Thursday, October 20, 2016

బాలయ్య చిత్రంలో నటించనున్న అమితాబ్

బాలయ్య 101చిత్రంలో నటించనున్న అమితాబ్



బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే బాలకృష్ణ 101వ సినిమాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేయాలనే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. వందో చిత్రంగానే ‘రైతు’ తెరకెక్కుతుందని ప్రచారం సాగింది. అంతలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథ విని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ‘రైతు’ని 101వ చిత్రంగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. అందులో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ నటించే అవకాశాలున్నట్టు తెలిసింది. ఆ పాత్ర గురించి చెప్పడానికే బాలకృష్ణ, కృష్ణవంశీ కలిసి ముంబైకి వెళ్లినట్టు సమాచారం. ‘సర్కార్‌3’ సెట్‌లో ఉన్న అమితాబ్‌ బచ్చన్‌తో సమావేశమయ్యారు. ‘సర్కార్‌ 3’ని తెరకెక్కిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతోనూ బాలకృష్ణ కాసేపు ముచ్చటించారు

No comments:

Post a Comment