కోలుకుంటున్న అమ్మ; దీపావళికి ముందే ఆసుపత్రి నుండి ఇంటికి
తమిళనాడు సీఎం జయలలిత మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. దీపావళి పండుగకు ముందుగానే జయ ఇంటికిచేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్వరం, డీహైడ్రేషనతో గత నెల 22వ తేదీన జయలలిత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని అపోలో వైద్యులు, ఇంగ్లాండ్ వైద్య నిపుణుడు డాక్టర్ జాన రిచర్డ్ బీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం జయలలిత పూర్తిగా కోలుకున్నారని, అయితే, వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. వెంటిలేటర్ తొలగించడంతో సాధారణంగానే శ్వాస తీసుకోగలుగుతున్నారు. బుధవారం లండన్ వెళ్లిన డాక్టర్ జానరిచర్డ్ బీలే నాలుగు రోజుల తర్వాత మళ్లీ చెన్నై రానున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆయన రాగానే జయను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నాయి. అమ్మ కోలుకోవడం వల్లే న్యూస్ బులెటిన్ విడుదల చేయడంలేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుండగా ఎంజీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ హెచవీ హండే విలేకరులతో మాట్లాడుతూ.. ఎంజీఆర్‌లాగే జయ కూడా మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటపడతారని పేర్కొన్నారు. ఎంజీఆర్ పక్షవాతంతో ఆస్పత్రిలో ఉన్నపుడు.. ఆయన పని అయిపోయిందంటూ ప్రతిపక్షాలు వదంతులు సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఎంజీఆర్ కోలుకుని తిరిగి పాలనా పగ్గాలు చేపట్టారన్నారు.

No comments:
Post a Comment