Monday, October 17, 2016

వీణా , వాణీలను వేరు చేసేందుకు ఏర్పాట్లు

వీణా,వాణీలను వేరు చేసేందుకు అస్ట్రేలియా వైద్యులతో ; టి సర్కార్ సంప్రదింపులు



ఆస్ట్రేలియాలో అభిభక్త కవలలను ఆపరేషన్ చేసి విజయవంతంగా వేరు చేయడంతో వాణా వాణీలకు అదే ఆసుపత్రిలో చికిత్స చేయించే్ందుకు మెల్‌బోర్న్‌లోని తెలంగాణ ఫోరం ఇన్‌ కార్పోరేషన్ వాలంటరీస్ ప్రయత్నిస్తోంది. వీణా వాణీల డీఎస్సీ రిపోర్టు పంపాలని సెప్టెంబర్ 14 నిలోపర్ ఆసుపత్రిని ఆస్ట్రేలియాలోని ఆర్‌సీహెచ్ ఆసుపత్రి కోరిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. కానీ సమాచారం ఇవ్వడానికి నిలోపర్ వైద్యులు ఆలస్యం చేశారని తెలిపింది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించామని చివరకు అక్టోబర్ 14న వీణా వాణిల మెడికల్ రిపోర్టును హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి అందజేశామని తెలంగాణ పోరం సభ్యులు తెలిపారు. అదే రోజున ఆయన కొరియర్ చేశారని వచ్చేవారం అది ఆస్ట్రేలియా చేరగానే ఆర్‌సీహెచ్ గ్లోబల్ ఆసుపత్రికి అందజేస్తామని తెలంగాణ పోరం తెలిపింది.

No comments:

Post a Comment