పోలీసుల త్యాగాలు మరువలేనివంటున్న చంద్రబాబు
పోలీసుల త్యాగనిరతి గొప్పది, వారి సేవలు మరువలేనివి; ఎపి సియం చంద్రబాబు
పోలీసుల త్యాగ నిరతి వల్లే సమాజం సురక్షితంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఏపీ పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసులపై ఆయన ప్రశంసలు జల్లు కురిపించి, ఈ ఏడాది కూడా పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లు కేటాస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల కోసం విజయవాడలో ఆస్పత్రి నిర్మాణం, విశ్రాంతి భవనం, విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు రూ.5లక్షల బీమా ఇస్తామని, వచ్చే ఏడాది మంగళగిరి 6వ బెటాలియన్ లో శాశ్వత పోలీస్ సంస్మరణ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసులు సమాజం కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నారన్నారు.
సమాజం కోసం ప్రాణాలు అర్పిస్తున్న పోలీసులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘవిద్రోహ శక్తుల గుండెల్లో పోలీసులు నిద్రపోవాలని అన్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో పోలీసులు ముందంజలో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment