Thursday, October 20, 2016

పామాయిల్ కుంభకోణం...గుంటూరు మహిళా శిశు సంక్షేమ శాఖలో కలకలం

అంగన్ వాడీ కేంద్రాల పామాయిల్ స్వాహా...40లక్షల గోల్ మాల్


మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలింతలు, గర్భిణులు, పిల్లల పేర్లతో నిధులు స్వాహా చేశారు. లోకాయుక్తకు ఫిర్యాదులు అంద టంతో రంగంలోకి దిగిన అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి భోక్తలపై వేటు వేశారు. జిల్లా అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని శాఖ కమిషనర్‌ ప్రభుత్వాని కి నివేదిక పంపారు. మహిళాశిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం గుంటూరు వచ్చిన తరువాత జిల్లాలో తొలి సారి సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలో ఒక్కొక్క అంగన్ వాడీ కేంద్రాలకు నెలకు 48 పామాయిల్‌ ప్యాకెట్‌లు సర ఫరా చేస్తారు. జిల్లాలోని 5,500 అంగన్ వాడీ కేంద్రాలకు ప్రతి నెలా వీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశా లు ఇచ్చింది. కిలో ప్యాకెట్‌ రూ.68 చొప్పున మార్కెట్‌లో అమ్ముతుండగా జిల్లాలో రూ.73 చొప్పున కొనుగోలు చేసిన ట్లు బిల్లులు డ్రా చేశారు. 2015లో మూడు నెలల పాటు ఈ విధంగా నిధులు డ్రా చేసినట్లు తేలింది. దీనిపై కొంత మంది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన లోకాయుక్త ఒక్కొక్క ప్యాకెట్‌కు రూ.5 చొప్పున మూడు నెలల పాటు సుమారు 40 లక్షలు స్వాహా అయినట్లు తేల్చింది. పామాయిల్‌ కుంభకోణంలో సూపరింటెం డెంట్‌ ప్రసాద్‌, ఏపీడీ వసంతబాల, సీనియర్‌ అసిస్టెంట్‌ దస్తగిరిలను సస్పెండ్‌ చేస్తూ మ హిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ చిరంజీ వి బుధవారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు. మ హిళా శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మలపై చర్య లు తీసుకోవాలని శాఖ కార్యదర్శి జయ లక్ష్మి, ప్రిన్సిపల్‌ సెక్రటరి పూనం మాలకొండ య్య కు నివేదిక పంపారు. వారు గురువారం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నెలల పాటు కుంభకోణానికి సహకరించిన 12 మంది సీడీపీవోలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అంగన వాడీ కేంద్రాల్లో పామాయిల్‌కు ఎక్కువ బిల్లు లు డ్రా చేయడానికి సీడీపీవోలు సహకరిం చారని లోకాయుక్త దర్యాప్తులో తేలింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయడానికి రంగం సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment