Saturday, October 22, 2016

ఉండవల్లికి ఊపొచ్చింది

రెండున్నరేళ్ళల్లో బాబు ఏంచేసినట్లు; ఉండవల్లి



రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు.. విభజన చట్టంలోని హామీలు ఎన్ని అమలు చేశారన్న దానిపై బహిరంగచర్చకు రావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. తనకే పార్టీతోనూ సంబంధం లేదని, తన వాదనలు తప్పయితే బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటానన్నారు. పట్టిసీమ, పోలవరం, అమరావతిపై చర్చకు రమ్మని అడిగాను.. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. విశాఖ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి మాట్లాడారు. ఏపీలో రాష్ర్టప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై కోర్టులో కేసు వేసిన సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌ను ఉన్మాదితో పోల్చడం అన్యాయమన్నారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని నాడు చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు హోదాకు మించి ప్యాకేజీ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఉండవల్లి ప్రశ్నించారు. హోదా సంజీవని కాదని బాబు చెప్పినప్పుడే టీడీపీ, బీజేపీలు కలిసే నాటకమాడాయని అర్థమైందన్నారు. 

No comments:

Post a Comment