నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ డిసెంబరు నెలాఖరులో విడుదల కానుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 94 పోస్టులను నోటిఫై చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తయారుచేసిన కొత్త సిలబస్ ప్రకారం కొత్త గ్రూప్-1 సర్వీసెస్ రాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష విధానం మాత్రం పాతదే. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. 2011 తర్వాత మళ్లీ ఇప్పటి వరకు గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన సదరు నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమ్స్ ‘కీ’పై అభ్యంతరాలు రావడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో గతంలో నిర్వహించిన మెయిన్స్‌ను రద్దు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ఇటీవల మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం ఆ జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతోంది. డిసెంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించి సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.
No comments:
Post a Comment