జగన్ ,చంద్రబాబులపై ఉండవల్లి నిప్పులు
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి కనీసం ఓటింగ్ కూడా పెట్టించలేకపోయారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను కూడా అమలు చేయించేకోలేని దుస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందని.. దానిని అమలు చేయించుకోవడం పక్కన పెట్టి ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించడం తగదని సూచించారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు అసలు అంశాలను పక్కన పెడుతున్నాయని అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10వేల కోట్లు నల్లదనం వెల్లడించిన వారి పేరు బయటపెట్టాలని.. లేనిపక్షంలో గోప్యంగా ఉంచాల్సిన వివరాలు వెల్లడించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment