బ్రహ్మచారులకు వీసాలు ఇవ్వనంది అమెరికా; రాందేవ్ బాబా
పెళ్ళి చేసుకోని బ్రహ్మచారిననే అమెరికా ఒకప్పుడు తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. అయితే ఆ తర్వాత న్యూయార్క్‌లో ఓ సభలో ప్రసంగించాలని అమెరికా తనను ఆహ్వానిస్తూ పదేళ్ల వీసా మంజూరు చేసిందన్నారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమావేశంలో రాందేవ్ ఆయన తొలి వీసా అనుభవం గురించి గుర్తుచేసుకున్నారు. అమెరికా వీసా కోసం తొలిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు నిరాకరించారు. కారణం అడిగితే.. బాబాజీ మీరు బ్రహ్మచారి, మీకు బ్యాంకు ఖాతా లేదన్నారు. అయితే ఇప్పటికీ నాకు బ్యాంకు ఖాతా లేదు’ అని రాందేవ్‌బాబా చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన రూ.4,500 కోట్ల విలువైన పతంజలి గ్రూప్ సంస్థలను నడిపిస్తుండటం విశేషం.
No comments:
Post a Comment