పోలీసులా మజాకా...
పోలీసుల ప్రతిష్ట మంటగలిసిపోతుంది. కేసుల తారుమారు...అడ్డగోలు పంచాయితీలు...బాతధితుల పట్ల అమర్యాద ప్రవర్తన ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు అర్బన్ పోలీసుల ఘనకార్యాలు అన్నీ ఇన్నీకావు...వరుసవెంటగా వెలుగుచూస్తున్న ఆరోపణలే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ సిఐ నరసింహరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓమహిళ ఆత్మహత్య కేసులో సిఐ నరసింహరావు నిర్లక్ష్యధోరణితో వ్యవహరించారిని డిఎస్పీస్ధాయి అధికారి ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చారు. మహిళ ఆత్మ కేసు విచారణలో పైరవీలు జరిగాయని , డివిజనల్ స్ధాయి అధికారి కూడా పట్టించుకోకపోవటంతో సిఐ నరసింహరావు ఇష్టారాజ్యంగా వ్యవహరించనట్లు గుర్తించిన ఉన్నతాధికాారులు తమదైన స్టైల్ లో ప్రక్షాళన మొదలు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహరావుపై బదిలీ వేటు వేశారు. ఇదిలా ఉంటే సాక్షాత్తూ నగర నడిబొడ్డున ఉన్న అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. లంచాల కోసం పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాపురాలు నిలబెట్టాల్సిందిపోయి డబ్బుకోసం కాపురాలు కూలుస్తుండటం చూసి బాధితులు సైతం నివ్వెరపోతున్నారు. కుటుంబకలహాలను అడ్డంపెట్టుకుని లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నత కుటుంబాల వారిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ పేరుతో వేధించి ఎఫ్ఐఆర్ నమోదుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ స్ధాయి అధికారి లంచాల బాగోతం ఇప్పటికే సియంతోపాటు, డిజిపి దృష్టికి పలువురు బాధితులు తీసుకువెళ్ళారు. విధి నిర్వాహణలో మద్యం సేవించి బాధితులపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు కూడా సదరు డిఎస్పీపై ఉన్నాయి. గుంటూరు అర్బన్ పోలీసు బాస్ సైతం మహిళా పోలీస్ స్టేషన్ డియస్పీ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది ... ఇది అటుంచితే తాజాగా అర్బన్ పోలీసు కార్యాలయంలో సూపరింటెండ్ సహఉద్యోగిని పట్ల అమర్యాదగా ప్రవర్తించటంతో ఆమె కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడం కలకలం రేపింది. దీనిపై కేసునమోదు చేసి చేతులు దులుపుకోవటం మినహా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాడికొండ ఎస్.ఐ తనను రెండో పెళ్ళి చేసుకుని మోసగించాడంటూ ఓ యువతి పిర్యాదు చేసినా అతనిపై చర్యలు లేకుండానే సెలవులోకి పంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గుంటూరు అర్బన్ లో పోలీసు వ్యవస్త్ధను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment