సుస్పష్టమైందని ఈ పరిశోధనలో పాల్గొన్న బ్రూక్‌ షీల్డ్‌ లారెంట్‌ వివరించారు. ఈ అంశంపై ఇటీవల జరిగిన ఆరు పరిశోధనలను విశ్లేషించి మరణాల రేటుపై ఆహారపుటలవాట్ల ప్రభావాన్ని తెలుసుకున్నామని తెలిపారు. ఈ పరిశోధనలలో సుమారు 15 లక్షల మంది వలంటీర్లను, వారి ఆహారపుటలవాట్లను గమనించారన్నారు. ఇందులో ప్రాసెస్డ్‌ అన్‌ ప్రాసెస్డ్‌ రెడ్‌ మీట్‌ వల్ల మరణాల శాతం స్వల్పంగా పెరుగుతున్నట్లు గుర్తించామని వివరించారు.


గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే దానిమ్మరసం తాగాలా...

 దానిమ్మ రసంతో గుండె పదిలం


  • ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం లోని ఫ్రీరాడికల్స్‌ను నియంత్రించి ఆరోగ్యానికి కాపాడడానికి సహకరిస్తాయి. క్యాన్సర్‌ వంటి రోగాలను నివారిస్తాయి.
  • రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి. గుండె సంబందిత రోగుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైనది. కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ పేషెంట్స్‌కు మూడు నెలల పాటు రోజుకు 250మి.లీ దానిమ్మరసం ఇచ్చినప్పుడు వారిలో రక్తనాణాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్లు ఇటలీలోని హెల్త్‌ యూనీవర్సిటీ నిర్ధారించింది.
  • కీళ్ల మధ్య ఉండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది. దాంతో ఆస్టియో ఆర్ధరైటీస్‌ వంటి వ్యాధులు వస్తుంటాయి. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది.
  • ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్‌ నివారిణిగా పనిచేస్తాయి.
  • ఒంట్లో ఉన్న బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.
  • బ్లడ్‌ ప్రెషర్‌ను క్రమబద్దీకరిస్తుంది. హైపర్‌ టెన్షన్‌, లో బీపి సమస్యలు తగ్గుతాయి.
  • ఇందులో ఎ, సి, ఇ, విటమిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, ఫైబర్‌ పొటాషియం, నియాసిన్‌లు ఉంటాయి.
  • గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ దీనిని తీసుకుంటే పుట్టే పాపాయికి మేధోవికాసం బావుంటుంది.

లావు, హైబిపి తగ్గాలంటే ఇలా చేసి చూడండి

లావు తగ్గాలంటే


  • ఊబకాయం తగ్గించడంలో తేనె ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. మొదటిరోజు పది గ్రాముల తేనెతో మొదలు పెట్టి నెమ్మదిగా మోతాదును పెంచుతుండాలి. లేదా ఒక టీ స్పూను తాజా తేనె, సగం నిమ్మకాయ రసాన్ని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తరచూ తీసుకుంటుండాలి.
  • ఒబెసిటీ సమస్య నుండి బయటపడటానికి పుదీనా కూడా ఉపకరిస్తుంది. పుదీనా ఆకులతో చేసిన పచ్చడిని భోజనంలో తీసుకుంటుండాలి.
  • ప్రతిరోజూ ఉదయం 10-12 కరివేపాకు ఆకులు తింటే బరువు తగ్గుతారు. ఇలా వదలకుండా మూడు నెలలపాటు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలాగే టొమాటా కూడా ఉదయం అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఇలా 3 నెలలు చేయాలి.


హై బీపీ తగ్గాలంటే


  • అధిక రక్తపోటును అదుపు చేయడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను పచ్చిగానే తినాలి. ఇది బ్లడ్‌ ప్రెషర్‌ని అదుపు చేయడమే కాకుండా తల తిరిగినట్లుండడం, నిరుత్సాహం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా తొలగిస్తుంది.
  • తాజా ఉసిరిక రసంలో అంతే మోతాదులో తేనె కలుపుకుని పరగడుపున తీసుకుంటే బ్లడ్‌ ప్రెషర్‌ అదుపులోకి వస్తుంది.
  • గుండె గదుల పనితీరును క్రమబద్దీకరించి, హైబీపీని కంట్రోల్‌ చేయడంలో ద్రాక్ష బాగా పని చేస్తుంది.
  • నిమ్మకాయ బిపిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపుగా ఏడాది అంతటా అందుబాటులో ఉంటుంది. నిమ్మరసంతో పాటు తొక్క కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • పుచ్చకాయ గింజలలో బీపీని అదుపు చేసే గుణం ఉంది. పుచ్చకాయ రసాన్ని(గింజలతో సహా గ్రైండ్‌ చేసినది) తీసుకుంటే రక్తనాళాలను పటిష్టపరిచి ప్రసరణ వేగాన్ని చేస్తుంది.


ఇందిర జపం మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు

ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలతో జనంలోకి కాంగ్రెస్


కాంగ్రెస్ పార్టీకి చరిష్మాకలిగిన నేతలు లేకపోవటంతో రోజురోజుకు  ఆపార్టీ గడ్డుపరిస్ధితులను ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేశాక కాంగ్రెస్ కు పునర్ వైభవం దక్కుతుందని అందరూ భావించినా ఏమాత్రం మార్పులేకుండా పోయింది. దీంతో లాభం లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ, తిరిగి ఇందిర గాంధీని తెరపైకి తీసుకువచ్చి అనాడు పేదలకోసం ఆమే చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేసి మళ్ళీ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలన్న వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్‌ భారీస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. నవంబరు 19వ తేదీ ఇందిర జయంతిని పురస్కరించుకొని, ఆ రోజు నుంచి ఏడాదిపాటు వివిధ రూపాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీలో జరిగే శతజయంతి సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగించనున్నారు. ఇదే వేదికపై సోనియా కీలక ఉపన్యాసం ఇస్తారు. కాగా, అన్ని రాష్ట్రాల్లో ఇందిరపై సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.

మావోల దళపతి ఆర్కె ఆచూకి ఎక్కడ

పోలీసుల వద్దే ఆర్కెతోపాటు మరో తొమ్మిది మంది మావోలు; దామోదర్నవంబర్ 3న 5రాష్ట్రాల బంద్ 



మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా - ఒడిసా సరిహద్దు(ఏవోబీ) రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ తిలక్‌ ఆరోపించారు. ఆర్కేతోపాటు మరో తొమ్మిది మంది మావోయిస్టులు, గిరిజనులు పోలీసుల అదుపులో ఉన్నారని ఆయన తెలిపారు. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు దానియేల్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు శనివారం మల్కన్‌గిరి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కే ఎన్‌కౌంటర్‌ సమయంలో గాయపడ్డారని, పోలీసులు ఆయన్ను నిర్బంధించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. పోలీసులు ఏ క్షణంలోనైనా ఆర్కేను చంపే అవకాశముందన్నారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న బాక్సైట్‌ గనులను దోచుకొనేందుకే పెట్టుబడిదారులు పోలీసుల ద్వారా మావోయిస్టులను హత్య చేయించారని తిలక్‌ ఆరోపించారు. మావోయిస్టులకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి, ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేశారన్నారు. ఏవోబీ అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 34 నుంచి 39 మంది వరకూ పాల్గొన్నట్టు సమాచారం ఉందన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ దర్వా డివిజన్‌ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం దర్వా డివిజన్‌ కమిటీ మల్కన్‌గిరి జిల్లా విలేకరులకు హిందీలో ఓ ప్రకటనను పంపించింది. ఈ ప్రకటనలను మల్కన్‌గిరి నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోనూ అంటించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబరు 3న ఏపీ, తెలంగాణ, ఒడిసా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ దర్వా డివిజన్‌ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం దర్వా డివిజన్‌ కమిటీ మల్కన్‌గిరి జిల్లా విలేకరులకు హిందీలో ఓ ప్రకటనను పంపించింది. ఈ ప్రకటనలను మల్కన్‌గిరి నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోనూ అంటించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.

Friday, October 28, 2016

మావోల లేఖ సృష్టికర్త ఎవరు

లోకేష్ జెడ్ కేటగిరి రక్షణకోసమే మావోల లేఖ సృష్టి; వరవరరావు



మావోయిస్టుల పేరిట బుధవారం వెలువడ్డ ఓ లేఖ సీఎం చంద్రబాబు సృష్టేనని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ మాదిరే ఓ బూటకపు ఉత్తరమని విరసం నేత జి.కళ్యాణరావు కొట్టిపారేశారు. సీఎం చంద్రబాబు తన కుమారుడికి జడ్‌ కేటగిరీ రక్షణ కల్పించుకునేందుకు ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని ఉత్తరం రూపంలో సృష్టించారన్నారు. విప్లవకారులు ప్రజా ఉద్యమాల్లోనే ఉంటూ ప్రాణత్యాగానికి సిద్ధపడతారే తప్ప, ఆత్మాహుతి దాడులకు పాల్పడరని, ఉత్తరం అంతా మోసమని కళ్యాణరావు అన్నారు. ఏవోబీలోని ఖనిజ సంపదను సంపన్నులైన కొద్దిమంది పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇందుకు అడ్డుగా ఉన్న మావోయిస్టులను కోవర్టు ఆపరేషన్‌తో మత్తుమందు ఇచ్చి దారుణంగా కాల్చిచంపారని ఆరోపించారు. ఆర్కే కుమారుడు మున్నా అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన.. ఇది వందశాతం బూటకపు ఎన్‌కౌంటర్‌ అని చెప్పారు.

మీడియాపై ఆంక్షలు ఉండవ్

మీడియాపై అంక్షలకంటే స్వీయ నియంత్రణే మేలు;  వెంకయ్య నాయుడు


భారత ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియాపై నియంత్రణ విధించాలన్న ఉద్దేశం కేంద్రప్రభుత్వానికి లేదన్నారు. అయితే మీడియా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్‌ మీడియా వెర్రితలలు వేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రజలు భావవ్యక్తీకకణను రక్షిస్తున్నారని, ఆర్థికాభివృద్ధి కంటే దీనికి విలువెక్కువన్నారు. మీడియా నియంత్రణకు కొత్త బిల్లేమీ అక్కర్లేదన్నారు. మీడియా నిబంధనలు ఉల్లంఘిస్తే అడ్డుకునేందుకు చట్టాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘స్వేచ్ఛ విలువ తెలిస్తేనే భావవ్యక్తీకరణను సద్వినియోగం చేయగలం. ఈ స్వేచ్ఛను న్యాయబద్ధంగా ఉపయోగించకుంటే జోక్యం చేసుకునేందుకు చట్టాలున్నాయి. ఏ మీడియానైనా నియంత్రించేందుకు కొత్తఆంక్షలు పెట్టాలని సర్కారు యోచించడం లేదు. అయితే అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాం. జాతి వ్యతిరేకతను ప్రబోధించరాదని, అసభ్యత, అశ్లీలత, హింసలను ప్రోత్సహించరాదని మీడియాపై ఆంక్షలున్నాయన్నారు.

ఇదెక్కడి న్యాయం

న్యాయవిద్య కోర్సులకు వయోపరిమితి; అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పౌరులు



న్యాయవిద్య కోర్సులకు వయోపరిమితి విధింపు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మూడేళ్ల బీఎల్‌కు కోర్సుకు 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సుకు 20 ఏళ్లుకు పరిమితిని విధించేశారు. ఇప్పటివరకు ఎలాంటి వయోపరిమితి లేకపోవడంతో ఏ వయసు వారైనా న్యాయవిద్యను అభ్యసించేవారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో వయసు పైబడి వారు న్యాయవిద్యను అభ్యసించడానికి అవకాశం ఉండదు. 2016-17 విద్యా సంవత్సరానికి మాత్రమే ప్రస్తుత విధానం కొనసాగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వయో పరిమితి నిబంధన అమలులోకి రానుంది.ఈతరహా నిర్ణయంపట్ల అటు మేధావులు, ప్రజాస్వామ్య వాదుల నుండి తీవ్రస్ధాయిలో అసంతృప్తి వ్యక్తమౌతుంది. విద్యార్ధి దశలో న్యాయ విద్యను అవపోసన చేయటమంటే చాలా క్లిష్టతరమైనది. మేధో పరిపక్వత లేకుండా చట్టాలను వంటపట్టించుకోవటం అంత తేలికైనదేం కాదు..  న్యాయవ్యవస్థలో పూర్తిస్ధాయి అవగాహన సంపాదించటానికి పెద్ద పెద్ద ఉద్ధండులకే సాద్యం కానిపని. వాక్ చాతుర్యం, లోతైన పరిశీలనాత్మక శక్తి కలిగినవారే న్యాయవిద్యలో రాణించగలరు. ఇప్పటి వరకు వయస్సు పైబడిన వారుసైతం న్యాయవిద్యను అభ్యసించి న్యాయస్ధానాల్లో అద్బుతంగా తమ వృత్తిని నిర్వర్తిస్తున్న పరిస్ధితులున్నాయి. అయితే ఏక్కడో కొన్ని తప్పులు జరిగాయన్న సాకును చూపించి న్యాయవిద్యను కొన్ని వయస్సుల వారికే పరిమితం చేసి, వయస్సు పైబడిన వారికి దూరం చేయటం అంత సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఇతర కోర్సులకు న్యాయవాద కోర్సులకు భిన్నత స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వృత్తిలోకి వయోపరిమితిని చొప్పించటం అంత మంచిదికాదనిపిస్తుంది.  ప్రజాస్వామ్య భారత వ్యవస్ధలో న్యాయవ్యవస్ధ ఓ కీలకమైన భాగం...అలాంటి వ్యవస్ధ గురించి తెలుసుకోవాలని, దానిపై పట్టు సంపాదించాలని ఏ వయస్సువారికైనా  ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి ఆశలపై నీళ్ళు చల్లే విధంగా వ్యవహరించటం , విపరీత పోకడలు తప్ప మరొకటిి కాదన్నది మేధావుల అభిప్రాయం....దీనిపై అటు న్యాయవాదుల్లోను , విద్యా వంతుల్లోనూ , ప్రజాస్వామ్య వాదుల్లోను వయోపరిమితిపై విస్తృత స్ధాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అమరావతిలో మరో కీలకఘట్టం

రాజధాని శాశ్విత భవనాలకు నేడే శంఖుస్ధాపన



ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో బృహత్తర ఘట్టానికి మరికొద్ది గంటల్లో ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  చేతుల మీదుగా శంఖుస్ధాపన జరగనుంది. 950 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి రూ.5600 కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాసగృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. 2018 డిసెంబరు నాటికి భవనాల నిర్మాణం కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శంఖుస్ధాపనకోసం తుళ్ళూరు మండలం లింగాయపాలెం సమీపంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.35 నిమిషాలకు దాని శంకుస్థాపనతో పాటు రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం, విజయవాడలో మురుగునీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతోపాటు రాజధానిలో ఏడు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఇప్పటికే 2016 ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ఇక్కడికి తరలించారు. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం. రెండు మూడు నెలల్లో ఆకృతులు ఖరారు చేసి నిర్మాణాలు మొదలు పెట్టనుంది. మరో పక్క వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలకూ భూములు కేటాయించింది. విట్‌ విశ్వవిద్యాలయం నవంబరు 3న, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ ఆస్పత్రి నిర్మాణానికి నవంబరు 7న శంకుస్థాపన చేయనున్నాయి. రాజధానిలో 2018 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది.

 

Thursday, October 27, 2016

నవంబర్ నుండి ఎపిలో పత్తికొనుగోళ్ళు

సిసిఐ పత్తికొనుగోళ్ళు నవంబరు 2 నుండే; ఎపి మార్కెటింగ్ కమిషనర్ మల్లిఖార్జున్


రాష్ట్రంలో సీసీఐ ద్వారా నవంబరు 2 నుంచి పత్తి కొనుగోళ్లు చేయడానికి సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావు బుధవారం వెల్లడించారు. కనీస మద్దతు ధర రూ.4160గా నిర్ణయించినట్టు చెప్పారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 26 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గుంటూరులో 10, కృష్ణాలో 7, కర్నూలులో 8, పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూర్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నవంబరు 10 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 17 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. కొనుగోళ్లలో టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను తేవడంతో అక్రమాలకు తావుండదన్నారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు.

చంద్రబాబు కుటుంబానికే కాదు ఐదు కోట్ల మందికి మా అండ

చంద్రబాబు కుటుంబంతోపాటు ఐదుకోట్ల మంది ప్రజలను మేమే రక్షించుకుంటాం; డిజిపి సాంబశివరావు



ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని అంతమొందిస్తామని మావోయిస్టులు విడుదల చేసిన లేఖపై డీజీపీ 'సాంబశివరావు ఘాటుగా స్పందించారు. ‘‘అది ఎవరు విడుదల చేశారో స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు (సీఎ కుటుంబం)మాత్రమే కాదు.. ఐదుకోట్ల మందిని రక్షించుకొనే సత్తా ఏపీ పోలీ్‌సకు ఉంది! మావోయిస్టు ఏపీ కమిటీ పేరుతో విడుదలైన ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నాం’’ అని డీజీపీ తెలిపారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బట్టే అక్కడ పెద్ద తలకాయలున్నట్టు స్పష్టమవుతోందని డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఏకే 47లు, ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఇన్సా్‌సలాంటి ఆయుధాలు పెద్ద లీడర్ల వద్దే ఉంటాయన్నారు. ఆర్‌కే, గాజర్ల రవి (ఉదయ్‌)లాంటి వారున్నారా? లేరా? అనేది స్పష్టంగా చెప్పకపోయినా గన్‌మెన్లున్నారు, పెద్ద తలకాయలుండొచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘అక్కడ యాభై మందిదాకా మావోయిస్టులు ఉన్నట్లు కిట్‌ బ్యాగుల ఆధారంగా గుర్తించాం. 28 మంది మాత్రమే చనిపోవడంతో మిగిలిన వారు పారిపోయారని భావించవచ్చు. వారి కోసం తీవ్రస్థాయిలో కూంబింగ్‌ జరుగుతోంది. మా బలగాల్లో అలసిపోయిన వారిని వెనక్కి రప్పించి, కొత్త వారిని పంపిస్తున్నాం’’ అని తెలిపారు. వరవరరావు, ఆర్‌కే భార్య ఆరోపణలను ప్రస్తావించగా... ‘ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం చేశారన్నారు.

చంద్రబాబు కుటుంబానికి మావోల హెచ్చరికలు

ఎవోబి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటాం; మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేర లేఖ విడుదల


‘ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, దీనికి చంద్రబాబు, ఆయన కొడుకూ మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు హెచ్చరికలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన లేఖలో  అవసరమైతే ఆత్మాహుతి దాడి కూడా చేస్తామంటూ ప్రకటించారు. ఏవోబీ హత్యాకాండకు సరితూగే ప్రతీకార చర్య కచ్చితంగా అమలు చేస్తామని అమరుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.  తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దెనెక్కిన మరుసటి రోజే... 21 మంది ఎర్రచందనం కూలీలసు దుర్మార్గంగా హత్య చేయించాడని ఆరోపించారు. చంద్రబాబు, మోదీ సర్కారు సంయుక్త కుట్ర ఫలితమే ఏవోబీ హత్యాకాండ అని తెలిపారు. మావోయిస్టులు మాట్లాడుకోవడానికి సమావైశమైన సంగతి తెలుసుకుని... వారికి అందే ఆహార పదార్థాల్లో కోవర్టు పద్ధతిలో మత్తు, విషం కలిపి, పడిపోయిన వారిపై విచక్షణా రహితంగా కాల్చి చంపారని ఆరోపించారు. ‘తుఫాన్లలో ఇది కొంచెం పెద్దది. నాలుగు రోజుల్లో తట్టుకొని నిలబడతాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

సిబిఐకు దొరికిపోయిన మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి

సిబిఐ ఉచ్చులో మాజీ ఎంపి బాలశౌరీ



ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్‌పైన సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్‌ను ఇటీవల సీబీఐ అరెస్ట్‌ చేసింది. 2007 జనవరి 1 నుంచి 2012 డిసెంబరు 31 మధ్య కాలంలో పోలు శ్రీధర్‌ తన ఆదాయానికి మించి రూ.11.96 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ ఆయనపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా గుంటూరు, హైదరాబాద్‌, నోయిడాల్లో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా జరిపిన విచారణలో గుంటూరు మాజీ ఎంపి బాలశౌరి, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఆయన సొంత బ్యాంకు ఖాతా నుంచి శ్రీధర్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ఎకౌంట్‌కు పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినట్లు గుర్తించింది. ఢిల్లీకి సమీపంలోని నజ్‌ఫగడ్‌ ప్రాంతంలో 2007-08 సంవత్సరంలో బాలశౌరి 20 ఎకరాల స్థలాన్ని రూ.12.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్థలం కొనుగోలులో బాలశౌరికి, రైతులకు మధ్యవర్తిగా శ్రీధర్‌ వ్యవహరించారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని శ్రీధర్‌ ఖాతాకు తరలించారు. అందులో భాగంగా నజ్‌ఫగడ్‌లోని యాక్సిస్‌ బ్యాంకులోని శ్రీధర్‌ ఖాతాలోకి ఒకసారి రూ.8.4 కోట్లు, బెంగళూరులో అదే బ్యాంకులో ఉన్న శ్రీధర్‌ ఖాతాలో ఒకసారి రూ.1.2 కోట్లు, మరోసారి రూ.2.3 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ఇంత భారీస్థాయిలో లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరగడానికి నజ్‌ఫగడ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మనీశ్‌ సక్సేనా సహకరించారని సీబీఐ గుర్తించింది. శ్రీధర్‌ పేరుతో నకలీ ఖాతాలు తెరచి కోట్ల రూపాయల లావాదేవీలు నడిచేందుకు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సహకరించారన్న ఆరోపణలతో సక్సేనాపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి, ఆయన్ను అరెస్ట్‌ చేసింది. వచ్చే వారంలో బాలశౌరిని పిలిచి విచారించే అవకాశం ఉందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. 

గుంటూరు జిల్లాలో దారుణం; ఇద్దరు మహిళల దారుహత్య

అస్ధి వివాదాల నేపధ్యంలో బాపట్లలో ఇద్దరు మహిళల హత్య


బాపట్ల నరాలశెట్టివారిపాలెంలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్యలకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. మృతులు నాగమణి అమె కూతురు సాయిలక్ష్మి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదిలా వుంటే తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.

Tuesday, October 25, 2016

27 వరకు ఆ మృతదేహాలు భద్రపరచండి

మావోల మృతదేహాలపై హైకోర్టు అదేశాలు




ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల (ఏఓబీ) సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఈ నెల 27 వరకు భద్రపరచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉదంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మృతదేహాలను ఉభయ రాష్ట్రాల పరిధిలోకి తీసుకొస్తే వాటిని ఈ నెల 27వ తేదీ వరకు భద్రపరచాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

ఈడొచ్చినప్పుడే అచ్చటైనా ముచ్చటైనా....


30ఏళ్ళ తరువాత పెళ్ళి చేసుకున్నా వేస్టే




ముందు కెరియర్ తరువాత పెళ్లి అనుకోవడం తప్పులేదు కాని 30 ఏళ్లు లోపే మీరు లైఫ్‌లో సెటిల్ అయి లైఫ్ పార్టనర్‌ని వెతుక్కోవాలట లేదంటే ,తరువాత పెళ్లి చేసుకున్నా వేస్టే అంటున్నారు వైద్యులు. అనేక సర్వే రిపోర్ట్ లకారం 30 దాటితేనే కాని యువతీ యువకులు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదట. దీనికి అనేక కారణాలు కూడా లేకపోలేదు. లైఫ్‌లో స్ధిరపడకపోవడం ఒకటైతే, సంబంధాలకోసం వెతుకుతూనే ఉండి దొరికిన వాళ్లతో సరిపెట్టుకోకపోవడం మరొక కారణం. సాధారణంగా వివాహానికి 18 నుండి 25 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కాని అప్పుడే ఎందుకులే అనుకునే వారు 25 నుండి 30 వచ్చేసరికి పెళ్లి పీటలెక్కాల్సిందే. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు సంబంధాలు దొరక్క, తీరా దొరికాక అమ్మాయి నచ్చక వివాహ ఘడియలకు దూరం అవుతూ వస్తున్నారు. అయితే ఇంక లేటు చేయడం మంచిది కాదట వయసు ముదిరితే అనేక అనర్ధాలు జరిగే చాన్స్ చాలా ఎక్కువ ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.

పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి అనేది చాలా ముఖ్యం.  వీర్యకణాల్లోని శుక్రకణాల స్థాయి వయస్సు పెరిగే కొలదీ తగ్గుతూ వస్తుంది. ఒక మిల్లీలీటరు వీర్యకణాల్లో 135 మిలియన్ల శుక్రకణాలు ఉండాలి. కాని తాజా డబ్ల్యుహెచ్‌వో నివేదిక ప్రకారం 30 ఏళ్లుదాటిన వారిలో 105 కి ఈ శుక్రకణాల స్థాయి తగ్గినట్లు తేలింది. ఇక మహిళల విషయానికి వస్తే 30 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల విడుదల తగ్గిపోతుంది. అండం విడుదల సమస్య కారణంగా సంతానోత్పత్తికి సమస్యలు తలెత్తుతాయి. రెగ్యులర్‌గా వచ్చే పిరియడ్స్ కూడా క్రమం తప్పుతుంటాయి. అయితే 30 తరువాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన వారికి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి వైద్య నిపుణులు సలహాలనూ ఇస్తున్నారు. పురుషులు తమ వీర్యాన్ని స్మెర్మ్ బ్యాంక్‌లలో భద్రపరుకోవచ్చట. మహిళలు అయితే అండాన్ని ఎగ్ బ్యాంక్‌లో భద్రపరుచుకోవడం ద్వారా సమస్య నుండి కొంత విముక్తిని పొందినా 30 లోపు పెళ్లి చేసుకోవడమే మంచిదని సలహానిస్తున్నారు.

మార్కెట్ లోకి మహీంద్రా కొత్తకారు

ఈటూఓ ప్లస్ ను రిలీజ్ చేసిన మహీంద్రా



పర్యావరణ సహిత ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టిన మహీంద్ర తన ఈ2ఓకు కొనసాగింపుగా ఈ2ఓ ప్లస్ కారును తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ2ఓకు రెండు డోర్లుండగా.. ఈ2ఓ ప్లస్ నాలుగు డోర్లతో వస్తోంది. ఈ మహీంద్రా ఈ2ఓ ప్లస్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ధరలు రూ. 5.46 లక్షల నుంచి రూ. 8.46 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ కొత్త ఈకో కారులో ఎస్ఓఎస్ ఫీచర్‌ను పొందుపరిచారు. దీని వల్ల బ్యాటరీ పవర్ 10 శాతాని కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కారు మరో 7 నుంచి 10 కి.మీ. నడవడానికి ఈ ఎస్ఓఎస్ ఫీచర్ సహకరిస్తుంది. ఈ కారుతో పాటు ఒక మొబైల్ యాప్‌ను కూడా మహీంద్రా విడుదల చేసింది. ఈ యాప్ సహాయంతో కారులోని కొన్ని ఫీచర్లను ఆపరేట్ చేయొచ్చు. ఎస్ఓఎస్ ఆన్/ఆఫ్, ఎయిర్ కండిషన్‌తో పాటు కార్‌ని లాక్, అన్‌లాక్ చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే చాలా బ్యాటరీ కార్లు పూర్తి ఛార్జింగ్‌తో 110 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ2ఓ‌ ప్లస్‌లో అమర్చిన 210ఏహెచ్ లిథియమ్ అయాన్ బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 140 కి.మీ. వరకు నడుస్తుంది. అంతే కాకుండా దీని టాప్ స్పీడ్ గంటకు 85 కి.మీ. ఈ2ఓ ప్లస్‌లో ఉన్న బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 9 గంటల సమయం పడుతుంది.

పవన్ కళ్యాణా మాజాకా....

ప్రత్యేక హోదా సాధనతో జనంలోకి; 2019  ఎన్నికలే టార్గెట్



2019 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతుంది. ప్రత్యోక హోదాను ప్రధాన అయుధంగా చేసుకని జనంలోకి విస్తృతస్ధాయిలో వెళ్ళేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈక్రంలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 10న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగసభజరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతీ జిల్లాలో పోరాట సభను జనసేన నిర్వహిస్తుందని పవన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమలో వెనుకబడి ప్రాంతమైన అనంతపురంలో సభ జరపాలని పవన్‌కల్యాణ్‌ నిర్ణయించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కరవుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధులతో జిల్లాను కరవు కోరల నుంచి కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో సభా వేదిక, సమయం తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

పాక్ లో ఉగ్ర పంజా ; 33 మంది బలి



పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి.  క్వెట్టాలో పోలీసు శిక్షణా వసతి గృహంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 33మంది మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రదాడి సమయంలో వసతి గృహంలో 600మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో పలువురిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వసతిగృహం దాడి ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు వసతిగృహంలో పలువురిని బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Monday, October 24, 2016

bring back black money stashed in foreign banks:Venkaiah Naidu




Stating that the Centre was trying its best to bring back black money stashed in foreign banks, Union Information and Broadcasting Minister M Venkaiah Naidu today exhorted the chartered accountants to shoulder responsibility to curb the growing menace of unaccounted money in the country.
Inaugurating an international conference of ICAI’s Chartered Accountants christened “Jnana Yagna” here on Saturday, Venkaiah Naidu appealed to the young accounting professionals to ponder upon if they can make efforts to see that the businessmen, industrialists and professionals not evade the tax regime. When the lawyers fight for their clients, the CAs should think out of box and see that their clients do pay taxes on time, he said. Praising the CAs for playing a key role in national economic growth, the Union minister suggested that they can do a bit beyond to check the malady of unaccounted and unreported accounts leading to growing black money problem.
“One of the major concerns of our economic management is the unaccounted and unreported incomes which are widely known as ‘black economy’. The recent Income Disclosure Scheme has yielded such an income of over Rs.65,000 crore. The Narendra Modi Government was making efforts to get back the black money and put a tab to prevent it. It is necessary to understand the reasons for the same and its implications for our country. As professionals, you would know better how such huge incomes go unreported. You need to ponder if Chartered Accountants could play a role in addressing such practices and curb the growth of black economy”.

23 Maoists killed near Andhra-Odisha border

23 Maoists killed near Andhra-Odisha border


At least 23 Maoists were killed in an encounter near the Andhra-Odisha border on Monday, said police. Acting on intelligence inputs, a combined team of Andhra Pradesh and Odisha police carried out the operation near Jantri in Malkangiri district of Odisha in the early hours of Monday, Malkangiri Superintendent of Police Mitrabhanu Mohapatra said. He said they had got the information about the presence of around 40 Maoists in the area.

"We are expecting that some top leaders of the Maoists may have died in the encounter. However, it can only be confirmed after the bodies are brought here," said Mohapatra.Two constables were injured in the encounter that took place in the "cut-off area" of Chitrakonda region of Odisha.

"We had information about the gathering of members of Andhra-Odisha Border Special Zone Committee of the Maoists in area under Chitrakonda police station in Malkangiri district," said Odisha Police DG K.B. Singh. "A joint operation of Odisha and AP police was launched after confirmation of the information by our team. The operation was led by Andhra Pradesh police and Greyhound jawans of the state played a major role in it," said the DG.

Four AK 47 rifles, three Self Loading Rifles (SLR), and some other guns were among the weapons seized from the spot of the encounter.It is suspected that a top Maoist of Odisha, named Uday, was among the Maoists killed during the operation. He had carried Rs 2 lakh bounty on his head.However, the police are yet to confirm the death of the top Maoist leader.

Mohapatra said search operation is continuing and extra force is being sent to the area to intensify the combing operation.

modi visit varanasi

PM Modi launches Rs 51,000 crore gas pipeline


PM launched ‘Urja Ganga’, the gas pipeline project which promises to provide piped cooking gas to residents of Varanasi within two years and, in another year thereafter, cater to millions of people in states like Bihar, Jharkhand, West Bengal and Odisha.PM Modi is also scheduled to flag off projects like doubling of railway tracks on the busy Allahabad-Varanasi section and expansion of the Diesel Locomotive Works (DLW) here besides laying foundation stone for a fully air-conditioned perishable cargo centre.Recently, the party's Uttar Pradesh unit had also issued a statement welcoming the Prime Minister on his "first visit to Varanasi after the surgical strikes". PM Modi's visit to the city comes at a time when Assembly elections in Uttar Pradesh are just a few months away and political temperatures are soaring.

ఎఓబిలో ఎదురు కాల్పులు..23 మంది మావోయిస్టుల మృతి..తృటిలో తప్పించుకున్న ఆర్కే

బలిమెల వద్ద ఎదురు కాల్పులు; 23 మంది మావోల హతం



మల్కాన్‌గిరి అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పుల్లో 23మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్‌ ప్లీనరీపై పక్కా స్కెచ్‌తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్‌, ఏడు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఏడు ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్‌, 15 భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బలిమెల రిజర్వాయర్‌లోని ఏవోబీ కటాఫ్ ఏరియా జల్లెడ పట్టే క్రమంలోనే ప్లీనరీ జరుగుతున్న సమావేశంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు ఆయుధాలతో తేరుకునేలోపే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 23 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయపడ్డారు.
ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టులను పోలీసులు రంగంలోకి దించారు. వారిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్ కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్తుగా మావోయిస్టులు పట్టు కోల్పోయిన ఏవోబీలో మళ్లీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి చిత్రకొండ పనసపుట్టు వద్ద మావోయిస్టులు సమావేశమయ్యారు.



మరోవైపు విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఎన్​ కౌంటర్ లో 23మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మృతుల్లో 17మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని, అగ్రనేతలు ఉన్నారో...లేదో ఇంకా తెలియదన్నారు. ఇక గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించినట్లు చెప్పారు.

ఆగని కోల్డ్ స్టోరీజ్ మంటలు

 గుంటూరులో కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాదం ; 30 కోట్ల ఆస్ధినష్టం


గుంటూరు నగర శివారులోని లక్ష్మిలావణ్య కోల్డ్ స్టోరేజ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము 5గంటల ప్రాంతంలో గుర్తించిన స్టోరేజ్ యాజమాన్యం వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే బి చాంబర్ మొత్తం అగ్ని కీలకు వ్యాపించాయి. ఎస్పీ త్రిపాఠి తక్షణమే స్పందించి నగరంలోని పోలీసు సిబ్బంది మొత్తాన్ని ఘటనాస్ధలానికి పంపించారు.
ఎఎస్పీ సుబ్బారాయుడు, ఎస్బి డిఎస్పి నాగేశ్వరరావు, నల్లపాడుపాడు సిఐ కుంకా శ్రీనివాసరావులో సమయస్పూర్తితో వ్యవహరించి పొక్లెయినర్ ను రప్పించి ఎ ఛాంబర్ గోడలు పగలగొట్టించారు. కూలీల సహాయంతో అందులోని మిర్చి బస్తాలను బయటకు తెప్పించగలిగారు. సుమారు 30వేల బస్తాల మిర్చి టిక్కీల నిల్వలు స్టోరేజ్ లో ఉండగా వాటిలో 50 శాతం నిల్వలను బయటకు తీయగలిగారు. జిల్లా కలెక్టర్ ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగానే ఈప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని బావిస్తున్నట్లు కలెక్టర్ దండే మీడియాకు తెలిపారు. ఫైర్ నిబంధనలు పాటించలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఫైర్ నిబంధనలు పాఠించని స్టోరేజ్ లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీచేసినట్లు చెప్పారు.

మరోవైపు బాదిత రైతులు తమకు పరిహారం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sunday, October 23, 2016

National-level Kabaddi player Rohit Kumar arrested

National-level Kabaddi player Rohit Kumar, arrested


National-level Kabaddi player Rohit Kumar, arrested in connection with the alleged suicide by his wife Lalita who had accused him and her in-laws of harassment, was today remanded in two days police custody by a Delhi court. Rohit was produced before a duty magistrate who allowed the police to interrogate him till October 25.  

On October 21, Rohit's father, Vijay Singh was produced before a link magistrate who remanded him in judicial custody till November 4 after the police did not seek his custodial interrogation.Vijay was arrested after he surrendered at Nangloi Police Station in West Delhi. 


Lalita had allegedly committed suicide on October 17 at her parents' house in Nangloi. In her suicide note as well as audio and video clips left behind, she had alleged that her in-laws "harassed" her for minor issues and Rohit asked her to go away from his life.

A case was registered against Rohit and his father and two Delhi Police teams were formed to arrest Rohit and his father, who had also gone into hiding after Lalita committed suicide.

Samsung has launched another smartphone

samsung has launched galaxy on nxt

Samsung has launched another smartphone in its Galaxy On series in India. The smartphone called Galaxy On Nxt has been launched at Rs 18,490. The 5.5-inch, full-HD "Galaxy On Nxt" has 2.5D Gorilla Glass, powerful octa-core processor, 3GB RAM and 3,300 mAh battery.The device comes with 32GB internal memory, Android (Marshmallow) OS, dual SIM and Micro SD card support which is expandable up to 256GB.To ensure data security, the samsung device has a fingerprint sensor that allows quick and secure access. "Galaxy On Nxt" integrates features such as "S Power Planning" and "S Secure" to address consumers` power management and security-related concerns.With a superior f1.9 aperture on both cameras, "Galaxy On Nxt" is equipped with 13MP rear and 8MP front shooter. Enhanced modes such as palm and gesture selfie, wide angle selfie and beautifying effects are incorporated in the device.The device comes pre-installed with "My Galaxy" app that has videos, music, gaming, utility services and much more.

kalyan ram*s isam new records

 Ism Two Days Collections:4.85 Crore


Nandamuri Kalyan Ram and Puri Jagannadh's  Ism had taken a solid outing on its second day. The opening is the best amongst the very recent medium budget releases. The movie had amassed a little more than 4.8 Crore Share in the first two days of its release in Andhra Pradesh and Nizam which can be termed as a very good number. This is the highest opening ever for Kalyan Ram. The 'Puri Jagannadh Brand' and Kalyan Ram's New Look helped the movie get a superb opening. The talk of the film is average and it is made with a big budget, it has to be seen how it fares in the long run. Here is the breakup of Ism Two Days Collections:

Nizam 1.85 CroreCeeded 80 LakhsUttarandhra 51 LakhsEast 39 LakhsWest 26 LakhsKrishna 31 LakhsGuntur 54 LakhsNellore 18.81 Lakhs
total :AP+Nizam 4.85 Crore


Baahubali 2: Prabhas makes thunderous

Baahubali 2 poster makes a roaring 



The first glimpse of Baahubali 2 is casting its spell on the fandom. The first look poster of the next chapter, The Conclusion, was released by S S Rajamouli amid huge fanfare at the MAMI 18th Mumbai Film Festival on Saturday. With thunderous background, the Baahubali 2 poster makes a roaring entry as Prabhas flexing his muscles with a chain wrapped around one arm while he holds a sleek black double-edged sword in his other arm.Giving us a one-liner about the next part, the director posted, “And how he (Baahubali) wins the Mahishmati Kingdom with his Unrestrained Power is #Baahubali2 The Conclusion.”The magnum opus is said to be in its final stages of shooting with two more songs and a couple of action sequences being wrapped up in a span of two and half months. The film is set to release on April 28, 2017.

బ్రహ్మచారులకు అమెరికా వీసాలు ఇవ్వదా....

బ్రహ్మచారులకు వీసాలు ఇవ్వనంది అమెరికా; రాందేవ్ బాబా



పెళ్ళి చేసుకోని బ్రహ్మచారిననే  అమెరికా ఒకప్పుడు తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిందని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా అన్నారు. అయితే ఆ తర్వాత న్యూయార్క్‌లో ఓ సభలో ప్రసంగించాలని అమెరికా తనను ఆహ్వానిస్తూ పదేళ్ల వీసా మంజూరు చేసిందన్నారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమావేశంలో రాందేవ్‌ ఆయన తొలి వీసా అనుభవం గురించి గుర్తుచేసుకున్నారు. అమెరికా వీసా కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు నిరాకరించారు. కారణం అడిగితే.. బాబాజీ మీరు బ్రహ్మచారి, మీకు బ్యాంకు ఖాతా లేదన్నారు. అయితే ఇప్పటికీ నాకు బ్యాంకు ఖాతా లేదు’ అని రాందేవ్‌బాబా చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన రూ.4,500 కోట్ల విలువైన పతంజలి గ్రూప్‌ సంస్థలను నడిపిస్తుండటం విశేషం. 

అదిగో...అదిగో...యాదాద్రి

యాదాద్రి ఇకపై మహా దివ్యక్షేత్రం


యాదగిరి గుట్టలో కొలువై ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్ర తుది నమూనాలు సిద్ధమయ్యాయి. వచ్చే దసరా పండుగనాటికి పూర్తిస్ధాయిలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నమూనాలన్నీ సిద్ధం చేశారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్; 94 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం


 నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్‌-1 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ డిసెంబరు నెలాఖరులో విడుదల కానుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 94 పోస్టులను నోటిఫై చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తయారుచేసిన కొత్త సిలబస్‌ ప్రకారం కొత్త గ్రూప్‌-1 సర్వీసెస్‌ రాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష విధానం మాత్రం పాతదే. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. 2011 తర్వాత మళ్లీ ఇప్పటి వరకు గ్రూప్‌-1 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన సదరు నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమ్స్‌ ‘కీ’పై అభ్యంతరాలు రావడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో గతంలో నిర్వహించిన మెయిన్స్‌ను రద్దు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ఇటీవల మళ్లీ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం ఆ జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతోంది. డిసెంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించి సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.

కావేరీకి ఎంత ధైర్యం...

కోర్టుకు వెళ్ళిన కావేరీ సీడ్స్; ప్రభుత్వానికే సవాల్

నకిలీపత్తి విత్తనాలను విక్రయించి అన్నదాతలను నట్టేటముంచిన కావేరి సీడ్స్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. గుంటూరు జిల్లాలో ఈ కంపెనీకి సంబంధించిన జాదు పత్తి విత్తనాలు నకిలీవని, వీటివల్ల ఈఏడాది నష్టపోయామంటూ రైతుల ఫిర్యాదుమేరకు చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటను పరిశీలించి విత్తనాలు నకిలీవేనని నిర్థారించారు. 
నష్టపోయిన రైతులకు సుమారు రూ.42 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా స్థాయిలోని కమిటీ ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 18లోపు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గడువులోగా యాజమాన్యం పరిహారం చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కావేరి సీడ్స్‌ లైసెన్సును రద్దు చేసింది. యాజమాన్య ప్రతినిధులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివాదం కొనసాగుతుండగా కావేరి యాజమాన్యం... జిల్లా కమిటీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయొద్దని కోర్టును ఆశ్రయించింది. ఈతరుణంలో కోర్టులు అన్నదాతలకు అండగా నిలుస్తాయో లేక మోసకారి విత్తనకంపెనీల భరతం పడతాయో ప్రజలంతా వేచిచూస్తున్నారు.

ఇప్పటి దాకా స్లో...ఇకపై స్పీడు

అమరావతి నిర్మాణం ఇక శరవేగం; నారా లోకేష్


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం ఇక నుండి వేగం పుంజుకోనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు టిడిపి జాతీయ పార్టీ ప్రదానకార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. రాజధానికి శంకుస్థాపన చేసి శనివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం తెలిపారు. ’అమరావతికి శంకుస్థాపన చేసినప్పటినుంచి మనం ప్రగతిని సాధించాం. ఇప్పటి నుంచి దాని వేగం పెరుగుతుంది. ప్రపంచం మొత్తంమ్మీద భవిష్య నగరాలకు అమరావతి నమూనా రాజధానిగా నిలుస్తుంది. మనం కలసికట్టుగా మెరుగ్గా ఈ నగరాన్ని నిర్మించుకుందాం’ అని ట్వీట్‌ చేశారు. 

Saturday, October 22, 2016

నిన్న దేవుళ్ళు... నేడు హైకమాండ్...వారేవా...బాబు

ప్రజలే నా హైకమాండ్; వారు చెప్పిందే చేస్తాన్నంటున్న సియం చంద్రబాబు



రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్‌ అని.. వారి కంటే తనకు ఎవరూ ముఖ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కాపుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని... పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన కాపు జాబ్‌మేళాకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతకు ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాపు భవన్‌కు నిధులు ఇచ్చామని.. కాపు విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దృఢసంకల్పం ఉంటే సాధించలేని ఏదీ లేదన్నారు. 

పట్టాలు తప్పుతున్న రైళ్ళు; పరేషానవుతున్న ప్రయాణికులు

ఆప్రికాలో ఘోర రైలు ప్రమాదం; 53 మంది మృతి



ఆఫ్రికాలోని కామెరూన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దేశ రాజధాని యాండీ నుంచి దౌలా నగరానికి ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పటంతో 53 మంది మృతిచెందారు. స్థానిక మీడియా, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..భారీ వర్షాల కారణంగా యాండీ, దౌలా నగరాల మధ్య వంతెన కూలిపోయింది. దీంతో రోడ్డు మార్గం స్తంభించిపోవడంతో ప్రయాణికులంతా రైళ్లను ఆశ్రయించారు. కామెరూన్‌ కాలమానం ప్రకారం.. యాండీ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన రైలు.. మరి కాసేపట్లో ఎసెకా నగరానికి చేరుకుంటుందనగా.. ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 53 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 300 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారమందుకున్న రవాణాశాఖ అధికారులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఉండవల్లికి ఊపొచ్చింది

రెండున్నరేళ్ళల్లో బాబు ఏంచేసినట్లు; ఉండవల్లి



రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు.. విభజన చట్టంలోని హామీలు ఎన్ని అమలు చేశారన్న దానిపై బహిరంగచర్చకు రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. తనకే పార్టీతోనూ సంబంధం లేదని, తన వాదనలు తప్పయితే బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటానన్నారు. పట్టిసీమ, పోలవరం, అమరావతిపై చర్చకు రమ్మని అడిగాను.. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. విశాఖ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి మాట్లాడారు. ఏపీలో రాష్ర్టప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై కోర్టులో కేసు వేసిన సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌ను ఉన్మాదితో పోల్చడం అన్యాయమన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని నాడు చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదాకు మించి ప్యాకేజీ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఉండవల్లి ప్రశ్నించారు. హోదా సంజీవని కాదని బాబు చెప్పినప్పుడే టీడీపీ, బీజేపీలు కలిసే నాటకమాడాయని అర్థమైందన్నారు. 

మంత్రిగారి వాటా ఇచ్చేందుకు ఏకంగా డబ్బుతోనే విధాన సౌదకు వచ్చాడు

కర్ణాటక విధాన సౌధలో కారులో డబ్బు కలకలం; ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


కర్ణాటక విధాన సౌధ ఆవరణలోని అనుమానాస్పదంగా ప్రవేశించిన కారు నుంచి రూ.2.5కోట్లు బయటపడ్డాయి. కెంగెల్ హనుమంతయ్య ముఖద్వారం మీదగా విధాన సౌధలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోన్న కేఏ04 ఎంఎం9018 నంబర్ వోక్స్ వ్యాగన్ కారును పోలీసులు తనిఖీ చేశారు. వారి సోదాల్లో మూడు పెట్టెల్లో సర్ధిపెట్టిన నగదును గుర్తించారు.. వాహన యజమాని ధార్వాడకు చెందిన న్యాయవాది, మాజీ జడ్జి కుమారుడు సిద్ధార్థ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెండర్ కు సంబంధించి ఓ మంత్రికి ఇవ్వడానికి ఈ డబ్బు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ కారులో నుంచి రూ.1.97 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సిద్ధార్థను విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో లభ్యమైన నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవన్నారు. అయితే పొంతనలేని సమాధానాలతో పాటు, స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఆ నగదును తన వద్ద ఉంచుకున్నట్లు, అందుకు సంబంధించి పత్రాలు సమర్పించేందుకు తనకు కొంత సమయం కావాలని సిద్ధార్ధ కోరటం కొసమెరుపు.

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో మారుతున్న రాజకీయాలు; కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అఖిలేష్



ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించటం, బాబాయ్ శివ్‌పాల్‌తో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. 3నుంచి ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎస్పీ ముఖ్యనేతలతో శుక్రవారం జరిగిన సమావేశానికి అఖిలేశ్ గైర్హాజరయ్యారు. ఈ భేటీ పూర్తయ్యాక ఆ నాయకులతోనే సీఎం తన నివాసంలో వేరుగా సమావేశమై నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి మాట్లాడారు. అఖిలేశ్ కొత్త పార్టీ యత్నాలపై వార్తల నేపథ్యంలో.. ఎస్పీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.

Friday, October 21, 2016

ఇసుకాసురుల పని ఇక అయిపోనట్లే

లింగాయపాలెం ఇసుకరీచ్ లో 20 లారీలు సీజ్



ఎపి ప్రభుత్వం ఇసుక అక్రమరవాణా దారుల భరతం పట్టే ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా క్రిష్ణ, గుంటూరు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో తనిఖీలు చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సంయుక్త అధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో లింగాయపాలెంలో 20 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. గుంటూరు జిల్లాలోని లింగాయపాలెం వెంకటపాలెం రీచ్‌లలో ఈ ఇసుక లారీలను అధికారులు పట్టుకున్నారు. ఇసుక మాఫియాలో కీలకపాత్ర పోషిస్తున్నవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం హెచ్చరించినా పట్టించుకోని ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మసకబారుతున్న గుంటూరు పోలీసుల ప్రతిష్ట

పోలీసులా మజాకా...


పోలీసుల ప్రతిష్ట మంటగలిసిపోతుంది. కేసుల తారుమారు...అడ్డగోలు పంచాయితీలు...బాతధితుల పట్ల అమర్యాద ప్రవర్తన ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు అర్బన్ పోలీసుల ఘనకార్యాలు అన్నీ ఇన్నీకావు...వరుసవెంటగా వెలుగుచూస్తున్న ఆరోపణలే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ సిఐ నరసింహరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓమహిళ ఆత్మహత్య కేసులో సిఐ నరసింహరావు నిర్లక్ష్యధోరణితో వ్యవహరించారిని డిఎస్పీస్ధాయి అధికారి ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చారు. మహిళ ఆత్మ కేసు విచారణలో పైరవీలు జరిగాయని , డివిజనల్ స్ధాయి అధికారి కూడా పట్టించుకోకపోవటంతో సిఐ నరసింహరావు ఇష్టారాజ్యంగా వ్యవహరించనట్లు గుర్తించిన ఉన్నతాధికాారులు తమదైన స్టైల్ లో ప్రక్షాళన మొదలు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహరావుపై బదిలీ వేటు వేశారు. ఇదిలా ఉంటే సాక్షాత్తూ నగర నడిబొడ్డున ఉన్న అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. లంచాల కోసం పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాపురాలు నిలబెట్టాల్సిందిపోయి డబ్బుకోసం కాపురాలు కూలుస్తుండటం చూసి బాధితులు సైతం నివ్వెరపోతున్నారు. కుటుంబకలహాలను అడ్డంపెట్టుకుని లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నత కుటుంబాల వారిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ పేరుతో వేధించి ఎఫ్ఐఆర్ నమోదుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ స్ధాయి అధికారి లంచాల బాగోతం ఇప్పటికే సియంతోపాటు, డిజిపి దృష్టికి పలువురు బాధితులు తీసుకువెళ్ళారు. విధి నిర్వాహణలో మద్యం సేవించి బాధితులపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు కూడా సదరు డిఎస్పీపై ఉన్నాయి. గుంటూరు అర్బన్ పోలీసు బాస్ సైతం మహిళా పోలీస్ స్టేషన్ డియస్పీ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది ... ఇది అటుంచితే తాజాగా అర్బన్ పోలీసు కార్యాలయంలో సూపరింటెండ్ సహఉద్యోగిని పట్ల అమర్యాదగా ప్రవర్తించటంతో ఆమె కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడం కలకలం రేపింది. దీనిపై కేసునమోదు చేసి చేతులు దులుపుకోవటం మినహా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాడికొండ ఎస్.ఐ తనను రెండో పెళ్ళి చేసుకుని మోసగించాడంటూ ఓ యువతి పిర్యాదు చేసినా అతనిపై చర్యలు లేకుండానే సెలవులోకి పంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గుంటూరు అర్బన్ లో పోలీసు వ్యవస్త్ధను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మహిళా ఛైర్ పర్సన్ కారు ఢీ

నన్నపనేని రాజకుమారి కారు ఢీకొని ఒకరికి గాయాలు


గుంటూరు నగర శివారులోని నందివెలుగు రోడ్డు వద్ద ఎపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రాజకుమారి కారు ఢీకొనటంతో ద్విచక్రవాహనదారునికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్ధానికులు అతడిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనను చూసి ఒక్కసారిగా నన్నపనేని రాజకుమారి షాక్ గురయ్యారు. బిపి తగ్గిపోవటంతో ఆమెను కూడా నగరంలోని రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 



పాకిస్తాన్ తో క్రికెట్ అడేదే లేదంటున్న గంగూలీ

గంభీర్ కు బాసటగా నిలిచిన గంగూలీ; పాకిస్తాన్ తో అడేదిలేదు


పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడటం గురించి గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలకు టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ మద్దతు పలికారు. ‘భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సరిహద్దుల్లో మన దేశ సైనికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇలాంటి సమయంలో వారితో క్రికెట్‌ ఆడటం సబబు కాదని’ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది చాలా సున్నితమైన విషయం.. దీనిపై అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ వైఖరి వేరేలా ఉండొచ్చుని’ అన్నారు. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే భారత్‌, పాక్‌ల మ్యాచ్‌ల విషయం బీసీసీఐ పరిధిలోకి రాదని క్యాబ్‌ అధ్యక్షుడు గుంగూలీ వెల్లడించారు. 


ఎంతపనిచేశావే సెల్ ఫోన్...గుంటూరులో పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ మంటలు

పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం; సెల్ ఫోనే కారణం



గుంటూరు నగరంలోని కంకరగుంట ప్లైఓవర్ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు సిబ్బంది పెట్రోల్ శాంపిల్స్ తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న వాహనదారుడు సెల్ ఫోన్ రింగ్ కావటంతో స్విచ్ ఆన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు  ఎగసిపడ్డాయి. క్షణాల వ్యవధిలో తత్తరపాటుకు గురైన బంకు సిబ్బంది, వాహనదారులు అక్కడినుండి పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్ధలాన్ని గుంటూరు వెస్ట్ డిఎస్పి సరిత పరిశీలించారు. ఘటన జరిగిన తీరు మొత్తం సిసి కెమెరా పుటేజ్ లో నిక్షిప్తం కావటంతో ఆ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. మరోవైపు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేత గోపాల క్రిష్ణ అక్కడికి చేరుకుని సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వాహనదారులు వచ్చిన సమయంలో సెల్ ఫోన్ లు వినియోగించకుండా కఠినంగా హెచ్చరికలు చేయాలని బంక్ నిర్వాహకులకు సూచించారు.

మెడికల్ విద్యార్ధి సుసైడ్

ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ విద్యార్ధి రితీష్ ఆత్మహత్య




పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న బలభద్రపు రితీష్(26) బుధవారం అర్ధరాత్రి కళాశాల ప్రాంగణంలోని హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన రితీష్ ఆశ్రమ్ కళాశాలలో హౌస్ సర్జన్ కోర్సు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం కళాశాలలో జరిగిన స్పోర్ట్‌డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న రితీష్ రాత్రి 7 గంటలనుంచి కనిపించకుండా పోయాడు. విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వారు కళాశాలలోని సీసీ కెమేరాలను పరిశీలించినా ఆచూకీ లభించలేదు. అర్ధరాత్రి 2 గంటల తరువాత కళాశాలలోని హాస్టల్ భవనం వెనక భాగం కింద రితీష్ శవమై పడి ఉండడాన్ని గుర్తించారు. రితీష్ హాస్టల్ గది మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తు రితీష్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అతని తల్లిదండ్రులు వెంకట్రాజు, సుజాత పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.