మావోల మృతదేహాలపై హైకోర్టు అదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల (ఏఓబీ) సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఈ నెల 27 వరకు భద్రపరచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉదంతంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మృతదేహాలను ఉభయ రాష్ట్రాల పరిధిలోకి తీసుకొస్తే వాటిని ఈ నెల 27వ తేదీ వరకు భద్రపరచాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
No comments:
Post a Comment