ఎంతపనిచేశావే సెల్ ఫోన్...గుంటూరులో పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ మంటలు
పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం; సెల్ ఫోనే కారణం
గుంటూరు నగరంలోని కంకరగుంట ప్లైఓవర్ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు సిబ్బంది పెట్రోల్ శాంపిల్స్ తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న వాహనదారుడు సెల్ ఫోన్ రింగ్ కావటంతో స్విచ్ ఆన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల వ్యవధిలో తత్తరపాటుకు గురైన బంకు సిబ్బంది, వాహనదారులు అక్కడినుండి పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్ధలాన్ని గుంటూరు వెస్ట్ డిఎస్పి సరిత పరిశీలించారు. ఘటన జరిగిన తీరు మొత్తం సిసి కెమెరా పుటేజ్ లో నిక్షిప్తం కావటంతో ఆ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. మరోవైపు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేత గోపాల క్రిష్ణ అక్కడికి చేరుకుని సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వాహనదారులు వచ్చిన సమయంలో సెల్ ఫోన్ లు వినియోగించకుండా కఠినంగా హెచ్చరికలు చేయాలని బంక్ నిర్వాహకులకు సూచించారు.
No comments:
Post a Comment