Thursday, October 20, 2016

ముందే మేల్కొన్న కరుణానిధి....స్టాలిన్ రాజకీయవారసునిగా ప్రకటన

నా రాజకీయ వారసుడు స్టాలిన్; కరుణానిధి 



డీఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన కుమారుడు స్టాలిన్‌ తన తర్వాతి వారసుడని కరుణానిధి వెల్లడించారు. ఓ తమిళ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 92ఏళ్ల కరుణానిధి ఈ ప్రకటన చేశారు. అలాగే తన రిటైర్‌మెంట్‌పై వస్తున్న పుకార్లను ఖండించారు. 63ఏళ్ల స్టాలిన్‌ తన రాజకీయ వారసుడని, మరో కుమారుడు అళగిరిని ఏమాత్రం మిస్‌ కావడం లేదని స్పష్టంచేశారు. గత కొంత కాలంగా కరుణానిధి తర్వాత డీఎంకే పగ్గాలు తీసుకునే విషయంలో కరుణానిధి కుమారులు స్టాలిన్‌, అళగిరిల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే కరుణానిధి స్టాలిన్‌కు మద్దతివ్వడంతో అళగిరి పక్కకు తప్పుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరఫున ప్రచారం చేయకూడదని అళగిరి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే ప్రస్తుతం ఎఐడియంకెలో సింగిల్ మ్యాన్ గా ఉన్న జయలలిత అనారోగ్య పరిస్ధితుల్లో ఆసుపత్రి పాలు కావటంతో ఆపార్టీలో రాజకీయ వారసత్వంపై శూన్యత అవరించటం స్పష్టంగా తమిళనాట కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈనేపద్యంలోనే వయస్సు మీదపడిన నేపధ్యంలో డిఎంకెకు అలాంటి పరిస్ధితి రాకుండా ముందుగానే కరుణానిధి మేల్కొని రాజకీయ వారసునిగా స్టాలిన్ ను ప్రకటించి ఉండవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment