Friday, October 28, 2016

మీడియాపై ఆంక్షలు ఉండవ్

మీడియాపై అంక్షలకంటే స్వీయ నియంత్రణే మేలు;  వెంకయ్య నాయుడు


భారత ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియాపై నియంత్రణ విధించాలన్న ఉద్దేశం కేంద్రప్రభుత్వానికి లేదన్నారు. అయితే మీడియా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్‌ మీడియా వెర్రితలలు వేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా ఉందని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రజలు భావవ్యక్తీకకణను రక్షిస్తున్నారని, ఆర్థికాభివృద్ధి కంటే దీనికి విలువెక్కువన్నారు. మీడియా నియంత్రణకు కొత్త బిల్లేమీ అక్కర్లేదన్నారు. మీడియా నిబంధనలు ఉల్లంఘిస్తే అడ్డుకునేందుకు చట్టాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘స్వేచ్ఛ విలువ తెలిస్తేనే భావవ్యక్తీకరణను సద్వినియోగం చేయగలం. ఈ స్వేచ్ఛను న్యాయబద్ధంగా ఉపయోగించకుంటే జోక్యం చేసుకునేందుకు చట్టాలున్నాయి. ఏ మీడియానైనా నియంత్రించేందుకు కొత్తఆంక్షలు పెట్టాలని సర్కారు యోచించడం లేదు. అయితే అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాం. జాతి వ్యతిరేకతను ప్రబోధించరాదని, అసభ్యత, అశ్లీలత, హింసలను ప్రోత్సహించరాదని మీడియాపై ఆంక్షలున్నాయన్నారు.

No comments:

Post a Comment