రాజధాని నిర్మాణంకోసం కేంద్రం పంపిన నిధులు ఏమయ్యాయ్...
రాజధాని నిర్మాణం మొదలెట్టకుండానే నిధులు ఖర్చైపోయాయి
రాజధాని అమరావతి నిర్మాణం ఇంకా ప్రారంభించకుండానే కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఎపి ప్రభుత్వం ఖర్చుచేసేసింది. వినటానికి అశ్ఛర్యంగా ఉన్నా ఎపి ప్రభుత్వం కేంద్రానికి పంపేందుకు సిద్ధం చేస్తున్న పత్రాలు వాస్తవాలను బట్టబయలు చేసేవిగా ఉన్నాయి.
నిర్మాణంలో కీలక భవనాలకు ఇంకా పునాదులు పడకముందే కేంద్రమిచ్చిన రూ.850 కోట్లు ఖర్చయిపోయాయి. ఈ మొత్తానికి రాష్ట్ర అధికారులు వినియోగ పత్రాలు (యుసిలు) కూడా సిద్ధం చేసేస్తున్నారు. ఒకటి రెండు వారాల్లో ఈ ధ్రువీ కరణ పత్రాలను కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయిరచిరది. నూతన రాజధానికి కీలకమైన ప్రభుత్వ భవన నిర్మాణాలకు అవసరమైన నిధులో తొలి విడతగా రూ.850 కోట్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆ పనులేవీ కనీసం పునాది స్థాయికైనా చేరుకోలేదు. వాస్తవానికి హైకోర్టు, రాజభవన్ వంటి భవనాలు ఎక్కడ నిర్మిరచాలనేదీ ఖరారు కాలేదు. సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన మ్యాప్‌లో కొరత స్థలాన్ని ఖరారు చేసినా, ఆ డిజైన్లు కూడా మళ్లీ మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పైసా ఖర్చు కాలేదు. అరదువల్ల ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగించుకుంది. ప్రధానంగా కృష్ణా పుష్క రాలు, తాత్కాలిక సచివాలయం, రుణమాఫీ వంటి ఇతర రంగాలకు ఈ నిధులు వినియోగించుకున్నారు. వివిధ రంగాలకు కేంద్రం ఇస్తున్న నిధులను ఖర్చు చేసి, వాటి వినియోగ ధ్రువీకరణ పత్రాలను ఇస్తే తప్ప కొత్త నిధులు ఇవ్వబోమని కేంద్రం తాజాగా తేల్చి చెప్పడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు యుసిలు ఇవ్వాలని ప్రయత్నిస్తోరది. ఈ నేపథ్యంలోనే రాజభవన్, హైకోర్టు వంటి వాటి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 850 కోట్లను కూడా ఖర్చు చేసినట్లు పత్రాలను పంపేందుకు రంగం సిద్ధం చేసిరది. ఈ ఖర్చు వివరాలు కోరుతూ కొరతమంది సమాచార చట్టాన్ని ఆశ్రయించగా, వారికి త్వరలోనే యుసిలను కేంద్రానికి పంపిస్తామని చెప్పాలని నిర్ణయించారు. ఇటువంటి యుసిలపై కేంద్రం కూడా దృష్టి సారిస్తోంది. వాస్తవంగా దేనికి ఇచ్చిన నిధులు దానికే ఖర్చు చేస్తున్నారా.. లేదా.. అనేది నిర్ధరించుకునేందుకు పిఎఫ్‌ఎంఎస్ అనే విధానాన్ని కూడా అమలులోకి తీసుకువస్తోరది. ఖర్చులను పిఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేయాలని కూడా ఇటీవల స్పష్టం చేసిరది. అయితే కేంద్రం తమపై ఎటువంటి ఆక్షేపణలూ చేయడం లేదని చెప్పే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండటం విశేషం. మరోవైపు ప్రభుత్వం కేంద్రానికి నిధుల ఖర్చుకు సంబంధించి పత్రాలు పంపితే దీనిపై కోర్టులో పిటీషన్ వేసేందుకు వైసిపి నేతలు సిద్ధమౌతున్నారు.
No comments:
Post a Comment