నవంబర్ నుండి ఎపిలో పత్తికొనుగోళ్ళు
సిసిఐ పత్తికొనుగోళ్ళు నవంబరు 2 నుండే; ఎపి మార్కెటింగ్ కమిషనర్ మల్లిఖార్జున్
రాష్ట్రంలో సీసీఐ ద్వారా నవంబరు 2 నుంచి పత్తి కొనుగోళ్లు చేయడానికి సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావు బుధవారం వెల్లడించారు. కనీస మద్దతు ధర రూ.4160గా నిర్ణయించినట్టు చెప్పారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 26 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గుంటూరులో 10, కృష్ణాలో 7, కర్నూలులో 8, పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూర్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నవంబరు 10 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 17 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. కొనుగోళ్లలో టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ను తేవడంతో అక్రమాలకు తావుండదన్నారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు.
No comments:
Post a Comment