చంద్రబాబు కుటుంబ ఆస్ధులు వెల్లడించిన లోకేష్
వరుసగా ఆరోపర్యాయం ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం తమ ఆస్ధుల వివరాలను వెల్లడించింది. బాబు తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు టిడిపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమక్షంలో ఆస్ధుల వివరాలను ప్రకటించారు. దేశంలో కుంటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం తమదేనన్నారు. 24ఏళ్ళ క్రితం ప్రారంభించిన హెరిటేజ్ వల్లే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తలేదన్నారు. గత ఏడాది హెరిటేజ్ టర్నోవర్ 2381కోట్లుకాగా, అదాయం 55కోట్లుగా నమోదైందన్నారు. సంస్ధ అదాయం వందశాతం పెరిగగా 5వేల మందికి ప్రత్యక్షంగా, మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాది చూపిస్తున్నామన్నారు. బ్రహ్మణి హెరిటేజ్ బాధ్యతలు చూస్తున్నారని రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తే పోటీచేస్తానన్నారు. వైసిపి నేతలు తనపై బురదజల్లుతుంటే రోజు శీలపరీక్ష చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని, మతాన్ని అడ్డంపెట్టుకుని ప్రాంతాలమధ్య, ప్రజల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. కంపెనీలు పెట్టకుండా అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు రైతులను రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో తలదూరుస్తున్నానంటూ ప్రతిపక్షపార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. లోకేష్ వెల్లడించిన చంద్రబాబు కుంటుంబ ఆస్దులను ఓసారి పరిశీలిస్తే.....
చంద్రబాబు ఆస్ధుల వివరాలు;
చంద్రబాబు మొత్తం ఆస్తులు; 3.73 కోట్లు
హైద్రబాదులో నివాసం విలువ; 3.68లక్షలు
అంబాసిడర్ కారు విలువ; 1.52లక్షలు
బ్యాంకు ఖాతాలోని నగదు; 3.59లక్షలు
చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం; 3.06కోట్లు
భువనేశ్వరి ఆస్ధుల వివరాలు;
భువనేశ్వరి మొత్తం ఆస్ధులు; 38.66కోట్లు
పంజాగుట్టలో స్ధలం; 73లక్షలు
తమిళనాడులో భూమి; 1.86కోట్లు
మదీనాగూడలోని భూమి; 73లక్షలు
హెరిటేజ్ ఫుడ్స్ లో వాటాలు; 19.95కోట్లు
వివిధ కంపెనీల్లో వాటాలు; 3.23కోట్లు
కారు విలువ;91లక్షలు
మొత్తం అప్పులు ; 13కోట్లు
నికర ఆస్ధులు; 24.84కోట్లు
లోకేష్ ఆస్ధుల వివరాలు;
హెరిటేజ్ ఫుడ్స్ లో వాటాలు; 2,52కోట్లు
ఇతర కంపెనీల్లో వాటాలు; 1.64కోట్లు
కారు విలువ; 93లక్షలు
మొత్తం ఆస్ధులు; 14.50కోట్లు
మొత్తం అప్పులు; 6.35కోట్లు
నికర ఆస్ధులు; 8.15కోట్లు
బ్రహ్మణి ఆస్ధుల వివరాలు;
మాదాపూర్ లో భూమి; 17లక్షలు
జూబ్లీహిల్స్ లో నివాసం; 3.50కోట్లు
చెన్నైలో వాణిజ్య స్ధలం; 48లక్షలు
మనికొండలో స్ధలం విలువ 1.23కోట్లు
లోకేష్ తనయుడు దేవాన్ష్ ఆస్ధుల వివరాలు;
జూబ్లీహిల్స్ లో ఇంటి విలువ; 9.17కోట్లు
ఫిక్స్ డ్ డిపాజిట్లు; 2.4కోట్లు
నగదు నిల్వ; 2.31లక్షలు
No comments:
Post a Comment